Friday, September 26, 2008

మదురానగరిలో 2:-నీ తొలి చూపులో నన్ను నేను మరచినా..




నా మొదటి ప్రేమ లెఖ రాసి రెండు వారాలు అయింది.కనిపెడతాం అంటూ వెళ్ళిన మా రేంజర్లు దొంగలతో రన్నింగ్ రేస్లో వోడిపోయిన పోలీస్ మొహాలతో తిరిగి వచ్చారు.

లొకేషన్:-భాగ్యనగరం,వెంగల్ రావ్ నగర్ చౌరస్తా
సమయం:-కారు మబ్బులు అకాశాన్నీ/మనసునీ కమ్మిన వేల...

రోజూలానే
క్రికెట్ అవ్వగానే పాని పూరి తినాలని బయలుదెరాము నేను మా భక్క శీనుగాడు నా చేతక్(బజాజ్) మీద.నా స్కూటర్, అంటే మా పెదనాన్న గారు 1978లో మా నాన్న గారికి ఇస్తే,నాకు సంక్రమించిన మాస్టర్ పీస్ .దాని పైన వెల్తూ వుంటే అందరు మమ్మల్నే చూస్తుంటారు.పిల్లలు ఇదెదో కొత టైపు ద్విచక్ర వాహనమని.పెద్దలు ఇలాంటివి ఇంకా తయారు చేస్తున్నారా అని.

మా
ఇంటి దగ్గర ఐతె రూపయకి మూడే అని ఇక్కడయితే నాలుగు పాని పూరిలు వస్తాయని,మదురా నగర్<->వెంగల్ రావ్ నగర్ చౌరస్తా దగ్గర వున్న గప్-చుప్ బండికి తీసుకొచ్చాడు శీనుగాడు.


ఎమి తింటావురా శీను...
కట్లెట్ ,సమోసా, పాని పూరి,భెల్ పూరి,దహి పూరి...

అవన్ని నువ్వు పర్స్ మర్చిపోని రోజు ఆర్డర్ చేద్దాం గాని రెండు సమొసా చెప్పు.
శీను ఆర్డర్ చెసే లోపే అమ్మయి వచ్చి టూ ప్లేట్ దహి పూరి సలీమన్నా అని చెప్పి పక్కనే స్కూటి దగ్గర వున్న తన ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళింది...

శీనుగాడు అభోవ్ సూపరు ఫాస్టు అంటుండగానే , నేను స్కూటి దగ్గర వుండే అమ్మాయిని చూస్తూ...

తనే రా...

ఎంటీ?

తనే
రా...

అవును
రొయ్...

యెత్తు 5'6"
ఒకే

కలర్ 'చామంచ్చాయ ' ఒకే....

కాని
వైట్ డ్రస్ వేసుకోలేదు మామ... ఆర్ యు స్యూర్?

నేను
అమ్మయి వైపే చూస్తూ , తను తిన్న ప్లేట్లోనే తినాలని వెయిట్ చేసే లోపు సీను గాడు రెండో రౌండ్ కి రెడి అయ్యాడు...


అలా చూస్తూ వుండగానే తన స్కూటి స్టార్ట్ చేసింది,మేము "హమారా బజాజ్.." స్టార్ట్ చేసాము...





ఇలా వెనకాల నుంచి దొంగ చాటూగా ఫాలో అవుతున్నాం అని ఫీల్ అవ్వకు రా ,ఏదో ఒక రోజు నీ స్కూటరులో నువ్వు ముందు ,పోరి వెనకాల...

అంటే జీవితాంతం నాకు ఈ స్కూటరే అని డిసైడ్ అయ్యిపొయ్యావా...
అప్పటివరకూ తనకి యేమి తెలినట్టే వున్నా,స్కూటి ఇంటి మెట్ల పక్కన పార్క్ చేసి , పరిహాసం చెస్తున్న తన ఫ్రెండ్తో లోపలకి వెల్తూ నావైపు చూసిన తొలి చూపు....

