Blessed by the absolute,Inspired by my family and Influenced by my teachers-While I explore and learn more in the career development, personal development and self consciousness spaces I will try to creatively express my thoughts,work and experiences through my blog, videos etc to help others while helping myself.
Sunday, February 1, 2009
గ్రాండ్ కెన్యన్:-Wild Wild West 2
Visit my new portal bharaththippireddy.net
లొకేషన్:-గ్రాండ్ కెన్యన్(అరిజోన-The Grand Canyon State)
సమయం:-2007 winter & 2006 summer
PST కూడ IST(Indian Standard Time) మెయింటెయిన్ చేస్తూ కరెట్టుగా సూర్యాస్తమయం సమయానికి రెండు నిమిషాల ముందు చేరుకున్నాము సన్సెట్ పాయింటుకి...
అస్తమిస్తున్న సూర్యుని సైతం వెలుగుతో నింపగల మన స్నేహం..
గ్రాండ్ కెన్యన్ కి మొదటి సారి నా ప్రాన స్నెహితుడు అనిల్ తో పాటు ఇతర మిత్రులతో కలసి 2006 లో వెల్లాను.
నీడైనా మనం ఒకటే నంటూ నిలిచనా...
రెండవ సారి ఇల పెళ్ళి అవ్వగనే అలా చోటితో కలసి వేగస్,గ్రాండ్ కెనియన్ చుట్టేశాము.అప్పుడు వింటర్ ఆటకెక్కి కూర్చుంది.రాత్రి పడిన మంచు వేకువ జామున సూర్యుడి కిరనాలకి మెరుస్తూ మాకు స్వాగతం పలికింది..
అసలు ఇక్కడకి ఎలా చేరాం అంటే....@@@@@
దారి పొడవునా రోడ్డుకి రెండు వైపుల పచ్చని చెట్లూ,అందమైన జలపాతాలు లేవు:).మా గార్డన్ స్టేట్ నివ్ జెర్సి నుంచి అంత దూరం వెల్లింది అవి చూడడానికి కాదు కదా:).ప్రతి మైలు అర నిమిషంలో దాటేస్తూ రాకెట్టులా దూసుకొని వెల్తూ వుంటే ,కారు అద్దం లోంచి బయటకు చూసిన ప్రతి సారి తెలుగు సినెమాల్లోనీ పాటలన్ని ఇక్కడే తీస్తారెమో అనెంత సుందరంగా వుంది ఎడారి:).
దిస్నీ ల్యాండ్లో రైడ్లు ఎమన్న మిగిలిపొయాయ్ అంటే అవి ఇక్కడ ఎక్కేయమన్నట్టు గా రోలర్ కోస్టర్లని మరపించాయి రోడ్లు.
ఇక్కడ స్పీడ్ లిమిట్స్ చాలా ఎక్కువ.అంటే నేల తాకిన టైరు స్పీడు తగ్గని కారు!!
దారి మద్యలో,మా నెల్లూరు నుంచి మద్రాసుకి వెల్లేపుడు రోడ్డు పక్కన వుండే ధాబాల లా వున్న వో డైనర్ దగ్గర బ్రేక్ తీసుకున్నాము.మరో రెండు గంటలు డ్రైవ్ చేసి జురాసిక్ పార్క్ లాంటి ఎంట్రన్స్ దగ్గర టిక్కెట్టులు కొనుక్కోని కారు పార్క్ చెయ్యగానే...
కొన్ని వందల గుడులు ఒకే చోట ఆవీర్భవించినట్టుగా ,రెండు కల్లని నింపేసిన ఆ గ్రాండ్ కెన్యన్ ద్రుస్యాన్ని మా కెనాన్ కమెరా లో భందించేశాము.ఇంకొ గమ్మతయిన విషయం ఎంటంటే ఇక్కడ విష్ను టెంపుల్ అనే పాయింట్ వుంది.అక్కడ నుంచి కాస్త దూరం లో వున్న సికరం వైపు చూస్తే వో విష్ను మందిరం కనిపిస్తుంది.మందిరం అనుకొని లోపలకి వెల్లాలని ప్రయత్నిస్తే , మీరు గ్రాండ్ కెన్యన్ లో కాలు వేసినట్టే.అది సహజ సాదారనంగా ఎర్పడిన విష్ను మందిర ఆకారము మాత్రమే.విష్ను మాయా అంటే ఇదెనేమో...ఇంతలో వో పెద్ద శబ్దం.తలపైకెత్తి చూస్తే ఇంకెముంది హెలికాఫ్టర్:) ,అప్పుడు గుర్తుకు వచ్చింది దారిలో మేము వచ్చేపుడు చూసిన హెలిప్యాడ్/హెలికాఫ్టర్ రైడ్ పాయింట్.గ్రాండ్ కెన్యన్ అందాన్ని ఏరియల్ వివ్ లో చూసెయొచ్చు ...
స్కై వాక్
అన్నింటికంటే ఎత్తయిన సిఖరానికి చిట్టచివర అయిసుకాంత్తం అతుకున్నటుగా వుంటూంది స్కై వాక్ ..దాని పై నిలుచోని కిందకి చూస్తే వేగస్ లో వంద అంతస్తుల పైన ఎక్కిన స్ట్రాటోస్పియర్ రైడ్లు గుర్తుకు వచ్చాయి.గ్రాండ్ కెన్యన్ మద్యలో , నాజూకుగా ప్రవహిస్తున్న సన్నటి లిటిల్ కొలరెడో నది చూస్తుంటే చంద్రమండలంపైనుంచి హిందూ మహా సముద్రాన్ని చూస్తునట్టుగా అనిపిచింది.ఆంటే నేను చంద్రమండలానికి ఎప్పుడు వెల్లలెదు అనుకొండి.ఎదో మా యాంస్ట్రాంగ్ నాతో చెప్పింది మీకు చెప్పాను:)
ఐ-మ్యాక్స్
రామా రావ్ సినెమాలన్నీ చూసేసి సీతకి రాముడు ఏమవుతాడు అని అడిగినట్లు ,అన్ని తిరిగెశాం,అంతా చూసేశాం,కాని ఎమీ తెల్వద్ ? లా వునింది మా పరిస్తితి సయకాలం ఐ-మ్యాక్స్ థియేటర్ కి వెల్లే వరకు.గ్రాండ్ కెన్యన్ ఎలా ఏర్పడింది,ఏ తోక చుక్క వచ్చి కొట్టింది,ఎప్పుడు ఎలా కొట్టింది ,ఇక్కడకి మొదట చేరుకున్న రెడ్ ఇండియన్స్ ఎవరు?,వాల్లు ఎల అంతరించిపొయ్యరు..ఇలా మొత్తం కల్లకి నాలు గింతలు కట్టినట్లు(4డి) చూపిస్తే గాని మాకు అర్దం అవ్వలేదు:) ..సహజ సాదారనంగా ఏర్పడిన గ్రాండ్ కెన్యన్ మహాద్భుతం గురించి.ప్రక్రుతిలోని ఎనో అద్భుతాలలో అగ్ర స్తానం సంపదించిన గ్రాండ్ కెన్యన్ ని తనివితీరా చూసుకునే చాన్స్ చందమామ కి ఇచ్చేసి మేము కార్లు ఎక్కేశాము...
దారిలో మరో వింత చూసేశాం అండోయ్ ,అదే హోవర్ డ్యాం...
ఇంకెముంది నేల తాకిన టైరు స్పీడు తగ్గని కారు!!:)
నాని
Visit my new portal bharaththippireddy.net
Labels:
తెలుగులో