Posts

Showing posts from October, 2008

TCS:- హం హై నా

Image
అరవై పర్సెంటుతో రాసేయి పరిక్ష... రెండు సంవత్సరాలలో ఆన్సైటు ఎంచక్కా... ఒక్కటే సిస్టం ముగ్గురు షేరింగు.. క్లైంటునయినా సవాలు చేసే మా డేరింగు... మీటింగులలో ఆన్సైట్ కబుర్లు... వాయిప్ ఫోన్లలో ప్రవాస మిత్రుల కుశల ప్రశ్నలు... బడిలో కూడా లేవు ఇన్ని సెలవులు... ప్రభుత్వ ఉద్యోగం మరపిస్తూ కాఫి సర్వర్లు... ప్రాజెక్టు ముగిస్తే క్రికెట్ మ్యాచ్చీలు.... పది సంవస్తరాలలో తిరిగేవా అన్ని దేశాలు... లొకేషన్:- ITPL బెంగులూరు సమయం:-TCS లో పాతుకుపోయిన వేల... ఉద్యోగ దరకాస్తుకి,కంపెనీలు అన్ని వీలు అయితే డెభ్భై కుదిరితే డెబ్బై-అయిదు శాతం మార్కులు ఉండాలంటుంటే...మా TCS మటుకు అరవై శాతం చాలంటూ "హం హై నా..." పని లేక కాలిగా వుంటే ఇంటికి వెల్లొచు,ఇల్లు కొంటే ఆన్సైట్ వెల్లొచు.. ప్రాజెక్టు అయ్యిపోయి కాలిగా వుండే వాల్లకి,బెంగులురు గాంధీనగర్ బ్రాంచ్ బిల్డింగు మద్యలో బెంచీలు వుంటాయి,ఎందుకంటే వాల్లకి సిస్టంలు వుండవు:).ఇంటికి వెల్లిపోయి హాయిగ మరో ఉద్యోగమో ,వ్యాపారమో చేసుకునే వారు లేకపోలేదు:). మేనేజెర్ వచ్చి ICICI Direct లో షెర్లు ఎంత పెరిగాయో చూస్తున్న లీడు గారితో.. ఎమొయ్ ఆసైట్ వెల్...

ఆన్-సైట్ కేరలా:-Gods Own Country

Image
లొకేషన్:-కొట్టాయం కేరలా సమయం:-ఆన్-సైట్ కలలు నిజమైన వేల:) హాలివుడ్ సెలెబ్రిటీలు అంత కర్చు పెట్టి ఐలాండ్లు కొనుకుంటూంటే మాకు మటుకు ఎక్కడ బోటు ఆగినా అది వో చిన్ని ఐలాండే.అలా అలల తో మా టైని-టానిక్ పైన పయనిస్తూ తెలుసుకున్న విషయం ఎంటంటే, 'కేరలా' 'కెరా అంటే కొబ్బరిబొండం/టెంకాయ ,'అలం' అంటే ప్రదేశం సుందరమయిన "Gods own country" లో తల పైకెత్తితే టెంకాయ/కెర చెట్లే.... అసలు నానిగాడు ఇక్కడకి ఎలా చెరాడంటే... ఫ్లాష్ బ్యాక్ @@@@@@ అది వో వర్షం కురవని సన్ని సన్ని డే.ఆన్-సైట్ అంటే ఆమడ దూరంలో వుండే మా మేనేజెర్ ... ఏమొయ్ నాని MM ఆన్-సైట్ చాన్స్ వుంది వెల్తావ్ ఎంటి అంటే ,నా దిమ్మ తిరిగి టికెట్ బ్లాక్ అయింది... MM అంటే అమెరికా చాక్లేట్ల కంపెనీ కాదని,చిన్నపుడు చదివిన మలయాళం మనోరమా పుస్తకాలు /కేరెలాలో అతి పెద్ద దైన దిన పత్రిక అని ఫ్లైటు ఎక్కేముందు గాని తెలియలెదు. సో చికాగోగురించీ కలలు కంటూన్న నెను మొత్తానికి కొచ్చిన్ చేరుకున్నాను ఇలా. ఆన్-సైట్ అమెరికా ఐతే వెనక్కి పంపేస్తారని పనిచేసివుండే వాడినెమో:).ఇక్కడ ఎక్కడికి పంపిచేది .ఎక్కువ చేస్తే సెలవలు...

మా పెళ్ళి పుస్తకం @ ప్రైమావెరా...

