మదురానగరిలో 2:-నీ తొలి చూపులో నన్ను నేను మరచినా..
నా మొదటి ప్రేమ లెఖ రాసి రెండు వారాలు అయింది.కనిపెడతాం అంటూ వెళ్ళిన మా రేంజర్లు దొంగలతో రన్నింగ్ రేస్లో వోడిపోయిన పోలీస్ మొహాలతో తిరిగి వచ్చారు. లొకేషన్:-భాగ్యనగరం,వెంగల్ రావ్ నగర్ చౌరస్తా సమయం:-కారు మబ్బులు అకాశాన్నీ/మనసునీ కమ్మిన వేల... రోజూలానే క్రికెట్ అవ్వగానే పాని పూరి తినాలని బయలుదెరాము నేను మా భక్క శీనుగాడు నా చేతక్( బజాజ్) మీద. నా స్కూటర్, అంటే మా పెదనాన్న గారు 1978 లో మా నాన్న గారికి ఇస్తే, నాకు సంక్రమించిన మాస్టర్ పీస్ .దాని పైన వెల్తూ వుంటే అందరు మమ్మల్నే చూస్తుంటారు. పిల్లలు ఇదెదో కొత టైపు ద్విచక్ర వాహనమని. పెద్దలు ఇలాంటివి ఇంకా తయారు చేస్తున్నారా అని. మా ఇంటి దగ్గర ఐతె రూపయకి మూడే అని ఇక్కడయితే నాలుగు పాని పూరిలు వస్తాయని, మదురా నగర్<-> వెంగల్ రావ్ నగర్ చౌరస్తా దగ్గర వున్న గప్- చుప్ బండికి తీసుకొచ్చాడు శీనుగాడు. ఎమి తింటావురా శీను... కట్లెట్ , సమోసా, పాని పూరి, భెల్ పూరి, దహి పూరి... అవన్ని నువ్వు పర్స్ మర్చిపోని రోజు ఆర్డర్ చేద్దాం గాని రెండు సమొసా చెప్పు. శీను ఆర్డర్ చెసే లోపే ఓ అమ్మయి వచ్చి టూ ప్లేట్ దహి పూరి సలీమన్నా అని చెప్పి పక్కనే స్కూటి దగ్గ...