Saturday, November 22, 2008

మొదటి స్కీయింగ్:-జై చిరంజీవా,జగదేక వీరా:)

Visit my new portal bharaththippireddy.net




లొకేషన్
:- ఫిల్లీ స్కీ రిసార్ట్
సమయం:-టీం ఫిల్లీ స్కీయింగ్కి బయలుదేరిన సమయం.మౌంట్ ఎవరెస్టు ఎక్కాలనుకున్న నాని మంచు కొండ ఎక్కిన వేల...


వారాంతం స్కీయింగ్కి వెల్లాలని టీం ఫిల్లీ డిసైడు అవ్వడంతో తగిన బందొబస్తు , కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు కార్యకర్తలు:).అంటే కింద పడినా ఫొటోలలో బాగా పడాలి కాబట్టి మంచి సన్ గ్లాస్లు,గ్లౌస్లు తదితర షాప్పింగ్ అన్నమాట.




అరగంట డ్రైవ్ చేస్తే వచ్చేసింది ఫిల్లీ స్కీ రిసార్ట్.కారులోంచి దిగగానే కాస్త దూరంలో మా వింజమూరి తిర్నాళ్ళలా వుంది కోలాహలం.చిన్నపుడు జగదేక వీరుడు అతిలోక సుందరీ సినిమాలో చూసిన కొండలంటి మంచు కొండ.కొండకి ఒక వైపు తీగలకి వేలడుతూ పైకీ కిందకి తిరుగుతున్న కుర్చీలలా కనిపించాయి.మరో వైపు ఇంకో చిన్న కొండ వుంది.దాని పైన చిన్న పిల్లలు ట్యుబులలో జారుతూ,కొందరయితే దొల్లుకుంటూ కిందకి వచ్చేస్తున్నారు:)


లోపలకి వెల్లి కొన్ని $లు చెల్లించి , ఎంట్రి పాస్లు తీసుకున్నము.పక్కన గదిలోకి వెల్లి పాస్లు చూపిస్తే ఒక జత బూట్లు ,ఒక జత స్కీలు,రెండు స్కీ కర్రలు ఇచ్చారు.బూట్లకి స్కీలకి అండర్-స్టాండింగ్ అన్నమాట.ఇంతలో మాకంటే ముందే వచ్చిన నా మిత్రుడు సుమంత్ వాల్ల టీం వెనక్కి వెలుతూ ,వాల్లు పడిన కస్టాలు తగిలిన దెబ్బలు గురించి చేప్తుంటే కాస్త భయం వేసింది.అంతా చెప్పేసి చాలా తేలికగా "Full Njoy" అసలు అనేసి వెల్లిపోయాడు....


పిజ్జాలు,ఫ్రైలు తిని కాస్త శక్తి,ధైర్యం తెచ్చుకున్నాం. చిన్ని అందమయిన సరస్సుని దాటుతూ ఫొటోలు తీసుకొని ,వరుసలో నిలుచున్నాం ట్రైనింగుకి.కాసేపు కొంచం ఎత్తుకి పెంగ్విన్లలా నడుస్తూ ,రెండు కాల్లు ఆడిస్తూ వెల్లి , స్కీ చెయ్యడం ఇలా అని ఒక్కొక్కరం ఒక్కో స్టైల్లో పడుతూ లేస్తూ కిందకి వచ్చాము.



మద్యలో ఆగాలంటే మన కాల్లు రెండు ఒకే వైపుకి తిప్పుతూ ,స్కీలు రెండూ ముందర వైపు ఒకదానికొకటి తాకేలా త్రికోనంలా వుంచాలని,కుడి వైపుకి తిరగాలంటే కుడి కాలుని కుడి వైపుకి తిప్పాలి అలాగే యడమ వైపుకి కూడ అని చెప్తూ మమ్మల్ని తాడులతో కదిలే చేయిర్ లిఫ్టు ఎక్కిచేసాడు ఇన్స్ట్రక్టర్.


