Visit my new portal bharaththippireddy.net
సమయం:-2008 కి వీడ్కోలు పలుకుతూ 2009 కోసం ఎదురు చూస్తూ.....

ఎక్కడో లేదు రా ఆనందం....
నీలోనే వుంది రా ప్రపంచం...
అది తెలుసుకోవడమే రా జీవితం..
తెలుసుకున్న వాడికదే శాస్వతం....
ఇల్లు వదలి స్కూలుకెల్తే ,మాస్టర్స్ డిగ్ర్రితో కలిసొస్తుందా?
బైకులంటు,ప్రేమలంటే ,మొదటి రోజు సినెమాలో వుందా?
జాబు వచ్చి ,రెక్కలొంచితే,డబ్బుతోనె పెరుగుతుందా?
బారు కెల్లి బీరు కొట్టిన స్నేహం వెనుక ఆగి వుందా?
ఫ్లైటు ఎక్కి అలలు దాటితే , ఏడు వింతలలో దాగి వుందా?
ఎక్కడో లేదు రా ఆనందం....
నీలోనే వుంది రా ప్రపంచం...
అది తెలుసుకోవడమే రా జీవితం..
తెలుసుకున్న వాడికదే శాస్వతం....
When you can share others happiness ,There will be no moment of sadness.
And when u can't, All you are left with is.....
Happy New Year!!
Inspired by her,
నాని
Visit my new portal bharaththippireddy.net
Visit my new portal bharaththippireddy.net
లొకేషన్:-దర్గామిట్ట నెల్లూరు...
సమయం:-బిజి బిజిగా ఆఫిసు నుంచి వచ్చి హరి హరిగా కారు పార్కు చేసిన నన్ను,సైకెల్లలో ఎదురొచ్చిన ఇద్దరు చిన్నారులు పలకరిస్తే...
"A journey through my beautiful childhood..."
ఆనందం ,అది శినివారం హాల్ఫ్ డే,ఇంటికి త్వరగా వెల్లి పోవొచ్చనా?
సంతోషం, ఇంటికి వెల్లగానే ఊరినుంచీ తాతయ్య వాల్లు వచ్చి వుంటారనా?
ఉత్సాహం ,ఈసారి వచ్చినప్పుడు నాకు టు వీలర్ కొనిస్తామని తాతయ్య వాల్లు చెప్పారనా?

లలితక్క బడి గంఠ కొట్టేసింది ,మా st joseph స్కూల్ అషోకా చెట్ల మద్యలో తమ్ముడితో కలసి గేట్ దగ్గరకి నడుస్తూ వుంటే ఎదురుగ్గా జార్జి... 'George of the jungle' కాదు,మా డ్రైవర్ జార్జ్.జార్జి మొహంపై కాల్గేట్ స్మైల్.దాని అర్దం మాకు తెలుసు.పరిగెత్తుకుంటూ మా జీపు వైపు వెల్లాము నేను తమ్ముడు.జీపు లోంచి దిగగానే ఇద్దరినీ చెరొక చేతులో ఎత్తేసుకున్నారు తాతయ్య.జేబు లోంచి ఫైస్టార్ చాక్లేట్లు తీసిచ్చారు.ఎవరు ముందు తినెస్తార అని నెను తమ్ముడు నెమ్మదిగా తింటూ వుంటే,ఇల్లు దగ్గర పడింది. జీపు ఇంటివైపుకి కాకుండా నేరుగా పోనిచ్చాడు జార్జి.ఎక్కడికి వెల్తున్నామో తెలియకపోయిన,ఎందుకు వెల్తున్నమో తెలియడంతో ఇంక మా మనస్సు వర్షా కాలం పెన్నా నదిలా ఆనందంతో ఉరకలు వేసింది.
RTC బస్ స్తాండు,మెడ్రాస్ బస్ స్టాండు ,గాంధి బొమ్మా దాటేయగానే జీపుని ట్రంక్కు రోడ్డుకి కుడి వైపున నిలిపాడు జార్జి. షాపులోపలికి వెల్లగానె కుడివైపు హీరో సైకిల్లు,యెడమ వైపు B.S.A SLR సైకిల్లు కనిపించాయి.తతయ్య చేయి పట్టుకోని కాస్త లోపలకి వెల్లగానే కుడి వైపు అమ్మాయిల ద్వి చక్ర వాహనాలు కనిపించాయి ,అంటే వాటికి సీట్కి హ్యాండిల్ కి మద్య కమ్మి లేదన్నమాట. చిన్నపిల్లలకి కొత్తగా వచ్చిన సైకిల్లు ఇ పక్క వున్నాయి అండి, అన్నాడు షాపు అతను .అటు వైపు తిరగగానే ...
మునుపెప్పుడూ చూడలేదు ....
రెండు నేరేడు పండ్ల లాంటి చక్రాలు ,ఒక మల్లె తీగ లాంటి హ్యండిలు ,వెనక ఒక క్యరెజి ....
అంటే అన్ని సైకిల్లకి ఇలనే వుంటాయి అనుకోండి.కాని మీరు అర్దం చేసుకోవలి..."Luv at first sight" మరి....:)
అప్పుడు మన అలోచన ఇలా వుండేది..
పొడువాటి సీటు..నేను తమ్ముడు కూర్చొవచ్చు...
వెనక క్యరియర్ వుంది..క్రికెట్టు బ్యాటు పెట్టుకోవచ్చు...
సైజు చిన్నగా వుంది సైకిల్ గ్యాప్లో దూరేయొచ్చు...
చిన్న పిల్లోడిలా ఆలోచించా కదా:).మరి అప్పుడు నేను ఒకటో తరగతి చదువుతున్నాను...
మా వాడి హైటుకి అది కాస్త పెద్దదవుతుందెమొ ,కాల్లు అందుతాయి అంటారా?.లెదండి,బ్యలెన్స్ చెయ్యడం నెర్చుకునే వరకూ వెనక చక్రానికి రెండు వైపులా రెండు వీల్స్ని అమరుస్తాము.అవి మీ వాడు కాలు అందకపోయినా పడకుండా ఆపుతాయి.తాతయ్య లాంత్తరులా వెలిగి పోతున్న నా మొహాన్ని చూడగానే , జార్జి నా బైక్ ని జీప్ ఎక్కించాడు...

