Thursday, October 30, 2008

TCS:- హం హై నా

Visit my new portal bharaththippireddy.net

అరవై పర్సెంటుతో రాసేయి పరిక్ష...
రెండు సంవత్సరాలలో ఆన్సైటు ఎంచక్కా...

ఒక్కటే సిస్టం ముగ్గురు షేరింగు..
క్లైంటునయినా సవాలు చేసే మా డేరింగు...

మీటింగులలో ఆన్సైట్ కబుర్లు...
వాయిప్ ఫోన్లలో ప్రవాస మిత్రుల కుశల ప్రశ్నలు...

బడిలో కూడా లేవు ఇన్ని సెలవులు...
ప్రభుత్వ ఉద్యోగం మరపిస్తూ కాఫి సర్వర్లు...

ప్రాజెక్టు ముగిస్తే క్రికెట్ మ్యాచ్చీలు....
పది సంవస్తరాలలో తిరిగేవా అన్ని దేశాలు...




లొకేషన్:- ITPL బెంగులూరు
సమయం:-TCS లో పాతుకుపోయిన వేల...

ఉద్యోగ దరకాస్తుకి,కంపెనీలు అన్ని వీలు అయితే డెభ్భై కుదిరితే డెబ్బై-అయిదు శాతం మార్కులు ఉండాలంటుంటే...మా
TCS మటుకు అరవై శాతం చాలంటూ "హం హై నా..."

పని లేక కాలిగా వుంటే ఇంటికి వెల్లొచు,ఇల్లు కొంటే ఆన్సైట్ వెల్లొచు..



ప్రాజెక్టు అయ్యిపోయి కాలిగా వుండే వాల్లకి,బెంగులురు గాంధీనగర్ బ్రాంచ్ బిల్డింగు మద్యలో బెంచీలు
వుంటాయి,ఎందుకంటే వాల్లకి సిస్టంలు వుండవు:).ఇంటికి వెల్లిపోయి హాయిగ మరో ఉద్యోగమో ,వ్యాపారమో చేసుకునే వారు లేకపోలేదు:).



మేనేజెర్ వచ్చి ICICI Direct లో షెర్లు ఎంత పెరిగాయో చూస్తున్న లీడు గారితో.. ఎమొయ్ ఆసైట్ వెల్తావ్ ఎంటి,వెల్లి చాల రొజులయింది కదా,మీ క్లైంట్ మేనేజెర్ తెగ కలవరిస్తున్నాడు.లెదు విజయ్ మా బుడ్డోడిని వదిలి వెల్లడం ఇప్పుడు కష్టం.ఆరు నెలల తర్వాత ఇదే లీడు.... విజయ్ అర్జెంటుగా ఆన్సైట్ వెల్లాలి, రెపె ఫ్లైటు ఎక్కలి అంటూ వచ్చాడు మనేజర్ దగ్గరకి.విషయం ఎంటంటే లీడు గారు ఇల్లు కొన్నారు ,లోన్ త్వరగా తీర్చెయ్యాలి కదా..:).ఇంకెముంది మరొ సారి "హం హై నా" ....అంటూ ఫ్లొరిడా పంపేశారు.

ఆన్సైట్ వెల్లిన వాల్లు, పూర్వ జన్మ నుంచే రుణ పడి వున్నారు ఫీలింగ్ ఆఫ్షోర్ వాల్లకి.ఎంత అర్జెంటు పని అయిన 'వో హై
నా...' అంటూ ఆన్సైట్ వాల్లకి వో ఈ-మైలు కొట్టేసి ఇంటికి పోవడమే.


ఆన్సైట్ అంటే మాకు సెవన్ వండర్స్ మటుకే కనిపించేవి. మాకు తెలియని విషయం :-
ఆన్సైట్ వాల్లు ఆఫిస్ కి ఇంటికి పెద్ద తేడా లేకుండా పని చెస్తారు.ఇందులో వాల్ల తప్పు కూడ వుంది లేండి.ఇలా ఫ్లైటు దిగామో లేదో క్లైంటుని ఎలా బుట్టలో వెయ్యలి,ఇక్కడ ఎక్కువరోజులు ఎలా వుండాలి అనే అలోచన పెరగడంతో ,అంతా వాల్లే చెయ్యలనే ఫీలింగు పెరిగి ఆఫ్షోర్ వాల్లతో "మంచి కమ్యునికేషన్ గ్యాప్" ఉంది మీ ఇద్దరి మద్య అనెలా తయారవుతుంది.ఎదో ఒక టైంపాస్ వుండాలి కదా-ఆ-ఆ...

ఇంకో గమ్మతైన విషయం ఏమిటంటే భార్య భర్త TCS కే గనుక పని చెస్తూ, ఒకరికి ఆన్సైట్ చాన్స్ వస్తే,ఇంకొకరికి ఫ్రీ ,నీకు
ఫ్రీ:)

ఇన్ని తమాషాలు వున్న నాలాంటి బద్దకస్తుల చేత కూడ పని చెయించి,మన దేశంలో బిల్లియన్ దాల్లర్ మార్క్ ని చేరిన
మొదటి IT Services Company గా చెరిత్రలో ఎక్కెసిన TCS We Luv You:).ఇండియాకి వెనక్కి వెల్లాక IT రంగం లోనే వుంటే , TCSకే పని చేస్తాను...:)


నాని

Visit my new portal bharaththippireddy.net