కొండ పైకి వచ్చేసాము అనగానే జేంస్ బాండు సినెమాలో హెలికాఫ్టర్లోంచీ దూకి నట్టూ దూకమన్నారు మమ్మల్ని.భయం భయంగా దూకేశాం .ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ,మనం పడినా ఫర్లేదు మిగతా వాల్ల పైన పదకూడదు,పడేయకూడదు అని అనుకుంటూ జై చిరంజీవా,జగదేక వీరా అంటూ:) మొదలెట్టాము మా స్కీయింగ్.చల్ల గలిలో అలా దూసుకొని కిందకి వెల్తుంటే, ఇందాక దాటి వచ్చామే సరస్సు అదే కనిపిస్తోంది ఎదురుగ్గా.కాల్లు హ్యండ్ ఇచ్చి త్రికోనం ఆకరం తీసుకొకపొతే స్కీలు ఆగక ,వెల్లి దంట్లో ఎక్కడ పడిపొతమో అనే భయంతో మాకు మెమే ముందే పడిపొయాం మొదటి రెండు ట్రిప్లలో:).దారి పొడవునా అక్కడక్కాడ గార్డ్లు నిలుచోని వున్నారు.పడకుండా ఆపటానికి కాదు ,పడిన వారిని లేపటాకిని:).మొదటి నాలుగు సార్లు పడుతూ లేస్తూ మెల్లి మెల్లిగా లిఫ్టు ఎక్కుతూ కస్ట పడినా ,అయిదో రౌండు కల్లా లిఫ్టుతో పోటి పడడం ఆరంబించాము:)...



ఒకరితో ఒకరు పోటి పడే లెవల్కి చేరుకోని బాండులా స్టైలుగా స్కీ చెయ్యడం మొదలెట్టాము.చిన్నపిల్లలు బోర్డు స్కీ అంటే ఒక్కటే పెద్ద సైజు స్కీ చేస్తూ వుంటే,మేము వచ్చేసారి చేస్తాములేరా అనుకుంటూ సమయం తెలియనంతగా మునిగిపోయి వేసేశాము రౌండ్ల పై రౌండ్లు...

చీకటి పడ్డాక ఫ్లడ్ లైట్లలలో కూడా కాసేపు స్కీ చేసేశాక ఇంటికి వెల్లాలని అనిపించక పోయినా ,మల్లీ రావలి అంటే ఇప్పుడు వెల్లాలి కదా అనుకుంటూ బయలుదేరాం ఇంటికి:).మరవలేని అనుభూతి,మరపు రాని అయ్యొ-డెక్స్ నెప్పులతో గూటికి చేరుకున్నాము:)

Related Articles


Florida Part 2:Miami The Paradise


UK Visitor Visa for non US Citizens in USA


Hasinis Day Out


Florida Part 1:Six days in Orlando

Texas:Take 8


F.E.A.R:-Forget Everything And Ride!!


Niagara Falls With West Coast Gang


Little Rock ,Arkansas


Wild Wild West 2


Dance in Delaware


Austin Texas


Kerala


Wild Wild West 1


Denver The Mile High City


Ocean City

Visit my new portal bharaththippireddy.net

Sunday, November 16, 2008

డెలావేర్ డ్యాన్స్:-తెలుగువారి దసరా,దీపావళి....

Visit my new portal bharaththippireddy.net

లొకేషన్:-డెలావేర్
సమయం:-దసరా,దీపావళి పండుగలని గనంగా జరుపుకొనేందుకు తెలుగు వారంతా ఏకమయిన వేల....

నెలరోజుల నుంచీ ఇల్లు,కారు,ఆఫీసు అని తెడా లెకుండా KBL పాటలు వింటూన్న సమయం అది.జీవి నాలుగురాటింగు ఇచాడనే కాదు ,మా నివ్ జెర్సీ నవ యువ తార వరున్ సినిమా చూడాలని వారాంతం వరకూ ఆగలేకగురువారమే బయలుదేరాము డెలవేర్లో ప్రివివ్ షోక్ చూడాలని ఫ్యమిలీ మరియూ మిత్రులతో...