జీపు దిగగానే ఎదురుగ్గా షెడ్డులో నా టయొటా .నాకు రెండవ పుట్టినరోజు నాడు పెదనాన్న ఇచ్చిన బహుమతి అది.ఇంజిన్ లేక పోయినా,నెల్లూరిలో మా ఇంటి దగ్గర ,వింజమూరిలో అది తిరగని సందంటూ లేదు.రెపటి నుంచి నీ భాద్యత తమ్ముడిది అనుకొంటూండగానే..జార్జి నా టూ వీలర్ దించశాడు.
అమ్మ హ్యండిల్కి బొట్టు పెట్టి, పచ్చ జెండా వూపేయ గానే ,నాన్న జాగ్రత్తలు చెబుతూ ఫొటోలు తీస్తుంటే,వెనుక నుంచి తమ్ముడు నెడుతూ సందు చివరిదాక వెల్లాక వెగిరి వెనకాల క్యరీయర్ పైన కూర్చున్నాడు.

టీవిలో స్ట్ర్రిట్-హాక్ సీరియల్ చూసి రాత్రి పగలు అని తేడా లెకుండ ,మెయిన్ రోడ్డు, బైపాస్ రోడ్డు అని బేదం లేకుండా తిరిగేశాం నేను నా కో-పైలట్(తమ్ముడు). వీల్స్ వున్నంత కాలం అమ్మ వంట సామాను నుంచీ మా క్రికెట్టు బాల్ల వరకూ అన్నింటికీ మా స్ట్రీట్-హాక్ పైనే వెల్లేవాల్లం.
తాతయ్య వూరికి వెల్లిపోయి రెండు వారాలు అయ్యింది ,నాన్న నేను బాగ తొకుతున్ననాని ,తొక్కలో వీల్స్ తీసేశారు.కాస్త దూరం నెట్టి వదిలేశారు .సందు చివరదాక వెల్లిపోయను....రోడ్డు పైకి ఎక్కుదాం అంటే ఎదురుగ్గా వో కారు వస్తోంది.ఆగాలంటే కాల్లు అందట్లేదు ,కుడి పక్క చిన్న కాలువ ,యెడం పక్క వో కరెంటు స్తంభం .నాన్న పరిగెడుతున్నారు నాకేసి దూరం నుంచి.ఇంతలో బ్రేకు వేసి కరెంటు స్తంభానికి వుండే సిమెంటు పునాది రాయి పై కాలు పెట్టి అపేశాను .హీరోలా నిలుచున్నాను నాన్న గారు వచ్చి దింపే వరకు.లోపల షేక్ అయినా బయట బ్రేక్ వెయ్యడం అంటే ఇదే అంటూ ఇంటికి తీసుకెల్లారు.....
ఇక ఆరోజు నుంచీ స్కూలికి వెల్లేముందు పది ట్రిప్పులు, వచ్చాక అలసిపొయాం అనేంత వరకూ తిరుగుడే తిరుగుడు మా స్ట్రీట్-హాక్ పైన.ఎంత తిరిగాం అంటే మా తిరుగుడు నచ్చి N.T.R గారు అయన పార్టికి మా సైకెల్ గుర్తు పెట్టేసుకున్నారు...
ఇలా మా తాత గారి రెకమెండేషన్-తో నాకు కార్ నుంచీ సైకిల్ కి ప్రమోషన్ వచ్చేసిందన్నమాట:)
నాని
Visit my new portal bharaththippireddy.net