Visit my new portal bharaththippireddy.net

లొకేషన్:- ఫిల్లి 2 నయాగరా ఫాల్స్..
సమయం:- ఈనాటి మన దేశ రాజకియాలు ఆనాటి మా నయగరా ట్రిప్ ని గుర్తుకు తెచ్చిన వేల...

లాస్ యేంజెల్స్ నుంచి అనిల్ గాడు,నార్త్ కెరొలినా నుంచి కామెష్ మరియు అనిల్ మిత్రుడు హరీష్ వచ్చి దిగబడ్డారు ఫిల్లికి.మూడు రొజులలో నివ్ యార్క్ నుంచి నయగరా ఫాల్స్ వరకు చూసేయాలన్నాడు అనీలు...
మొదట రెంటల్ కార్ అనుకున్న ఆకరి నిమిషం లో అప్పటికి కేవలం ఇరవయ్ వేల మైల్లే తిరిగింది కదా అని చిన్నగా నా బుజ్జి అలియాస్ హొండా అకార్డ్ ని బూక్ చేసెశారు అందరు కలసి.

దారిలో అమిత్ గాడు తోడు అవ్వడంతో మంటకి గాలి తొడైనట్టు సెర వేగంతో నివ్ జెర్సి,నివ్ యార్క్ లని దాటుకుంటూ వంతుల వారిగా ద్రైవ్ చేసుకుంటూ సరదాగా సాగిపోయింది విహార యాత్ర.

ఫాల్స్ దగ్గర పడుతూండే కొద్దీ రోడ్డుకి రెండు వైపులా మెడని అలా దాని వైపుకి తిప్పెసుకొనే సౌందర్యం, కంపుటర్ రేస్ గేం లో అప్పుడే ఎర్పడి నట్టూ ఎర్పడుతున్నట్టుగా కనిపించ సాగింది...

మొత్తానికి ఆకరి ల్యాప్ అమిత్ మా గుండెలు గుప్పెట్లోకి వచ్చేలా డ్రైవ్ చేసినప్పటికీ ఆ పైవాడి దయతో హోటల్ చేరుకున్నాము....రాత్రి పది గంటలకి...

వేకువ పాదునే లేసి ఫాల్ వైపుకు నడుస్తూ వుంటే రోడ్డుకి అటు వైపు పంజాబి హొటెల్ కనిపించింది..ఇంకెముంది ఒసారి జలపాతం సంగతి మర్చిపొయ్యి పావుబాజి తో మొదలెట్టి నైట్ డిన్నర్ వరకు ఇంకెమకర్లేదు అనేంతగా కుమ్మేశాము...
ఇక్కడ పంజాబి దాబా ఎక్కడిదా అనుకుంటున్నారేమో...నయాగరా కి అటు వైపు అదే కెనడా లో, ఇటు మా వైపు ఇలాంటి దాబాలు ఎన్నో వున్నాయి.అలా ఆక్రమించేశారు మన పంజాబీ అన్నయలు.....

'నువ్వు నాకు నచ్చావ్' సినెమాలో ఆర్తికి కలలో కనిపించేది ఇదె. అంటే వెంకి లేడను కోండి:)

మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ అంటూ నయాగరా హార్స్ షూ కిందకి వెల్లిపోయింది నావ...అప్పుడెప్పుడో మా షిమొగా జాగ్ ఫాల్స్ కిందకి వెల్లినప్పటి అనుభవాన్ని పదింతలు చేస్తే ఎలా వుంటుందో అనిపిచేసింది అనుకోండి...

కేవ్ ఆఫ్ దా విండ్స్ :- వర్షంలో మా చిన్నపటి స్కూల్ రిక్షా అతనిలా కవర్లు తొడుక్కోని తనివితీరా తడచిపొయ్యాం....

నయాగరా గురించి కల్లకి కట్టినట్లు చెప్పడం కంటే కల్లతో చూసేయడమే వో గొప్ప అనుభూతి,సో ఇంతటితో నయాగరా ఫాల్ కథ ఆపెస్తూ , ఇప్పుడు అందరు బిజీ గా మాట్లాడేసుకుంటున్న మన రాజకియాల విషయానికి వస్తే,నాకు జలపాతానికి మన రాజకీయ పార్టిలకి పెద్ద తెడా ఎమి లెదనిపిస్తొంది ...
అది ఎలా? అంటార
ఇలా....