సమయానికి మేము హాలు చేరెను...సమయానికి...:)
టికెట్లతో పాటు పాప్-కార్న్ కూడ కొనుక్కోని లోపలకి వెల్లాము.Actually వెల్లబొయే లోపే వైట్ అండ్ వైట్ దుస్తులుదరించిన నలుగురు వ్యక్తులు మమ్మల్ని అడ్డుకున్నారు.విషయం ఎంటంటే డెలావేర్ తెలుగు అస్సొసియేషన్ వారు దిపావళి ,దసరాపండుగలను గనంగా జరుపుకుంటున్నారంట,మెమంతా రావాలంట..:).



వెంటనే నేను ,కల్చరల్ ప్రోగ్రాంస్ ఎమన్న వున్నాయ అండి అని అడిగాను.స్టేజీ వుందంటే డ్యాన్సు కట్టేసేవాడినికాలెజిలో.ఆ కధ మరో సారి చెప్తాను లేండి.ఆ నలుగురి లో ఒకరు, మీరు డ్యన్స్ చెస్తారు కదు పోయిన సంవత్సరంరావల్సింది ,పెళ్ళి పనుల వల్ల రాలేక పోయారు అనడంతో నాకు సగం పని తగ్గిపోయింది...

ఇ సారి తప్పకుండా చేస్తానని చెప్పి, KBL సినిమాతో బాగా ఇన్స్పిరేషన్ తెచ్చుకోని వారం రోజులు చోటి సాయంతో బాగప్రాక్టీసు చేశాను.మిగతా కధ నేను చెప్పను.ఎందుకంటే డెలావేర్ తెలుగు అస్సొసియేషన్ వారు చెప్పెశారు...వారి ప్రెస్ రిలీసులో ఇలా.



===================================================================================================

DTA (Delaware Telugu Association) celebrated Dasara 2008 at the Auditorium of Hindu Temple of Delaware on Oct 18th, 2008.The event started with Carnatic music , followed by Association inaugural speech , cultural programs and competitions.



Highlights of the evening:-

1)Panchatantram Depicted through classical dance.

2)Dance by Bharath,Prem and Team .




3)The Fancy Dress(Dasara Veshalu) competition saw kids in different avatars from Hanuman to Sri Ram.




4)The event of the evening was musical concert by Anitha Krishna Group. They started of from 'sa ri ga ma pa da ni sa' with golden oldies and ended it with recent chartbusters like "karo karo jara jalsa" enthralling the audience.


Followed by Authentic Telugu Dinner .

DTA thanks DV RaoGaru,Rao Rayavarapu Garu,SanthaRamGaru,ThirumalGaru,Syam KosigiGaru and all the volunteers.

===================================================================================================


శంకర్ దాద m.b.b.s ...వు హా వు హ అంటునే



గాజువాకే పిల్లమాది అంటూ మొదలెట్టాము....



బంగారు కోడి పెట్టతో ఆ తరాన్ని మెప్పించి..



'యమహో యమ్మా' అంటూ ఇ తరం వాల్ల హ్రుదయాలకి దగ్గరయ్యాము...


స్టేజి దగ్గర నుంచీ ఇంటికి బయలుదేరేవరకు అందరి మన్ననలు అందుకుంటూ,మాతో వచ్చిన మిత్రులతో పాటు కొత్త మిత్రులతో కలసి డిన్నర్ చేసి ఇంటికి బయలు దేరాము.......

"If music is life , then dance is living it to the full."

నాని

Visit my new portal bharaththippireddy.net

Monday, November 10, 2008

US Trip:- Things to carry

Visit my new portal bharaththippireddy.net

లొకేషన్:-నెల్లూరు

సమయం:-యంబ్బస్సీ వారు వీసా ఇచ్చారు,కన్సల్టన్సీ వారు టికెట్టు పంపారు.అమ్మ కల నిజమయ్యింది,నాని అమెరికా కధ మొదలయ్యింది...

