Blessed by the absolute,Inspired by my family and Influenced by my teachers-While I explore and learn more in the career development, personal development and self consciousness spaces I will try to creatively express my thoughts,work and experiences through my blog, videos etc to help others while helping myself.
Monday, January 12, 2009
బోగి/సంక్రాంతి శుభాకాంక్షలు(అరిసెలు,త్యాగలు,తాటికాయలు:) :-A new Beginning...
Visit my new portal bharaththippireddy.net
బోగి/సంక్రాంతి అనగానే నాకు గుర్తుకు వచ్చేది మా ఊరు,మా వాల్లు... ఎందుకంటే అది మాకు పెద్ద పండుగ,అవును చాల పెద్ద పండుగ...
ప్రతి సారి హాఫియర్లీ సెలవులని వేడి వేడిగా బోగితొనే ఆరంభించేవాల్లం , పాత వాటికన్నింటికీ వీడ్కోలు పలుకేస్తూ.....
వారం రొజుల ముందే ఎద్దుల బండి పై వచ్చిన తాటి ఆకులని ఇంటి వెనకాల బర్రెల కొట్టం లో పెట్టించేస్తారు నానమ్మ్మ.
అమ్మ చేసిన నేతి అరిసెలు ఎర్ర పంచలో , గడ్డి మీద గుమ గుమ లాడుతున్నాయి.
ఇంటి వెనకాల గోబర్ గ్యాస్ నుంచి మొదలెట్టి ,ఇంటి ముందు అవ్వ కూర్చునే గట్టు వరకు అంతా సుబ్రంగా కడిగించేశారు.ముగ్గు వేయటానికి విజయక్క,అమ్మ కల్యాప కూడ చల్లేశారు...
పొద్దునే నాలుగు గంటలకి మేడ పైన పడుకోనున్న మా పిల్ల కట్టని నిద్ర లేపెశాడు రంగన్న.
కొందరు తాటాకులతో, ఒకరు కిరసనాయిల్తో ,మరొకరు అగ్గిపెట్టితో రేడి అయ్యాము.తాటాకులు పోగు చేయగానే సుమన్ కిరసనాయిల్ పొసేసెడు.
ఇంట్లో వాల్లంతా చుట్టూ నిలుచుని మా వైపు చూస్తూండగానే, నేను తమ్ముడు మంట వెలిగిచేశాము.మాతో పాటు మా వీధిలో అందరూ మొదలెట్టారు.కొంత మంది పాత వస్తువులతో పాటూ పాత బట్టలు కూడా వెసేశారు.
ఎవరి బోగి మంట ఎక్కువ ఎత్తు లెగుస్తుంది అని పోటా పోటిగా తాటకులనుంచి,ఇంట్లో పాత సామను అంతా వెసేస్తు వుంటే ,నాన్న కొన్ని త్యాగలు ,తాటి కాయలు తెచ్చి మంటలో వెసెశారు.
మంట పెరగడానికెమొ అనుకున్నాము,కాని అవి మంట ఆగాక తినటానికి అని పొద్దునకి కాని తెలియలెదు మాకు:)
అందరిని వోడించేస్తూ,స్వర్గాన్ని తాకుతున్నట్లుగా ఎగసింది మా బోగి మంట.ఇ సంవస్తరం వర్షాలు బాగ కురిపించాలని ,పంటలు బాగ పండి మా వూరు పచ్చగా కల కల లాడలని ఇంద్రునికి చెప్పేసింది....
మిగతా నిద్రా కార్యక్రమం కొనసాగించి కిందికి రాగానే....
బోగి స్పెషల్ దొశలు,వడలు మరియు నాటు కోడి కూర:)...అవి తినేయగానే డెసర్ట్ రూపంలో పొద్దున నాన్న గారు మంటల్లో వేసిన త్యాగలు ,కాల్చిన పండు తాటికాయలు.పండగ చేసుకోవడం అంటే అది అనేలా కుమ్మెశాం:)
ఇక ఆరోజు నుంచి ఇంటి ముంగిట ముగ్గుని దాటుకుంటూ మామూల్లకి వచ్చే వాల్లతో,అరిసెలు కోసం వచ్చే వాల్లు,వడ్ల కోసం వచ్చే వాల్లతో వీది/ఊరు, పండగ వాతావరనంలో మునిగి పోతుంది.
అంతరించిపోతున్న కట్టుబాట్లు , మరచిపోతున్న ఆచారాలతో పరుగులు తీస్తున్న నగర వాసులతో పాటు ఇంకెమన్నామిగిలి వుంది అంటే అది మా పల్లెటూరి లాంటి పల్లెటూర్లలోనే.....
So leave all those old thoughts/worries and renew yourself!!
Happy Boagi/Sankranthi/Pongal!!
A New Beginning,
నాని