Indian Politics :-The water fall model....
Every political party starts at the peak like a waterfall...
As they fall of the cliff to start,few bang their head against the rocks below and stay there for ever...
Few go ahead sustaining the pain like the sacred river Ganga...
Some will quench your thirst ,while some will flood you out of your homes..
As they flow like a river there will be many bushes with thrones on the way ....

Overcoming, they go further gaining speed/people like a flood ,and they will get polluted/corrupted...
Finally when the time comes , they will join hands with the sea which has already tasted the salt...
Now thats 'Grand Alliance...'
The only difference between the water fall and todays political parties is that the later will flood you more than they serve you!!
Yes youth should join politics.For some its a fashion for some its a passion.But social service should be the precedence/foundation.
The change you are looking for is you(Vote your heart out!!) and keep doing all the good stuff you always do and not just politics.
"Khel katam నాటకాలు Begin..."
Related Articles
Florida Part 2:Miami The Paradise
UK Visitor Visa for non US Citizens in USA
Hasinis Day Out
Florida Part 1:Six days in Orlando
Texas:Take 8
F.E.A.R:-Forget Everything And Ride!!
Little Rock ,Arkansas
Wild Wild West 2
Dance in Delaware
Austin Texas
First Ski
Kerala
Wild Wild West 1
Denver The Mile High City
Ocean City
Visit my new portal bharaththippireddy.net
Visit my new portal bharaththippireddy.net

లొకేషన్:-హాట్ స్ప్రింగ్స్,లిటిల్ రాక్,ఆర్కెన్సాస్
సమయం:-చిన్నపటి కల నిజమయ్యిన వేల,నివ్ యియర్ 2007.
నేను అమెరికా కి రావడంలో పెద్ద విశేషం ఎమి లేదు,చిన్నపటి నుంచే ఎప్పుడోవకప్పుడు నాకు ఇక్కడకి రాక తప్పదని తెలుసు.ఎందుకంటే నేను ఇంజినీరింగు మొదలెట్టక ముందే అమ్మ అలా డిసైడు అయ్యిపోయింది కాబట్టి:).అలా డిసైడు అవ్వడానికి కారం ఒకరు మా ఆస్టిన్ పిన్ని ఐతే ,మరొకరు మా లిటిల్ రాక్ జ్యోతి పెదమ్మ...
She is our fairy god mother..
చిన్నపుడు అమెరికా అంటే మాకు(నాకు , తమ్ముడికి) తెలిసిందల్లా జ్యొతి పెదమ్మ,పెదనాన్న,వంశీ,రాహులు...
మాటలు చెప్పే స్పీక్ అండ్ స్పెల్ నుంచి రాక్ బ్యాండు కీబోర్డ్ల వరకు ...
బేసిక్ బాష మాట్లడే కంపుటర్ నుంచి లేటెస్టు యానిమేటెడ్ ఇంగ్లిషు సినెమాల వరకు అన్ని ఆమె ద్వారనే తెలిసేవి మాకు.వారంతం వారాంతం జ్యొతి ఆంటీ ఫోన్ వచ్చిందంటే చదువునుంచి మాకు రెండు గంటలు విరామం ప్రకటిస్తుంది అమ్మ.అందుకే ఆ కాల్ కోసం అమ్మ కంటే ఎక్కువ మెమే ఎదురు చూసే వాల్లం.

నివ్ యియర్ 2007
ఎప్పటిలానే క్రిస్టమస్ సెలవులకి పిన్ని వాల్ల ఊరు , అదే మన ఆస్టిన్ వెల్లి ,నివ్ యియర్ టైం కి లిటిల్ రాక్ చేరుకున్నాను.లిటిల్ రాక్ అంటే లిటిల్ రాక్ నుంచి వో గంట దూరం లో వున్న హాట్ స్ప్రింగ్స్...
జ్యోతి ఆంటీ కార్లో యయిర్పోర్టు నుంచి ఇంటికి వెల్తూ వుంటే,రెండు సంవస్తరాలకి వో సారి వాల్లు ఇండియాకి వచ్చినప్పుడల్లా,రాహుల్ ,వంశీలతో కలసి మేము చేసే అల్లరి గుర్తుకువచ్చింది....