Naniz Disclaimer:)

-------------------------------------------------------------------------------------
నాకు తెలిసిందల్లా పంచుకోవడం స్నెహమైనా , సమాచారమయినా....
నేను అయిదు ఫ్లోలు ఎక్కితే , నీకు ఎలివేటర్ చూపలేక పోయినా అయిదు మెట్లూ సులువు చెయ్యాలన్నదే ఈ ప్రయత్నం...
తప్పులుంటే మన్నించండి , కుదిరితే సరిచేసేయండి ....
-------------------------------------------------------------------------------------

ప్యకింగ్ అయ్యిపోయాక మాటవరసకి నా అమెరికా స్నేహితులని ఏమి తెచ్చుకోవాలి రా అని అడిగా అంతే...ఒక్కొక్కరూ ఒక్కో పర్వం రాసి పంపారు,ఆకరికి అది ఇలా చాట భారతంలా తయారయింది....


MS
అయినా,H1B అయినా,Business అయిన,H4 అయినా,L1 అయినా,గోడ దూకి వచ్చినా,ఈత కొట్టి వచ్చినా కింద నేను చెప్పే వస్తువుల్లో మీకు కావలసినవి ప్యాక్ చెసుకోవచ్చు.అన్నీ తెచ్చుకుంటే అందరం కలసీ హోటెల్ లేదా బట్టల కొట్టు పెట్టుకోవొచ్చు:).

****INTERNATIONAL DRIVING LICENSE****

ఇక్కడ కొన్ని రాస్ట్రాలలో IDL వుంటే డ్రైవ్ టెస్ట్ ఇవ్వకుండానే లైసెన్స్ సంపాదించొచ్చు.మా నివ్జెర్సీలో అయితే మన India License వున్నా చాలు. ' లైసెన్స్ టూ కిల్ ' అన్నమాట:)

I.CLOTHES(usually we wash clothes once every 10-12 days ,so plan accordingly)

**1.Long Leather Jacket.

2.Sweater.(If possible get 2 one for office other for daily wear.)

**3.Leather Gloves & cap.

4.Get some thick shirts.

5.Shoes 2 Pairs(1 for office ), 1 Pair ofsandal,1Pair of home slipper.

6.Pijamas n t-shirts 5-6 Pairs.

**7.Under garments atleast 10-15 Pairs.

8.Office wear atleast 5-6 Pairs.

మీ దగ్గర వుంటాయి కదా:),లేకపొతే షాపింగుకి ఇదే సరైన సమయం:)

9.Socks Black color atleast 8-10 Pairs(for office) & White atleast 3-5 pairs.

10.Shaving set.

11.Nivea Body Lotion.




II-MEDICAL STUFF

**12.Tablets(Headache,vomiting,motions,stomach Pain,Fever).

వో సారి మీ ఫ్యామిలీ వైధ్యులని కలసి అన్ని పరిక్షలూ చేయించుకోండి:)

**13.If you wear spects while working on computer get 2 pairs of glasses with full protection(UV-protection etc)

కళ్ళదాల దర ఇక్కడ చాలా ఎక్కువ....

14.Get good quality suitcases.

విమానంలో లగ్గేజీని రఫ్ ఆడిస్తారు:)

III-COOKING STUFF

**15.Comming to cooking :

1. pressure cooker,2 utensils,1 plate,1glass.2 pair of spoons.

2.Any spices which you want in your food.

3.Pickles get 2 varities

మీదగ్గర లేకపొతే నేను నేను ఇస్తాను గా:)

4.Write down all recipes which you cook daily ..

దయచేసి మీరు రాయకండే,అమ్మని రాయనివ్వండి:)

IV-OFFICE STUFF

**16.Get all softwares what all you have.

అంటే సినిమా సీడీలన్నమాట...

**17.IMP BOOKS related to your subject.


అవి చదివే వాల్లకి,మనకెందుకండి,మనకెందుకు??:) గూగుల్ వుండగా పుస్తకాలు దండగ:).

18.Do you have laptop? you get laptop for minimum $600 to $
800.

19.If you have a office bag
get it.