కంటి చూపుతో చంపేయడం అంటే ఇదేనెమో అన్నాడు శీను నా వైపు చూస్తూ.
ఆ నిమిషం 'మెరుపెదో నా మీద ప్రసరించలే..' అనట్టు అనిపించింది. తల పైకెత్తి ఆకశం వైపు చూడగానే...


నుదిటి మీద మొదటి చినుకు...


"ఆ నింగిని వీడి,చినుకల్లే నను చేరి.."






అప్పుడెప్పుడో హైదరాబాదు విమానాశ్రయం పైన మాత్రమే పడినట్టు, నాకోసమే ,నా మీదే పడుతోంది వానంతా అనిపిచింది.
"వరదల్లే మారి,ని ప్రెమలో ముంచెత్తావే వయ్యారి..."


శీనుని నడచి వెళ్ళమని చెప్పి :),అక్కడే వుండిపోయాను ఇంటి కిటికీ వైపు చూస్తూ...


"ని ప్రేమసాగరంలో పయనం,తెలియనీదె సమయం..."

రోజు రాత్రి :- 102 జ్వరం వచ్చేలా వర్షంలో ఎందుకు తడిచావ్ నాన్నా అని అమ్మ అంటుంటే నాకు మటుకు ' ఎక్కడికో వెల్లిపొయననే ' ఫీలింగ్లో తన తొలి చూపునే రివైండ్/ప్లె చేసుకుంటూ రాసిన చిన్ని లేఖ.


"అదుపే లేని నా వేగం,చెరాలే నా ఊహా లోకం..."

నా->ని

Thursday, September 18, 2008

మదురానగరిలో:- నా మొదటి ప్రేమ లేఖ...




లొకేషన్:భాగ్యనగరం మదురానగరిలో..
సమయం: చూపు సోకని సంధ్యవేల...


ఎంది నానిభై ఎప్పుడూ లెనిది రెండు సార్లు బాతులా సున్నా స్కోర్కే అవుట్ అయ్యావ్...

క్రికెట్ అంటు బయలుదేరిన నానిగాడు..
చక్కని చుక్కని చూసి ,క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
ఎక్కడో చూసినట్టుంది ఎవరా పోరి...
ఫ్రెండ్స్ తో కలసీ ఆరా తీశాడు ఫీల్డుకి చేరీ...


ఇంతకి ఎలా వుంటదిరా భై....


పొడవు 5'6'' ,రంగు చామంచాయ,వైట్ డ్రెస్ వేసుకోని వుంటది.


దూరదర్షన్లో 'కనబడుటలెదూ' అన్నట్లు చెప్పెవ్ గా...

మీకర్దం కాదురా వదిలేయండి.....


ఒకే ఒకే సమజ్ గయా...

5'11'' ఇంచస్ కింగులాంటి నానిగాడు 5'6'' -- కి పడిపోయాడు:)

రేయ్ బండ్లు తీయండిరా వెతుకుదాం.అంటే టటా సుమోలు కాదులేండీ హీరో రేంజర్లు.

వాల్లు వెతుకుతుంటే ..
నేను 'చూపు సోకిని సంధ్య వేల నిన్ను చూసిన మదురమే' అనుకుంటూ రాసిన మొదటి ప్రేమ లేఖ.

Blame my teachers and not me for my handwriting:)

నాని

Sunday, September 7, 2008

బాబోయ్ డెన్వర్:-ది మైల్ హై సిటీలో మా డ్యాన్స్....

ఈ డెన్వర్ ట్రిప్ గురించి ఎప్పటినుంచో రాయలనుకూంటున్నా ,ఇ వీకెండ్ ఇంట్లోనే వుండేలా చేసిన హేన్నా హరిక్కేన్ దానికి తెర లేపింది:).