లేక్ హౌస్...
పెదమ్మ వాల్ల అందమైయిన లేక్ హౌస్ లోకి మొదటి సారి అడుగుపెట్టాను........
లేక్ హ్యామిల్టన్ కి ఆనుకొని అందులో బాగమెమో అనేలా వున్న ఇంటి బాల్కని లోకి వెల్తే లోపలకి రాబుద్ది కాదు .ఫొటో స్తుడియో లో బ్యాక్ గ్రౌండ్లలా ఎటు చూసినా ఇంకో వైపు చూడాలనిపివ్వనట్టుగా వుంది వివ్...
మరో నాలుగు అడుగులు వేసి బోట్ షెడ్లోకి వెల్తే...జెట్ స్కీలు ,వో సారి ఫ్లొరిడా గుర్తు తెచుకొంటూ రంగంలోకి దిగాము యువ సెన అంతా....

అలా పోటీ పడి జెట్ స్కీ రౌండ్లు వేస్తూ చిన్నపుడు హైదరాబాదు ఓషన్ పార్కులో అందరం కలసి చేసిన విన్యాసాలు గుర్తుకు తెచ్చుకున్నాము....

రెండవ రోజు హాట్ స్ప్రింగ్స్ డౌంటౌన్ విహార యాత్ర మా లిటిల్ కసిన్ వంశి నేపద్యంలో మొదలయ్యింది...
వంశితో కలసి కాస్తా ట్రెక్కింగు చేసేసి,హాట్ స్ప్రింగ్స్ మౌంటైన్ టవర్ పై నుంచి డౌంటౌన్ చూస్తుంటే తిరుమల కొండ ఎక్కుతూ తిరుపతిని చూసినట్టు మబ్బుల మద్యలోంచి భవనాలు చిన్ని చిన్నిగా బొమ్మరిల్లలా కనిపించాయి...

సహజ సాదారననంగా ఏర్పడిన ఈ వేడి నీటి జలపాతాలని తిలకించటానికే ఎంతో దూరం నుంచి ఇక్కడకి వచ్చే పర్యాటకులతో కిట కిట లాడుతొంది డౌంటౌన్.వీల్లలో ఆ నీటిని బాటిల్లు బాతిల్లలో నింపెసుకొని తీసుకు వెల్లే వాల్లు లేకపొలేదు.ఎందుకంటే ఆ నీటిలో ఎన్నో జబ్బులని నయం చేసే ఔషదాలు వుంటాయి..

ఎప్పుడూ జులై 4 న కలుసుకునే రాహుల్ , వంశి స్నేహిల్తులందరూ ఇసారి నివ్ యియర్ పార్టి కలసి చేసుకోవాలి అని దెసైడు అవ్వడంతో పెదమ్మ దానికి తగిన బందోబస్తు చేసేశారు....

హోం థియేటర్...
అప్పటి వరకు హోం థియేటర్ అంటే నాలుగు స్పీకర్లు వెనకాల , రెండు స్పీకర్లు ముందర వుంటే చాలు అనుకొనే నాకు ఆ గదిలోకి వెల్లగానే బెంగులురు పి.వి.ఆర్ సినెమస్ రాయల్(500 రూ టికెట్టు) లోకి వచ్చేశానెమో అన్నట్లు అనిపించింది.

నింటెండో ' వీ '
వీ ని కలవడం అది మొదటి సారి కానప్పటికీ అంత పెద్ద స్క్రీన్ లో బేస్-బాల్ ఆడుతుంటే యాంకీ స్టేడియం లో వున్న ఫీలింగ్ కలిగింది.ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాతావరనం వేడెక్కి హోరా హోరీగా సాగి బిగినర్స్ లక్ నా వైపు వుండదంతో గెలుపు నన్నే వరించింది...