Image
పొదున్ లెగ్గాలీ,స్నానం చెయ్యాలీ కారులో ఎక్కాలీ,ఆఫ్ఫిస్ కెల్లాలీ బాత్-రూం లొ పాటలు, బ్రేక్-ఫాస్ట్ లో మాటలు పిల్ల ముందు వొండర్లు,మేనేజర్ ముందు బ్లండ్డర్లు ఇక ట్రైనింగులకి వెయిటింగు, మీటింగులో ఫైటింగు కేఫెటేరియలొ డేటింగూ ఊ ఊ ఊ ఊ ఊఊ నేను మన చైనా నుంచీ వచ్చిన మేయ్(అది పేరు) తో అనింది అల్లా ,మీరందరు అనుకుంటున్నట్టూ ఆ టెస్టింగ్ టీంలో అమ్మాయికి నాకు యే సంభందం లేదు అండి అని అంతే:).... ఆఫిస్ మొత్తం తెలిసిపోయింది విషయం.కాని ఆ పెళ్ళి పుస్తకం సినిమాలోలా,ఈ తీయ్యని నిజాన్ని అందరికి తెలియకుండా ఎక్కువ రోజులు దాచక పోయినా,దాచినన్ని రోజులు బలే ఎంజాయ్ చశాము లే.... తెలియక ముందు ప్రశ్నలు మీ ఊహా ప్రపంచానికి వదిలేస్తూ ...తెలిసిన తరవత అడిగినవి ఇవి.. మీరిద్దరూ ఒకే కారులో వస్తరా? అబ్బా సూపర్ గ్యాసు/petrol సేవింగ్ కదా... హేహ్ అది నీ ఇంటర్నెట్ కేబుల్ కాదు మీ ఆయనది... ఎంటీ మీ ఆయన రాసిన కోడ్లో బగ్గులే లెవంట.ఇందులో నీ హస్తం వుందా..? కుకింగ్ కాంపటీషనుకి తెచ్చేవి నువ్వు చేస్తవా మీ అయాన చెస్తాడా? hmmm వాల్ల ప్రశ్నలకి అంతం లేదు ,మా ప్రాజెట్టుకి డెడ్-లైన్ లేదు అనుకోండి:). మా పెళ్ళి పుస...

వైల్డ్ వైల్డ్ వెస్ట్ 1:-మిక్కితో సావాసం,వేగస్లో ఉల్లాసం...

Image
సమయం:- 2006 ధ్యాంక్స్ గివింగ్ లొకేషన్:-LA నుంచీ వేగస్ వరకూ... ఈ "నా కెమెరా ఈ ప్రపంచం" సెక్షన్ని ఈ ట్రిప్పుతో మొదలెట్టటానికి కారనం మా అనీల్ గాడు... అస్తమిస్తున్న సూర్యుని సైతం,వెలుగుతో నింపగల మన స్నేహం.... ద్యాంక్స్-గివింగ్ అంటే నాకు అదో ఎక్ట్రా జోష్ వచ్చేస్తది , నాకే కాదు నాలుగు రోజులు సెలవలు అంటే యే సాఫ్టువేరు ఇంజినీరుకి మటుకు జోష్ రాదు చెప్పండి.ఇ జోష్ లోనే నా వీసా స్టాంపింగ్ నిమిషంలో చేసేశారు చెన్నై అమెరికన్యంబస్సిలో ఒకప్పుడు :).ఇ జోష్తో పాటూ చిన్నపటి బెస్టు ఫ్రెండుని పది సంవస్తరాల తరవాత కలుస్తున్నా అనే ఫీలింగ్తో ఫిల్లడల్ఫియా ఇంటర్నేషనల్ యయిర్పొర్ట్ నుంచి బయలుదేరాము వైల్డ్ వైల్డ్ వెస్ట్ కి. నాతోపాటు వచ్చిన నా రూమేట్ సుమంత్ తో కబుర్లు చెప్పుకుంటూ ల్యాప్టాపులో సినిమాలు చోస్తూ, అయిదు గంటలలోలాస్ వేగాస్ చేరుకున్నము.ఫ్లైట్ మారడనికి టెర్మినల్కి వెల్తుంటే అది యయిర్పొర్ట్ కి తక్కువ కెసినోకి ఎక్కువలా వుంది.మరో గంటసేపు ఫ్లై చేసి LA చేరుకున్నాము. ఆ తూరుపుకి ఈ పడమర ఎంత దూరమో ,ఈ తూరుపుకి ఈ పడమర అంతే దూరం అనిపించింది. అనీల్:- 10త్ క్లాస్లో నా పేపర్ ని వాడి పేపర్ లా చూసు...