డెన్వర్ ట్రిప్ అనగానే నెల ముందు నుంచే కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది నాకు మా పప్పక్క అలియాస్ రాధికా రాణిగారికి.అమెరికాకి వచ్చెదాక మనకి డెన్వర్ అంటే తెలిసింది ఈ-టీవిలో వచ్చె బాబొయ్ డెన్వర్ కార్టూన్ మాత్రమే.మమూలుగా ఐతే సమ్హీ పుట్టినరోజుకి జులైలో వెల్లే మేము ఈసారి మార్చ్ లోనే రేడీ అయ్యాము.దానికి కారణం మీకు ఇంటర్వెల్ లోపు తెలుస్తుంది లేండి.









డెన్వర్:- నాకు ఇంకో పెరు కూడ వుంది ఎంటో తెలుసా భాషా:), కాదు 'దా మైల్ హై సిటీ'.అల నాకు మారుపేరు ఎందుకొచ్చిందంటే సముద్ర మట్టానికి నెను కరెట్టుగా ఒక మైలు ఎత్తున వున్నాను.

ఊరు నుంచి తాతయ్య వాల్లు వస్తే జ్వరమని చెప్పి స్కూల్ ఎగ్గొటినట్టూ, ఆఫీస్కి హాఫ్ డే డుమ్మా కొట్టీ బయలుదేరాము ఫిల్లి అంతర్జాతీయ్య విమానాస్రయానికి.కష్టపడి పార్కింగ్ సంపాదించ్చి ,పొకనోస్ 'దా స్కి రిసార్ట్' నుంచి బయలుదేరి వచ్చిన బాబు అన్న & ఫ్యామిలీని కలిసాము.సెకురిటి చెక్ అవ్వగానే కాసేపు స్నాక్స్ బార్లో కూర్చున్నాము.దాంట్లో బార్ కంటే స్నాక్స్ ఎక్కువగా చూసుకోని:), బాబు అన్న సీనియర్ ,మా ఫేవెరైట్ డైరెక్టర్ గమ్యం క్రిష్ గారి గురించి మట్లాడుతూండగానే మా బోర్డింగ్ కాల్ వినిపిచ్చింది.

ఫ్రీ సినిమా క్లయిమాక్స్ చెరుకోగానే డెన్వర్ దగ్గరపడిందని పైలట్ చెప్పారు.ఐఫోన్లో చోటి ఫొటోలు తియ్యగానే,రాత్రి ఏడు గంటలకి డెన్వర్లో ల్యాండ్ అయ్యాము..

డే/నైట్ వన్



పైలట్ కి తోడుగా కొ-పైలట్ వున్నట్టు ,సమ్మర్కి తోడుగా ఇక్కడ బార్బెకివ్ వుంటుంది.ఇల ఫ్రెషప్ అవ్వగానే అల సునీల్ బాబాయ్ బార్బెకివ్ మొదలెట్టారు బల్కనీలో.ఒకటా రెండ ఇంక మవల్ల కాదు బాబొయ్/బాబాయ్ అనె దాక చెస్తునేవున్నారు.నానమ్మ జెమిని టీవిలో సీరియల్లు చూస్తూ ,వచ్చె ఎపిసొడ్లో జరగబోయెది కూడ చెప్పెస్తూ వుంటే,మేము కబుర్లు చెప్పుకుంటూ సమ్హితా,సంప్రీత్లతో ఆడుకుంటూ ఆరోజుకి విడ్కొలు పలికాము.

రెండవ రోజు


ఒ పక్క సంప్రీత్ మొదటి పుట్టినరోజు వేడుకల ఎర్పాట్లు సెరవెగంతో సాగిపొతుంటే మరో పక్క మమ్మల్ని డెన్వర్ పర్యటనకు తీసుకువెల్లారు.రెడ్ రాక్స్ యాంఫి థియేటర్తో మొదలెట్టాము.ప్రముఖ రాక్ బ్యాండ్లెన్నో ఇక్కడే వాల్ల మొదటి పెర్ఫామెన్స్ ఇచ్చారు.కాసేపు ట్రెక్కింగ్ చేసి,కొండపై వున్న రాక్ ముసియంలోఫేమస్ రాక్ బ్యాండ్ల గిటార్లు వగైరా చూసాము.దూరంగా వున్న డెన్వర్ దౌంటౌన్ చూస్తూ థియేటర్ మెట్ల పైన పోటీలు పడి కిందకి చేరాము.