టీటి బల్ల పైన ఎర్పాటు చేసిన వార్ గేం నన్ను ఎంత గానో ఆకట్టుకుంది.అప్పుడెప్పుడో కంపుటర్లో ఆడిన యేజ్ ఆఫ్ దా ఎంపైర్స్ గేం ని మరపించింది.....

నివ్ యియర్ పార్టి హ్యాంగ్ ఓవర్ నుంచి అప్పుడప్పుడే బయట పడుతున్న మమ్మలని ఫేమస్ ఇటాలియన్ రెస్టారెంట్ ఆలివ్ గార్డంకి తీసుకువెల్లారు పెదమ్మ వాల్లు..
అదే నా మొదటి ఆర్కెన్సాస్ ట్రిప్ కి ఫేరెవెల్ పార్టి.ఇలా మొదటి సారి పెదమ్మవాల్లని వాల్ల మెట్టినిల్లు అయిన లిటిల్ రాక్ లో కలవడం నా అమెరికన్ చాప్టర్లో మరవలేని మరో పేజీని ఇలా నమోదు అయ్యింది........
Related Articles
Florida Part 2:Miami The Paradise
UK Visitor Visa for non US Citizens in USA
Hasinis Day Out
Florida Part 1:Six days in Orlando
Texas:Take 8
F.E.A.R:-Forget Everything And Ride!!
Niagara Falls With West Coast Gang
Wild Wild West 2
Dance in Delaware
Austin Texas
First Ski
Kerala
Wild Wild West 1
Denver The Mile High City
Ocean City
Visit my new portal bharaththippireddy.net
Visit my new portal bharaththippireddy.net

లొకేషన్:-కొట్టాయం కేరలా
సమయం:-ఆన్-సైట్ కలలు నిజమైన వేల:)
హాలివుడ్ సెలెబ్రిటీలు అంత కర్చు పెట్టి ఐలాండ్లు కొనుకుంటూంటే మాకు మటుకు ఎక్కడ బోటు ఆగినా అది వో చిన్ని ఐలాండే.అలా అలల తో మా టైని-టానిక్ పైన పయనిస్తూ తెలుసుకున్న విషయం ఎంటంటే,

'కేరలా'
'కెరా అంటే కొబ్బరిబొండం/టెంకాయ ,'అలం' అంటే ప్రదేశం
సుందరమయిన "Gods own country" లో తల పైకెత్తితే టెంకాయ/కెర చెట్లే....

అసలు నానిగాడు ఇక్కడకి ఎలా చెరాడంటే...
ఫ్లాష్ బ్యాక్ @@@@@@
అది వో వర్షం కురవని సన్ని సన్ని డే.ఆన్-సైట్ అంటే ఆమడ దూరంలో వుండే మా మేనేజెర్ ...
ఏమొయ్ నాని MM ఆన్-సైట్ చాన్స్ వుంది వెల్తావ్ ఎంటి అంటే ,నా దిమ్మ తిరిగి టికెట్ బ్లాక్ అయింది...
MM అంటే అమెరికా చాక్లేట్ల కంపెనీ కాదని,చిన్నపుడు చదివిన మలయాళం మనోరమా పుస్తకాలు /కేరెలాలో అతి పెద్ద దైన దిన పత్రిక అని ఫ్లైటు ఎక్కేముందు గాని తెలియలెదు.
సో చికాగోగురించీ కలలు కంటూన్న నెను మొత్తానికి కొచ్చిన్ చేరుకున్నాను ఇలా.

ఆన్-సైట్ అమెరికా ఐతే వెనక్కి పంపేస్తారని పనిచేసివుండే వాడినెమో:).ఇక్కడ ఎక్కడికి పంపిచేది .ఎక్కువ చేస్తే సెలవలు పెట్టి మరీ తిరుగుతా అని చెప్పి ,రెండు నెలలలో ,నాని 'కెరలా లోకల్ 'లా తయారయ్యా.రక రకాల కొత్త వంటకాలు ట్రై చేస్తూ... 'చిల్లి ఫిష్','బనానా చిప్స్ ' నా ఫ్యావరేటుగా ఫిక్స్ అయ్యిపోయాను.మొదట్లో కొబ్బరినూనెతో తయారు చెసినా , త్వరగానే మన ఇ-స్టయిల్కి ట్యును అయ్యిపోయాడు హొటెల్వాడు.
ఇప్పుడు ఫ్లాష్ బాక్ నుంచి బాక్ వెల్తే@@@@

