Saturday, November 22, 2008

మొదటి స్కీయింగ్:-జై చిరంజీవా,జగదేక వీరా:)

Visit my new portal bharaththippireddy.net
లొకేషన్
:- ఫిల్లీ స్కీ రిసార్ట్
సమయం:-టీం ఫిల్లీ స్కీయింగ్కి బయలుదేరిన సమయం.మౌంట్ ఎవరెస్టు ఎక్కాలనుకున్న నాని మంచు కొండ ఎక్కిన వేల...


వారాంతం స్కీయింగ్కి వెల్లాలని టీం ఫిల్లీ డిసైడు అవ్వడంతో తగిన బందొబస్తు , కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు కార్యకర్తలు:).అంటే కింద పడినా ఫొటోలలో బాగా పడాలి కాబట్టి మంచి సన్ గ్లాస్లు,గ్లౌస్లు తదితర షాప్పింగ్ అన్నమాట.
అరగంట డ్రైవ్ చేస్తే వచ్చేసింది ఫిల్లీ స్కీ రిసార్ట్.కారులోంచి దిగగానే కాస్త దూరంలో మా వింజమూరి తిర్నాళ్ళలా వుంది కోలాహలం.చిన్నపుడు జగదేక వీరుడు అతిలోక సుందరీ సినిమాలో చూసిన కొండలంటి మంచు కొండ.కొండకి ఒక వైపు తీగలకి వేలడుతూ పైకీ కిందకి తిరుగుతున్న కుర్చీలలా కనిపించాయి.మరో వైపు ఇంకో చిన్న కొండ వుంది.దాని పైన చిన్న పిల్లలు ట్యుబులలో జారుతూ,కొందరయితే దొల్లుకుంటూ కిందకి వచ్చేస్తున్నారు:)


లోపలకి వెల్లి కొన్ని $లు చెల్లించి , ఎంట్రి పాస్లు తీసుకున్నము.పక్కన గదిలోకి వెల్లి పాస్లు చూపిస్తే ఒక జత బూట్లు ,ఒక జత స్కీలు,రెండు స్కీ కర్రలు ఇచ్చారు.బూట్లకి స్కీలకి అండర్-స్టాండింగ్ అన్నమాట.ఇంతలో మాకంటే ముందే వచ్చిన నా మిత్రుడు సుమంత్ వాల్ల టీం వెనక్కి వెలుతూ ,వాల్లు పడిన కస్టాలు తగిలిన దెబ్బలు గురించి చేప్తుంటే కాస్త భయం వేసింది.అంతా చెప్పేసి చాలా తేలికగా "Full Njoy" అసలు అనేసి వెల్లిపోయాడు....


పిజ్జాలు,ఫ్రైలు తిని కాస్త శక్తి,ధైర్యం తెచ్చుకున్నాం. చిన్ని అందమయిన సరస్సుని దాటుతూ ఫొటోలు తీసుకొని ,వరుసలో నిలుచున్నాం ట్రైనింగుకి.కాసేపు కొంచం ఎత్తుకి పెంగ్విన్లలా నడుస్తూ ,రెండు కాల్లు ఆడిస్తూ వెల్లి , స్కీ చెయ్యడం ఇలా అని ఒక్కొక్కరం ఒక్కో స్టైల్లో పడుతూ లేస్తూ కిందకి వచ్చాము.మద్యలో ఆగాలంటే మన కాల్లు రెండు ఒకే వైపుకి తిప్పుతూ ,స్కీలు రెండూ ముందర వైపు ఒకదానికొకటి తాకేలా త్రికోనంలా వుంచాలని,కుడి వైపుకి తిరగాలంటే కుడి కాలుని కుడి వైపుకి తిప్పాలి అలాగే యడమ వైపుకి కూడ అని చెప్తూ మమ్మల్ని తాడులతో కదిలే చేయిర్ లిఫ్టు ఎక్కిచేసాడు ఇన్స్ట్రక్టర్.


కొండ పైకి వచ్చేసాము అనగానే జేంస్ బాండు సినెమాలో హెలికాఫ్టర్లోంచీ దూకి నట్టూ దూకమన్నారు మమ్మల్ని.భయం భయంగా దూకేశాం .ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ,మనం పడినా ఫర్లేదు మిగతా వాల్ల పైన పదకూడదు,పడేయకూడదు అని అనుకుంటూ జై చిరంజీవా,జగదేక వీరా అంటూ:) మొదలెట్టాము మా స్కీయింగ్.చల్ల గలిలో అలా దూసుకొని కిందకి వెల్తుంటే, ఇందాక దాటి వచ్చామే సరస్సు అదే కనిపిస్తోంది ఎదురుగ్గా.కాల్లు హ్యండ్ ఇచ్చి త్రికోనం ఆకరం తీసుకొకపొతే స్కీలు ఆగక ,వెల్లి దంట్లో ఎక్కడ పడిపొతమో అనే భయంతో మాకు మెమే ముందే పడిపొయాం మొదటి రెండు ట్రిప్లలో:).దారి పొడవునా అక్కడక్కాడ గార్డ్లు నిలుచోని వున్నారు.పడకుండా ఆపటానికి కాదు ,పడిన వారిని లేపటాకిని:).మొదటి నాలుగు సార్లు పడుతూ లేస్తూ మెల్లి మెల్లిగా లిఫ్టు ఎక్కుతూ కస్ట పడినా ,అయిదో రౌండు కల్లా లిఫ్టుతో పోటి పడడం ఆరంబించాము:)...ఒకరితో ఒకరు పోటి పడే లెవల్కి చేరుకోని బాండులా స్టైలుగా స్కీ చెయ్యడం మొదలెట్టాము.చిన్నపిల్లలు బోర్డు స్కీ అంటే ఒక్కటే పెద్ద సైజు స్కీ చేస్తూ వుంటే,మేము వచ్చేసారి చేస్తాములేరా అనుకుంటూ సమయం తెలియనంతగా మునిగిపోయి వేసేశాము రౌండ్ల పై రౌండ్లు...

చీకటి పడ్డాక ఫ్లడ్ లైట్లలలో కూడా కాసేపు స్కీ చేసేశాక ఇంటికి వెల్లాలని అనిపించక పోయినా ,మల్లీ రావలి అంటే ఇప్పుడు వెల్లాలి కదా అనుకుంటూ బయలుదేరాం ఇంటికి:).మరవలేని అనుభూతి,మరపు రాని అయ్యొ-డెక్స్ నెప్పులతో గూటికి చేరుకున్నాము:)

Related Articles


Florida Part 2:Miami The Paradise


UK Visitor Visa for non US Citizens in USA


Hasinis Day Out


Florida Part 1:Six days in Orlando

Texas:Take 8


F.E.A.R:-Forget Everything And Ride!!


Niagara Falls With West Coast Gang


Little Rock ,Arkansas


Wild Wild West 2


Dance in Delaware


Austin Texas


Kerala


Wild Wild West 1


Denver The Mile High City


Ocean City

Visit my new portal bharaththippireddy.net