దారిలో అందరికి ఐస్క్రీం కొనిచ్చి ,సునీల్ బాబాయ్ కారుని రేస్ ట్రాక్ చూపిస్తూ అటు వైపుకి తిప్పడంతో,ఒ పక్క ఉత్సాహం మరోపక్క కాస్త భయం.చోటిని కస్టపడి ఆపి నెను,బాబాయ్,బాబు అన్న రంగంలోకి దిగాము.సునిల్ బాబాయ్ ఆకరిలో మొదలయినా హోం ట్రాక్ కావడంతో మాకంటే ఒ ల్యాప్ ముందరకి వెల్లిపోయారు.ల్యాప్స్ పెరిగే కొద్ది కాస్తా ఫాంలోకి వచ్చి ఆకరిదయిన పదవ ల్యాప్ వచ్చెసరికి బాబయ్ కి మంచి పోటీ ఇస్తూ ఫినిష్ లైన్ దాటాము.



చీకటిపడుతూండగానే డెన్వర్ డౌంటౌన్లో వున్న ఆర్ట్స్ సెంటర్ చేరుకున్నాము.స్టార్బక్స్ లో ' ఒ మంచి కాఫిలాంటి ' కాఫి తాగి ఆకసెమే మా హద్దు అనేలా వున్న బిల్డింగ్ల మద్య నడవసాగాము.రోడ్ మద్యలో సన్నటి లొకల్ ట్రైన్ ట్రాక్,రోడ్కి రెండు వైపుల మా ఊరు తిర్నాళ్ళలా లైట్లు,ఆస్టిన్(టెక్సాస్) తర్వాత ఇంత ప్రసాంతంగా నైట్ అంతా ఇక్కడే వుండిపొవాలనిపించెలా వుంది డెన్వర్ డౌంటౌన్.సిటీ బుస్లు తిరుగుతూండగానే మద్యలో పెద్ద పెద్ద గుఱ్ఱాలు నడిపిస్తున్నజట్కా బండులు.అలా కాసెపు చల్లగాలిలో పిల్లగాలితో తిరిగి ఇంటికి చేరాము.

సంప్రీత్ మొదటి పుట్టినరోజు /3 వ రోజు


పొద్దునే కళ్ళు తెరవగానే ఇంట్లో పండగ వాతావరనం కనబడింది.త్వరగా రెడీ అయ్యి నేను బాబు అన్న , రెక్ సెంటర్ లో బుక్ చేసిన ఫన్షన్ హాల్ ని డెకరేట్ చేసాము.సూచనలు మా అర్కిటెక్ట్ అక్కయ్య గారు, అదె భి ఆర్క్ చేసిన మా పప్పక్క ఇచ్చారనుకోండి.పదకొండు గంటలకల్లా ఇంట్లొవాల్లంతా రెక్ సెంటర్ చెరారు. వాల్లని ఫాలో అవుతూ అతిధులంతా వచ్సారు.పిల్లలకోసం స్పెషల్గా ఎర్పాటు చేసిన క్లౌన్ షో పిల్లలనే కకుండా పెదల్లని కూడ బాగా ఆకట్టుకుంది.పిల్లలకి గిఫ్టులతో పాటు , టాటూలు కూడ వేసెసింది క్లౌన్.