ఏ ఐలాండు లోఆపినా,అప్పుడే పట్టిన చాపలు,రొయ్యలు సెలెక్టు చేసెసుకోని మరీ వండించుకోవచ్చు..అల బోట్లో వెల్తూ తెలుసుకున్న విసెషాలు ఇవి...

కెరెలా literacy rate is almost 100% అని తెలిసిన నాకు,దాని వల్ల నా మిత్రులు పడే కష్టాలు నా మనసుని కదిలించేసాయి.ఇక్కడ సాఫ్ట్ వేరు ఇంజినీరుకి హార్డుగా నెలకి వో ఎనిమిది వేలు ముడుతుంది.ఇంక డిగ్రిలు చేసి ,కాలిగా వుండే వాల్లు ఎందరో....
అందుకే నిరుద్యొగంతో పాటు ఇక్కడ సుఇసైడ్ల సంఖ్య కూడ ఎక్కువ అవ్వటం దురద్రుష్టకరమయిన విషయం...

ఒకప్పుడు కేరలకి తమిలనాడుకి ఒక్కటే బాష వుండెదంట.అందుకే కాబొలు ఇప్పటికి కెరల వాసులు తమిల సినెమాలు తెగ చూస్తారు.

'చటా' అంటే మళయాళంలో 'అన్నా అని కూడ తెలుసుకున్నను:)

అప్పట్లొ మనకి అమెరికాలో ఎముందో తెలిదు కాని,ఇంతకంటే సుందరమైన ప్రదేశం ప్రపంచ్చంలో ఎక్కడా వుండదని ఫిక్స్ అయ్యిపొయ్యా...
ఇక్కడ వొక్క,కాఫీతో పాటు రబ్బర్ ఎంత ఎక్కువ దొరుకుతుందో రబ్బరుతో వేసిన రోడ్లు చూస్తే తెలుస్తుంది....
ఇలాంటి విషయాలు తెలుసుకుంటూనే అందమైన ఎన్నో ప్రదేసాలు తిరిగేశాము.వైకొం టెంపుల్ (లక్ష దీపల దెవాలయం),కొట్టాయం బ్యాక్వాటర్స్.

