అనగనగా వొ బెంగులూరు మహా నగరం.ఆ ఊరిలో ముగ్గురు మిత్రులు.వాల్లు జస్ట్ మిత్రులు కాదు - స్కూలు,కలేజి,టినేజి అంతా కలసి ఈదేసిన ప్రాణ స్నేహితులు.ఉద్యోగ వేట టీనేజి కలేజి లా కాదని ,అది వో పెద్ద డ్రైనేజి అని అర్దం చేసుకోవటానికి వాల్లకి రెండు సంవస్తరాలు పట్టింది.
ఈ మద్యనే ఒకరి తరువాత ఒకరు ఒకే చిన్న సాఫ్టు వేరు కంపెనిలో ఉద్యోగాలు సాదించారు.నెలకు ఏడు వేలు జీతం.మరి మన వాల్ల కర్చు అంటార పది వేలకి తగ్గదు .అందరిది కలిపి కాదు ,ఒక్కోకరిది.ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోరు.మొహమాటం కాదు,ఊరిలో,ఇళ్ళలో వాల్లు ఇచ్చిన్న బిల్డ్ అప్ అలాంటిది.సంవస్తరం క్రితమే ఒకరు ఒరాకిల్,ఒకరు ఇంఫోసిస్ మరొకరు టి.సి.ఎస్ అంటూ కమ్మిట్ అయ్యారు. ఎప్పుడయినా ఊరికి వెల్లవలసి వస్తే ఒక్కరే వెల్తారు.అంటే ముగ్గురూ వెల్తే పని ఆగిపొతుంది అని కాదు,వీల్లు చేసే పనికి అంత సీను లేదు.అసలు మెలికేంటంటే ఒకరు ఊరికి వెల్లాలంటే మిగిలిన ఇద్దరు నగలు తాకట్టు పెట్టాలి.మరి ఒరకిల్ అన్నాక ఆ మాత్రం కర్చులు వుండొదేంటి.ఆ అప్పు తీరాక మరొకరు వెల్లేవారు.
ఎవరు పేర్లు చెప్తే మెస్సులో కాతా మూసేస్తారు...
ఎవరు కార్డు పెడితే ఏ.టి.ఎం మిషీన్లు క్రాష్ అవుతాయో...
ఎవరు అడుగేస్తే టూలెట్ బోర్డ్లు రాలి పోతాయో... వాల్లే వాల్లే..
రాంబాబు - కొంచం ఆశ ఎక్కువ. మొహమ్మద్ గజిని తో పోటి పడుతూ ఈ మద్యనే పదహారో దండయాత్ర అదే పెళ్ళి చూపులు ముగించుకు వచ్చాడు.అంతా అయ్యాక తనకి మొట్ట మొదట చూసిన అమ్మాయి నచ్చిందనడంతో , కాల్లు విరగొట్టి బస్సు ఎక్కించారు నాన్న గారు.
అవినాష్ - కొంచం దూకుడు ఎక్కువ.ముగ్గురిలో శని గ్రహానికి కొంచం దూరం లో వున్న ఉపగ్రహం వీడు ఒక్కడే.
బాల - ఇంటి పని అయినా,వంట పని అయినా ,ఆఫీసు వర్క్ అయినా నెమ్మదిగా ఎంతో భక్తి శ్రద్దలతో చేసే స్వభావం.
అది మామూలు సోమవారం కాదు,అలా అని కార్తీక సోమ వారము కాదు ,కాని వాల్ల ముగ్గురికి ఎంతో ముక్యమయిన నెలాకరు శాలరీ డే మండే.
అవినాష్ కార్డు పెట్టాడు, పిన్ను కొట్టాడు.
టాకింగ్ 2జి బ్యాంక్ ఏ.టి.ఎం: అవినాష్ , శాలరీ పడింది రో ,పండగ చెస్కో అంటూ రిసీప్టు ప్రింటు చేసింది టాకింగ్ ఏ.టి.ఎం.
దాంట్లో ఏడు వేలకి బదులు పద్నాలుగు వేలు అని వుంది బ్యాలెన్సు.ఆస్చర్యం లో మునిగిన ముగ్గురికీ బ్యాక్ గ్రౌండ్లో ఒకే పాట -"కజరారే కజరారే..."