*****20.Get some spicy snacks for me.

పాస్పోర్టు మర్చిపోయిన పర్లెదు ఇవి మటుకు మర్చిపొకండే:)

నాని

Visit my new portal bharaththippireddy.net

Sunday, November 9, 2008

శెఖర్ కమ్ముల:-Jab We Met

Visit my new portal bharaththippireddy.net


లొకేషన్
:-డల్లస్ టెక్సస్

సమయం:-మా పెళ్ళికి రెండు వారాల ముందు,హ్యాపి డేయ్స్ సినిమా యాబై రోజులు పూర్తి చేసుకున్న వేల, పక్క పెళ్ళి పనులు ,మనం చేసేదేముంది షాపింగ్:) తో బిజీ గా వున్నా , మా సినిమా లోకంలో నేను నా ప్రాన స్నేహితుడు నరెందర్ S.K ని ఎలాగయిన కలవాలని ఆరాటపడుతున్న సమయం....




మొదటి సారి తెలుగు సినిమా చెరిత్ర స్రుష్టిస్తూ యాబ్బై రోజులు పూర్తి చేసుకుంది అమెరికాలో.హ్యాపీ డేస్ యాబై రోజుల పండుగ డాల్లస్ లోనే జరుపుకుకోవాలని ఏర్పాట్లు మొదలయ్యాయి. సందర్బంగా శేఖర్ కమ్ములా వస్తున్నారని తెలిసింది.అంత కర్చు పెట్టి అంత దూరం వెల్లి ఆయనని కలవగలనో లెదో అనే అలోచనలో నేను నరేందర్...

లోపే idlebrain.com లో ప్రకటన వచ్చింది...

http://idlebrain.com/news/2000march20/happydays-50days-announcement.html

ఎందుకన్నానో తెలీదు గాని ,రెయ్ నరెన్ ఇప్పుడు అంత కర్చు పెట్టి,కలుస్తమో లెదో అనే కదా అలోచనా,కంటెస్ట్ విన్ అయితే పోలా:)...అని సరదాగా అనుకుంటూనే స్పర్శాతో కలసి మా ఇంజినీరింగ్ అనుభవాలని ఇలా రాసి పంపాను కాస్త క్రియేటివిటీ జోడించి...

http://idlebrain.com/community/etc/bharath-happydays.html

అదంతా కల కాదు అని నిర్దారించుకోవడనికి ఫ్లైట్ డాల్లస్ లో ల్యాండ్ అయ్యే వరకు చోటి -ఫోన్లో ఆర్టికల్ ఎన్ని సార్లు చదివానో నాకే తెలీదు:)

Nov 16th

The sweet Surprise...

సమయం తెల్ల వారు జామున అయిదు గంటల పది హేను నిమిషములు ... 'పొదున్ లెగాలీ....':)



మెక్ డొనాల్డ్స్ దగ్గర వేచి వున్నాం నేను,కజిన్ వివేక్.వో పది నిమిషాలు తరవాత ఒక కార్ వచ్చి ఆగింది.హమ్మయ వచ్చేశారు ఆర్గనైజర్లు అనుకుంటూండగానే కార్లో నుంచీ శేఖర్ సార్ ,వరున్ సందెష్ దిగారు.ఇంకెముంది ఎం చెయ్యలో తెలియని,తెలిసినా చెయ్యలేని పరిస్తితిలో కాసేపు వాల్లతో చేతులు కలిపి , అలా చూస్తూ వుండిపోయాం:).శేఖర్ సర్ గమ్మతయిన మాటలని,నిరాడం బరత్వాన్ని చూసి కాస్త తేరుకున్నాము .


కొన్న్ని ఫొటోలు తీసుకున్న తరవాత అందరం కలసి బ్రేక్ఫాస్ట్ చేశాము.మెక్ డొనాల్డ్స్ లో అంత ఉల్లసంగా అంత ఉత్సాహంగా ఇంకెప్పుడు తిని వుండనెమో:).


ఎపిసోడ్లో ప్యాషన్ అంటే అయనే అనుకునే మా VJ గారు(వరున్ నాన్న గారు) పరిచయం అయ్యారు.

http://www.idlebrain.com/news/2000march20/happydays-breakfast.html

పడమటి సంధ్యా రాగం , సమయం ఏడు గంటల ముప్పై నిమిషాలు...