ఇన్ని కొత్త ప్రదేశాలు తిరిగినా ఒక్కసారి కూడా నా పర్సుని బయటకి తీనివ్వని నా మిత్రులకి వీడ్కోలు పలుకుతూ ,
బెంగులూరుకి రండి మీ పని చెప్తా అని చెప్తూ జెట్ యయిర్వేస్ వారి విమానం ఎక్కేశాను....
This part of my blog is dedicated to my mallu friends:).reji,praveen,rajesh,joseph.pavan....
Related Articles
Florida Part 2:Miami The Paradise
UK Visitor Visa for non US Citizens in USA
Hasinis Day Out
Florida Part 1:Six days in Orlando
Texas:Take 8
F.E.A.R:-Forget Everything And Ride!!
Niagara Falls With West Coast Gang
Little Rock ,Arkansas
Wild Wild West 2
Dance in Delaware
Austin Texas
First Ski
Wild Wild West 1
Denver The Mile High City
Ocean City
Visit my new portal bharaththippireddy.net
Visit my new portal bharaththippireddy.net
సమయం:- 2006 ధ్యాంక్స్ గివింగ్
లొకేషన్:-LA నుంచీ వేగస్ వరకూ...
ఈ "నా కెమెరా ఈ ప్రపంచం" సెక్షన్ని ఈ ట్రిప్పుతో మొదలెట్టటానికి కారనం మా అనీల్ గాడు...
అస్తమిస్తున్న సూర్యుని సైతం,వెలుగుతో నింపగల మన స్నేహం....
ద్యాంక్స్-గివింగ్ అంటే నాకు అదో ఎక్ట్రా జోష్ వచ్చేస్తది , నాకే కాదు నాలుగు రోజులు సెలవలు అంటే యే సాఫ్టువేరు ఇంజినీరుకి మటుకు జోష్ రాదు చెప్పండి.ఇ జోష్ లోనే నా వీసా స్టాంపింగ్ నిమిషంలో చేసేశారు చెన్నై అమెరికన్యంబస్సిలో ఒకప్పుడు :).ఇ జోష్తో పాటూ చిన్నపటి బెస్టు ఫ్రెండుని పది సంవస్తరాల తరవాత కలుస్తున్నా అనే ఫీలింగ్తో ఫిల్లడల్ఫియా ఇంటర్నేషనల్ యయిర్పొర్ట్ నుంచి బయలుదేరాము వైల్డ్ వైల్డ్ వెస్ట్ కి.
నాతోపాటు వచ్చిన నా రూమేట్ సుమంత్ తో కబుర్లు చెప్పుకుంటూ ల్యాప్టాపులో సినిమాలు చోస్తూ, అయిదు గంటలలోలాస్ వేగాస్ చేరుకున్నము.ఫ్లైట్ మారడనికి టెర్మినల్కి వెల్తుంటే అది యయిర్పొర్ట్ కి తక్కువ కెసినోకి ఎక్కువలా వుంది.మరో గంటసేపు ఫ్లై చేసి LA చేరుకున్నాము.
ఆ తూరుపుకి ఈ పడమర ఎంత దూరమో ,ఈ తూరుపుకి ఈ పడమర అంతే దూరం అనిపించింది.
అనీల్:-
10త్ క్లాస్లో నా పేపర్ ని వాడి పేపర్ లా చూసుకొని పాస్ అయ్యినా:) ,ఇంఫొసిస్లో జాబ్ సంపదించి నాకంటే ముందే అమెరికాచెరుకున్న నా ప్రాణ స్నేహితుడు .ఇద్దరం కలసి పది సంవస్తరాలు అయినా ,ఆకరి రోజు మాటలు ఎక్కడ ఆపెమో అక్కడనుంచే మొదలెట్టినట్టు స్టార్ట్ చేశాం .
మరో పక్క నార్త్ కెరోలినా నుంచి వచ్చిన సుజిత్ని, సుమంత్ ఫ్రెండ్ అయిన సుబ్బుని కలవడంతో వో చిన్ని క్రికెట్ టీం తయారయింది.వచ్చివో వొన్ యియర్ అయ్యిపోవడంతో అనీలుగాడికి universal స్టూడియోకి వెల్లడం వో హాబి,దిస్నీ లాండ్ అంటే వో ఆట,వెగస్ కి వెల్లి డబ్బులు పోగొట్టు కోవడం అంటే వో సరదా:)

డిస్నీ ప్రపంచం (వరల్డ్)తో ప్రారంభించాము మా ఫైవ్ డే వెకేషన్ని.రక రకాల రైడ్లు ఎక్కడమే గాక నా ఫ్యవరైట్ యానిమేటెడ్ క్యారెక్టర్ అయిన ష్రెక్ ని కూడ కలిశాము.
చిన్నపుడు వారం అంతా వెయిట్ చేసి ఆదివారం దూర-దర్షన్లో చూసిన మిక్కి మౌస్ని డైరక్టుగా తన ఇంట్లోనే కలవటం వో తీయ్యని అనుభూతి.
'నీ ఇంటి కొచ్చా నీ నట్టింటికొచ్చా అనుకుంటూ ఫొటోలు తీసుకున్నాం:)'