మేము కార్లో వచ్చాము ,కేక్ ట్రైనులా వచ్చింది.కేక్ కట్టింగ్ ముందే కెమేరా,అంటే ఫొటోలు/వీడియోల భాద్యత నాకు ఇచ్చారు.ఇంక మనం వూరుకుంటామా, పిచ్చెకిచేసా:).సంప్రీత్ కేక్ కట్ చెయ్యగానే అందరూ గిఫ్ట్లతో మనసారా దీవించారు.

హోటల్ ఫుడ్కి నో ఆని చెప్పీ రక రకాల హోమ్మేడ్ డిషెష్స్ వండి తీసుకొచ్చారు పప్పక్క అండ్ ఫ్రెండ్స్.ఒక సైడ్ శాఖాహారాన్ని డిస్సపాఇంట్ చెయ్యకుండానే నాన్ వెజ్ కుంసియో .



కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకొనెలోపే మా డ్యాన్స్ కి టైం అయిందంటూ అక్క మ్యుసిక్ స్తార్ట్ చెయ్యడంతో ఇంకేముంది మిరే చూడండీ...



'చుడొదంటూన్నా చూస్తొనేవుంటా..' అంటూ పోకిరిగా మొదలెట్టి,అందరూ చూస్తూ వుండగానే నెను చోటి డెన్వర్ ప్రెక్షకుల మనసులకి దగ్గరయ్యాము.గురు సినిమాలోని 'బర్సోరే ' పాటకి చోటీ డ్యన్స్ చేస్తే ,నెను ' యమహో యమ్మా ' అంటూ చిరూత్తాతో మొదలెట్టి, చిరు ' బంగారు కోడి పెట్టతో ' ముగించాను.





మాతో పాటు బర్త్డే బోయ్ సంప్రీత్ కూడ జాయిన్ అవ్వడంతో కాసెపు హాల్ నవ్వులతో నెండిపోయింది.డెన్వర్ని 'దా మైల్ హై సిటీ' అని ఎందుకు అంటారో అప్పుడే తెలిసింది మాకు.పది నిమిషాలు చేసామో లేదో అలసట:).అందుకే కాబోలు డెన్వర్ ఫూట్ బాల్ టీమ్ని, డెన్వర్లో వోడించటం అసాద్యం.రెండు వారాల మా ప్రాక్టీస్కి చరిపొయే పొగడ్తలు:) అందుకోని, అందరం ఇంటికి బయలుదేరాము.

నాల్గవ రోజు
ఆకరిరోజు రోజు అనగానే మా సిస్టర్ ఎవ్వరినీ ఇంట్లోనుంచి కదలనివ్వదు.కాసేపు బాల్కనీలో రాక్కీ పర్వతస్రేనులని చూస్తూ చిన్నప్పటి కబుర్లతో మొదలెట్టీ టైం మెషీన్ 1998 చేరగానే నానమ్మ దగ్గరనుంచి లంచ్ కాల్.ఇ నాలుగురోజుల కిచెన్లో వంటలతో,బేస్మెంట్లో డ్యన్స్ ప్రాక్టీసుతో హడావుడిగా వున్నా మా "జిల్లియన్ డాల్లర్ బేబి" సమ్హితా హీరోఇన్ గారి కాల్ షీట్లు సంపాదించ్చి ఓ చిన్ని వీడియో తీసేశాం.


సమ్మర్ హాలిడేయ్స్ ముగిసాక స్కూల్కి వెల్త్తున్న ఫీలింగ్-తో ఫిల్లికి బయలుదేరాము మా యునైటెడ్ ఐర్-లైన్స్ వారి విమానంలో.


Related Articles


Florida Part 2:Miami The Paradise


UK Visitor Visa for non US Citizens in USA


Hasinis Day Out


Florida Part 1:Six days in Orlando

Texas:Take 8


F.E.A.R:-Forget Everything And Ride!!


Niagara Falls With West Coast Gang


Little Rock ,Arkansas


Wild Wild West 2


Dance in Delaware


Austin Texas


First Ski


Kerala


Wild Wild West 1

Ocean City