లొకేషన్:-డల్లస్ టెక్సస్
సమయం:-మా పెళ్ళికి రెండు వారాల ముందు,హ్యాపి డేయ్స్ సినిమా యాబై రోజులు పూర్తి చేసుకున్న వేల,ఓ పక్క పెళ్ళి పనులు ,మనం చేసేదేముంది షాపింగ్:) తో బిజీ గా వున్నా , మా సినిమా లోకంలో నేను నా ప్రాన స్నేహితుడు నరెందర్ S.K ని ఎలాగయిన కలవాలని ఆరాటపడుతున్న సమయం....

మొదటి సారి ఓ తెలుగు సినిమా చెరిత్ర స్రుష్టిస్తూ యాబ్బై రోజులు పూర్తి చేసుకుంది అమెరికాలో.హ్యాపీ డేస్ యాబై రోజుల పండుగ డాల్లస్ లోనే జరుపుకుకోవాలని ఏర్పాట్లు మొదలయ్యాయి.ఈ సందర్బంగా శేఖర్ కమ్ములా వస్తున్నారని తెలిసింది.అంత కర్చు పెట్టి అంత దూరం వెల్లి ఆయనని కలవగలనో లెదో అనే అలోచనలో నేను నరేందర్...
ఈ లోపే idlebrain.com లో ఓ ప్రకటన వచ్చింది...
http://idlebrain.com/news/2000march20/happydays-50days-announcement.html
ఎందుకన్నానో తెలీదు గాని ,రెయ్ నరెన్ ఇప్పుడు అంత కర్చు పెట్టి,కలుస్తమో లెదో అనే కదా అలోచనా,కంటెస్ట్ విన్ అయితే పోలా:)...అని సరదాగా అనుకుంటూనే స్పర్శాతో కలసి మా ఇంజినీరింగ్ అనుభవాలని ఇలా రాసి పంపాను కాస్త క్రియేటివిటీ జోడించి...
http://idlebrain.com/community/etc/bharath-happydays.html
అదంతా ఓ కల కాదు అని నిర్దారించుకోవడనికి ఫ్లైట్ డాల్లస్ లో ల్యాండ్ అయ్యే వరకు చోటి ఐ-ఫోన్లో ఆ ఆర్టికల్ ఎన్ని సార్లు చదివానో నాకే తెలీదు:)
Nov 16th
The sweet Surprise...
సమయం తెల్ల వారు జామున అయిదు గంటల పది హేను నిమిషములు ... 'పొదున్ లెగాలీ....':)

మెక్ డొనాల్డ్స్ దగ్గర వేచి వున్నాం నేను,కజిన్ వివేక్.వో పది నిమిషాలు తరవాత ఒక కార్ వచ్చి ఆగింది.హమ్మయ వచ్చేశారు ఆర్గనైజర్లు అనుకుంటూండగానే కార్లో నుంచీ శేఖర్ సార్ ,వరున్ సందెష్ దిగారు.ఇంకెముంది ఎం చెయ్యలో తెలియని,తెలిసినా చెయ్యలేని పరిస్తితిలో కాసేపు వాల్లతో చేతులు కలిపి , అలా చూస్తూ వుండిపోయాం:).శేఖర్ సర్ గమ్మతయిన మాటలని,నిరాడం బరత్వాన్ని చూసి కాస్త తేరుకున్నాము .

కొన్న్ని ఫొటోలు తీసుకున్న తరవాత అందరం కలసి బ్రేక్ఫాస్ట్ చేశాము.మెక్ డొనాల్డ్స్ లో అంత ఉల్లసంగా అంత ఉత్సాహంగా ఇంకెప్పుడు తిని వుండనెమో:).

ఈ ఎపిసోడ్లో ప్యాషన్ అంటే అయనే అనుకునే మా VJ గారు(వరున్ నాన్న గారు) పరిచయం అయ్యారు.
http://www.idlebrain.com/news/2000march20/happydays-breakfast.html
పడమటి సంధ్యా రాగం , సమయం ఏడు గంటల ముప్పై నిమిషాలు...