LA నుంచి వేగస్ నాలుగు గంటల డ్రైవ్.అది 'one of my favourite drives' అనె చెప్పుకోవాలి.ఎందుకంటే అక్కడ స్పీడ్ లిమిట్ చాల ఎక్కువ:).ఇంకెముంది నేల తాకినా టైరు స్పీడు తగ్గని కారు.కారు అగిందంటే ఫొటోలు.యే పని చేసినా ఫొటోనే .యే పని చెస్తున్నా,పాపం మా అనిలుగాడు:).రోడ్డుకి రెండు వైపులా ఎడారి.
వేగస్ స్ట్రిప్పులోకి ఎంటర్ అవ్వగానే కల్లు జిగెల్ మనిపిస్తూ అవి బిల్డింగులా పెద్ద సైజు ట్యుబులైట్లా అనిపించింది ,అనిల్ గాడికి తప్ప మా అందరికి.
ప్రతి కెసీనోకీ వో హొటెల్తో పాటు వో తీం కూడా వుంటుంది.సీసర్స్ ప్యాలస్ ఐతె ఈజిప్టులోని రోము మహా నగరములా,నివ్యార్క్ నివ్యార్క్ ఐతె వొ మిని సైజు నివ్యార్క్ లానే వుంటుంది.
మా మంకీ మందకి తగ్గటే సర్కస్-సర్కస్ హొటెల్లో రూములు బుక్ చేశాడు అనిలుగాడు.
స్లాట్ మెషీన్ల నుంచ్చీ పోకర్ వరకూ ,బ్లాక్ జాక్ నుంచీ రోలెట్ వరకూ అన్నింటిలోనూ మా అద్రుష్టాన్ని పరీక్షించుకొంటూ కెసీనోలన్నీ తిరిగేశాం.

వేగస్ అంటెనే నైట్ లైఫ్ .కెసినోలో బ్రోకర్లకి కాసేపు రెస్ట్ ఇచ్చి బయటకు వస్తే సీసర్స్ ప్యాలస్ దగ్గర డ్యన్సింగ్ ఫౌంటైన్ చూస్తూ అరగంట సెపు అలానే వుండి పోయాము.

వెగస్కి వెల్లి శ్ట్రాటోస్పియర్ ఎక్కకపోతే తిరుమలకి వెల్లి లడ్డు తిననట్టే:).

వంద ఫ్లోర్ల పైన హొటెల్లో కూర్చొని వెగస్ని చూడడమే కాదు అంత ఎత్తున మల్లి రైడ్లు కూడ ఎక్కెయొచ్చు.

హాసిని డ్రైవర్ లేడు:)
X-Scream:- బిల్డింగ్ కి చిట్ట చివరకి తీసుకొచ్చి అపేస్తాడంతే!!
Insanity:-వేగస్ మొత్తం చిన్నిదిగా కనిపిస్తూ వుంటే,మనల్నిఆకాశాంలోకి విసిరి వేసి నట్టూ అనిపిస్తుంది.
Big Shot:- వంద ఫ్లోర్ల పైన అల్లి బిల్లి ఆట:).ఆపండ్రోయ్ అంటే అక్కడే ఆపేస్తారని ,గమ్మునే వున్నా వో రెండు క్షనాలు అక్కడే ఆపేశారు.రోడ్డు పైన కార్లు,బిల్డింగ్లు, లెగోస్తో కట్టీన బొమ్మల్లా చిన్ని చిన్నిగా కనిపిస్తుంటే మాకు ఆకాశంలో చుక్కలు నేల మీదే కనిపించాయి:).
ఒక్కొ రైడు అయిదు సార్లు ఎక్కితే గాని తనివి తీరలేదు మాకు:)
ఇలా రెండు రోజులు రెండు రాత్రులు వేగస్ కెసినోల స్టాక్ వ్యాలువ్ పెంచి ,మా పర్సుల బరువు తగ్గించుకోని,మరచిపోలెని ఎన్నో అనుభవలని బ్యాగ్లలో ప్యాక్ చేసుకొని కొత్త స్నెహితులతో కలసి గ్ర్యాండ్ కెన్యాన్ కి బయలుదేరాము.
Related Articles
Florida Part 2:Miami The Paradise
UK Visitor Visa for non US Citizens in USA
Hasinis Day Out
Florida Part 1:Six days in Orlando
Texas:Take 8
F.E.A.R:-Forget Everything And Ride!!
Niagara Falls With West Coast Gang
Little Rock ,Arkansas
Wild Wild West 2
Dance in Delaware
Austin Texas
First Ski
Kerala
Denver The Mile High City
Ocean City
Visit my new portal bharaththippireddy.net