అవినాష్: నా జీతం రెండు సార్లు వేశారంటవా?
రాంబాబు: నాకూ ఒసారి ఇలానే జరిగింది .ఆనందంలో మల్లీ తీసుకుందాం అని వున్న డబ్బు తో జల్సా చేశా .మరుసటి రోజు మొత్తం వెన్నకి వెల్లిపోయింది.
బాల: అలా ఎలా చేస్తారు బ్యాంక్ వాల్లు?
రాంబాబు: అమౌంట్ వాల్ల దగ్గర వున్నంత వరకు ఏమయినా చెయ్యగలరు,నా మాట విని మొత్తం తీసెయ్.
అవినాష్: అంటే మొత్తం ఏడు వేలు నా?
రాంబాబు: కాదు మొత్తం పద్నాలుగు వేలు..
అవినాష్: కాని..?
రాంబాబు: కర్చు పెట్టడం రాని వాడికి దబ్బు వుండ కూడదు.డబ్బులున్నపుడు అలోచించ కూడదు.అయినా వద్దు వద్దు అనుకుంటే, వచ్చేట్టు వున్నాయి డబ్బు అయినా ,పెళ్ళి అయినా.ఇంకేం ఆలోచించకు అంటూ...ఆటో అన్నాడు...
బాల: ఎక్కడికి?
రాంబాబు: ఫోరం
బాల: మరి ఆఫిస్?
రాంబాబు: మనం హల్ఫ్ డే ఆఫ్ తీసుకుంటే ఎకానమీ ఏమీ దివాల తియ్యదు లే.
ఆ రోజు అంతా రాంబాబు ఆద్వర్యంలో పి.వి.ఆర్ లో రాయల్ క్లాస్-అయిదు వందలు టికెట్టు పెట్టి ధొబీ ఘాట్ సినిమా చూసి,బ్రిగెడ్ రోడ్లో కరీదయిన షాపింగు చేసి,నాసా పబ్బు లో మిగతా ముక్య మైన కార్యక్రమాలు ముగించుకున్నారు.బ్యాలెన్సు ఏడు వేలకు చేరి,వాల్లు ఇంటికి చేరే సరికీ అర్ద రాత్రి రెండు గంటలు అయింది.
మరుసటి రోజు - హ్యాంగ్ ఓవర్ వదిలే సరికి లంచ్ టైం అయింది.....
నిన్నలా ఎంజాయ్ చేసి చాలా రోజులు అయింది రా అంటూ రాంబాబు కార్డు పెట్టాడు, పిన్ను కొట్టాడు.
టాకింగ్ 2జి బ్యాంక్ ఏ.టి.ఎం: దేవుడు నాకు రెండు చేతులు ఇచ్చి వుంటే వీడి కాలర్ పట్టుకొని చొక్కా చిరిగేట్టు కొట్టే దాన్ని అంటూ ,పిడ్డేల్ మని కార్డు ఈడ్చి మొహాన కొట్టింది.ఏముందని కార్డు పెట్టావ్ బాబు రాంబాబు,బ్యలన్సు నిల్లు బాసూ అంది ఏ.టి.ఎం.
ముగ్గురికీ బ్యాక్ గ్రౌండ్లో ఒకే మ్యుసిక్ -"అయ్యయ్యొ-చెతిలొ-దబ్బులు-పొయనె...అయ్యయూ"
కాసేపు తరువాత తేరుకొని..
రాంబాబు: అవినాష్ వైపు చూస్తూ అరెయ్ నా దౌట్ ఎంటంటే , నాది నీదాంట్లో వేసరా.నీకు ఎక్కువ వేశారని నా దాంట్లో పీక్కున్నారా?
అవినాష్: నేను ఇవ్వ?
రాంబాబు: అది కాదు రా..
అవినాష్: నేను ఇవ్వా!!
బాల: చక్కటి చిరు మందహాసం తో రాంబాబు వైపు చూసి - ఏది ఏమి అయినా నీ ఫిలాసఫీ మటుకు సూపరు మామ - కావాలి కావాలి అంటే వచ్చేట్టు లేవు డబ్బు అయినా ,పిల్ల అయినా...
Inspired by a recent happening - i had to call my previous employer and ask him to stop paying bi-weekly ,as they dint - even after a month after i left:)