"హ్యాపీ యాబై రోజుల" పండుగను శారద గారి ప్రార్ధనతో మొదలయింది.సౌజన్య గారు ,గంగాధర్ గారు తో "మల్లి మల్లి ఇది రాని రోజు" అంటూఒ థమ గాన బజాన మమ్మలని ఉరకలెతించారు..
త్రిమూర్తులు అనగా శేకర్ సర్,సోనియా,వరున్ సందేష్ లను స్టేగీ పైకి ఆహ్వానించారు.

చందు....
సందెష్ ని మాట్లాడమన్నపుడు ,కంగారులో కూర్చొనే మాట్లాడబోయాడు.వెంటనే గంగాధర్ గారు ....
బాబు సందెష్.ఇండస్ట్రిలో నిలబడాల్సిన వాడివి ,కాస్తా నిల్చొని మాట్లాడు అన్నారు...థియేటర్ అంతా నవ్వులు..
సందెష్ తన హ్యాపీ(డేస్) అనుబవాలని మా అందరితో పంచుకున్నాడు.
శ్రావ్స్...

సొనియా తెలుగులో చాల చాల బాగ మాట్లాడారు.
ప్రెక్షకులలోంచి జోరు ఎక్కువైన ఒకరు లేసి ..Can i touch your Hair?
శ్రావ్స్ స్వీట్గా తనదైన సైలిలో "టైసన్నే టచ్ చెయ్యనివ్వలేదు ,మిమ్మల్ని చెయ్యనిస్తానా.."
హాల్ అంతా మరో సారి నవ్వులు...
ఆకరిగా మేమందరం ఎదురుచూస్తున్న శేఖర్ గారు మాట్టాదుతూ ,ప్రెక్షకుల ప్రశ్నలకు సమాదానాలు చెప్తూ ,తన నవ యువ హ్యాపి డేస్ జట్టు ఎంత పట్టుదలతో పనిచెశారు ,తన ఫిల్మ్ మేకింగ్ అనుభవాలు మాతో పంచుకున్నారు.
The night dint fall yet...
కేక్ కట్టింగ్,ఆటోగ్రాఫులు,ఫొటోలు...అంతే కాదండోయ్ హ్యాపీ డేస్ సినిమా హ్యాపీ డేస్ టీంతో కలసి మరో సారి చూసేసాం:). అర్దరాత్రి అయినప్పటికి రెండు సినిమాహాల్లూ నెండిపోవడం విసేషం.
Nov 17th

నా డ్రీం రన్ అక్కడితో ముగిసిపోలేదు.మరో సారి హ్యాపీ డేస్ టీమ్ని 'సలాం నమస్తే' రేడియో స్టేషన్లో కలవడమే కాదు ,వాల్లతో కలసి FM(ఆకాశివని డాల్లస్ కేంద్రం) మాట్లాడాను కూడా.

శేఖర్ గారు నా గురించి మాట్టాదుతూ డిగ్రీ అనుభవాలు రాసి పంపియ్యమంటే మరో హ్యాపీ డేస్ స్క్రిప్టే రాసి పంపాడు అన్న మాట నేను ఎప్పటికి మరచిపోను!!.ఇంక నా ఈ మూడు రోజుల సినిమాకి సూపర్ క్లైమాక్సు శేకర్ గారితో కూర్చొని మాట్లాడుతూ లంచ్ చెయ్యడం!!!..

ఎం మాట్లడం అంటే...?
Golden words are not repeated:)

ఈ డ్రీం ఇప్పుడు ఇ నాని కురొసావాకి:) గుర్తు రావడానికి కారనం ౧)ఆ అర్టికల్ రాసి పంపిన రోజు ఇదే... 2)ఇ రోజు Moms Birthday 3) మూడు వారాలలలో రబొయే మా మొదటి యాన్నివర్సరీ....
ఇంకేముంది ఆవకాయ బిరియాని:)
నాని