"
హ్యాపీ యాబై రోజుల" పండుగను శారద గారి ప్రార్ధనతో మొదలయింది.సౌజన్య గారు ,గంగాధర్ గారు తో "మల్లి మల్లి ఇది రాని రోజు" అంటూఒ థమ గాన బజాన మమ్మలని ఉరకలెతించారు..

త్రిమూర్తులు అనగా శేకర్ సర్,సోనియా,వరున్ సందేష్ లను స్టేగీ పైకి ఆహ్వానించారు.


చందు....

సందెష్ ని మాట్లాడమన్నపుడు ,కంగారులో కూర్చొనే మాట్లాడబోయాడు.వెంటనే గంగాధర్ గారు ....

బాబు సందెష్.ఇండస్ట్రిలో నిలబడాల్సిన వాడివి ,కాస్తా నిల్చొని మాట్లాడు అన్నారు...థియేటర్ అంతా నవ్వులు..

సందెష్ తన హ్యాపీ(డేస్) అనుబవాలని మా అందరితో పంచుకున్నాడు.

శ్రావ్స్...

సొనియా తెలుగులో చాల చాల బాగ మాట్లాడారు.

ప్రెక్షకులలోంచి జోరు ఎక్కువైన ఒకరు లేసి ..Can i touch your Hair?
శ్రావ్స్ స్వీట్గా తనదైన సైలిలో "టైసన్నే టచ్ చెయ్యనివ్వలేదు ,మిమ్మల్ని చెయ్యనిస్తానా.."
హాల్ అంతా మరో సారి నవ్వులు...

ఆకరిగా మేమందరం ఎదురుచూస్తున్న శేఖర్ గారు మాట్టాదుతూ ,ప్రెక్షకుల ప్రశ్నలకు సమాదానాలు చెప్తూ ,తన నవ యువ హ్యాపి డేస్ జట్టు ఎంత పట్టుదలతో పనిచెశారు ,తన ఫిల్మ్ మేకింగ్ అనుభవాలు మాతో పంచుకున్నారు.

The night dint fall yet...

కేక్ కట్టింగ్,ఆటోగ్రాఫులు,ఫొటోలు...అంతే కాదండోయ్ హ్యాపీ డేస్ సినిమా హ్యాపీ డేస్ టీంతో కలసి మరో సారి చూసేసాం:). అర్దరాత్రి అయినప్పటికి రెండు సినిమాహాల్లూ నెండిపోవడం విసేషం.

Nov 17th




నా డ్రీం రన్ అక్కడితో ముగిసిపోలేదు.మరో సారి హ్యాపీ డేస్ టీమ్ని 'సలాం నమస్తే' రేడియో స్టేషన్లో కలవడమే కాదు ,వాల్లతో కలసి FM(ఆకాశివని డాల్లస్ కేంద్రం) మాట్లాడాను కూడా.


శేఖర్ గారు నా గురించి మాట్టాదుతూ డిగ్రీ అనుభవాలు రాసి పంపియ్యమంటే మరో హ్యాపీ డేస్ స్క్రిప్టే రాసి పంపాడు అన్న మాట నేను ఎప్పటికి మరచిపోను!!.ఇంక నా మూడు రోజుల సినిమాకి సూపర్ క్లైమాక్సు శేకర్ గారితో కూర్చొని మాట్లాడుతూ లంచ్ చెయ్యడం!!!..


ఎం మాట్లడం అంటే...?
Golden words are not repeated:)


డ్రీం ఇప్పుడు నాని కురొసావాకి:) గుర్తు రావడానికి కారనం ౧)ఆ అర్టికల్ రాసి పంపిన రోజు ఇదే... 2)ఇ రోజు Moms Birthday 3) మూడు వారాలలలో రబొయే మా మొదటి యాన్నివర్సరీ....

ఇంకేముంది ఆవకాయ బిరియాని:)
నాని

Visit my new portal bharaththippireddy.net