నాలుగో తరగతి - క్లాస్లో,రిక్షాలో ,ఆడుతున్నా,చదువ్తున్నా అదే ద్యాస .కల్లు తెరచినా మూసినా ఒకే రంగు ,ఆకు పచ్చని చిలుక అది మట్లాడే మాటలు.దీనికి కారనం ప్రతి ఆది వారం మేము ఎదురు చూసి మరీ చూసే మాల్గూడి డేస్ టివీ సీరియల్.మొదటి ఎపిసోడ్ నుంచీ ఎంతో ఇష్టం ఎర్పడినప్పటికి,గత నెల రోజులగా-రాము అనే పిల్లవాడికి మాట్లాడే చిలక దొరకడం,దానితో వాడు చేసే రక రకాల తమాషాలు నన్ను ఎంతగా ప్రభావితం చేసేయి అంటే.నాకు చిలుక కావాలి.దానికి నేను మాటలు నేర్పించి ఆడుకోవాలి.స్కూలుకు తీసుకుపోయి ఫ్రెండ్స్ కి చూపించాలి, నేను విజిల్ వేసి పిలిచే దాకా అది గ్రౌండ్ చుట్టూ గాలిలో రౌండ్లు కొట్టాలి.
తాత కొనిచ్చిన ఫై స్టార్లు తింటూండగానే బస్సు సంగం చేరుకుంది.కిటికీ కమ్ములని పట్టుకోని టైరుపై కాలు పెట్టి జాంకాయలు రూపాయికి నాలుగు అంటూన్న అతన్ని చూసి చిలుక అలోచనన్లు మల్లీ మొదలయ్యాయి.సూర్యుడు పసుపు రంగు నుంచి ఎరుపు రంగులోకి మారే సమయానికి,కిటికీ కమ్ములపై మోచేయికి తలనుంచి సంగం రిసర్వాయర్ దగ్గర తీగలపై వాలి వున్న చిన్ని చిన్ని పక్షులని చూస్తుంటే ఆ చిలుక ముక్కు ,కళ్ళే..
పనుకోనున్న తాతయ్య వేల్లు లాగుతూ చిలక విషయం చెప్పాను.తతయ్య వో సారి పురాణాలు గుర్తు చేస్తూ రామ చిలుకలు ఇల్లలో వుండకూడదు,నటింట్లో వాటి అరుపులు మంచిది కాదనడంతో వేల్లు లాగడం ఆగింది. మరుసటి రోజు ఉదయం,చిలక తెచ్చే దాకా ఏమీ తిననని బయటకు వెల్లి పొయ్యాను.
రెండు ఇల్ల అవతల సందుకి అటు వైపు క్రిష్నా వాల్ల ఇళ్ళు.వరుసకి అన్న , కాని ఎప్పుడు అలా పిలువనని కోపం వున్న బస్సు దిగినప్పటి నుంచి తిరిగి వెల్లే వరకు నా వెంటే వుంటాడు.నాలుగేల్లప్పుడు ఓసారి మెట్ల పైనుంచి సరదాగా తాలాం బుర్ర నెత్తిపై వేశాను,అయినా క్రిష్నా లో ఏ మార్పు లేదు.గుడిసే అయినా ,అడుగు పెట్టగానే గుడిలా అనిపించేది.బర్రెల కొట్టాం బయట మంచం మీద కూర్చుని దూడ వైపు చూస్తూ చిలక గురించి అలోచిస్తుంటే పెదమ్మ అప్పుడే నూరిన మామిడి పచ్చడి వేడి వేడి అన్నంలో కలిపి తెచ్చి ముందు పెట్టింది.అది నాకు ఎంత ఇష్టమంటే ఆరు గంటల నా ఉపవాసం అర నిమిషంలో కంచికి చేరింది.రెండో ముద్ద నొట్లో పెట్టుకుంటూ అనుమానంతో క్రిష్నా వైపు చూశాను.నానమ్మకి చెప్పనులే అనడంతో రెండు నిమిషల్లో రెండవ పంతికి రేడి అయ్యాను.
ఆ రాత్రి రక రకాల మాయ మాటలుతో ,అన్నం తినిపివ్వాలని ఎంతో ప్రయత్నించి విఫలమై ,మొండోడు అని వదిలేశారు తాతయ్య ,నానమ్మ.
నిరాహారదీక్ష రెండవ రోజు కూడ కొనసాగించాలని నిర్నయించు కోవడంతో నిద్ర లెయ్యగానే పక్కనే వున్న సుబ్బవ్వ వాల్ల మేడ పైకి దుంకాను.వేడి వేడి దోశలు తరువాత నాకు ఎంతో ఇష్టమయిన అత్తమ్మ చేతి కాఫీ.తరువాత రోజూలనే స్నేహితులతో ఆటలు.ఈ విషయాలన్నీ తెలియని నానమ్మ కంగారు పడుతూ తాతయ్యకి కబురు పెట్టింది.జాలితో కూడిన కోపంలో వున్న నానమ్మకి దొరకకుండా మేడపైకి పరుగులు తీసి అంచున కూర్చొని పొలాలలో కొబ్బరి చెట్లు పక్షులని చూస్తూ అక్కడే వుండి పొయ్యాను.
నాలుగు అవుతూండగానె గాలిలో మట్టి వాసన ,ఇంకాసేపటకి వర్షం.వర్షంలో తడుస్తూనే కప్పల అరుపులో కూడా చిలుక పలుకులు వింటూంటే తాతయ్య పిలుపు వినిపించింది.నన్ను ఎత్తుకుని కిందకి తీసుకు వెల్తే నానమ్మకి ఏడుపు ఒక్కటే తక్కువ.క్రిష్నా రేపు ఉదయం తీసుకు వెల్లి చిలుక కొనిస్తాడు అని చెప్పి ,నానమ్మ గోరు ముద్దలు పెడుతూంటే ,చిలుకని ఎక్కడ పెట్టాలి ఎం ఎం మాటలు నేర్పాలి అనే ఆలోచనలో పడ్డాను.
క్రిష్నా సైకిల్లో ఊరిలోకి వెల్తుంటే దారిపొడవునా పలకరింపులు.వచ్చి రెండు రోజులయ్యింది కనపడలేదే అనె వాల్లు ఎవరో గుర్తు తెచ్చుకునే లోపే రహీం గారి ఇంటికి చేరాం.ఈ చుట్టు పక్కల ఎక్కడా చిలుకలు అమ్మరు పావురలు కావలంటే వున్నాయి.ఇంతలో ఒక తెల్ల పావురం పక్కనె వున్న గూటిలోంచి బయటకి వచ్చి నా వైపు దొంగ చూపు చూసింది.వెంటనే క్రిష్నాతో రెండు తెల్ల పావురాలు కావాలి అన్నాను.వాటిని అట్ట పెట్టెలో నెల్లూరుకి బస్సులో తీసుకు వెల్లడం మరో పెద్ద విన్యాసం.అమ్మకి షాక్ నాన్నకి అలువాటే..
రిక్షా లో స్నేహితులకి చూపిస్తూ ,ఆడుకుంటూ స్కూలు దగ్గర అందరికి చూపించి గాలి లోకి విసిరేస్తే స్కూలు చుట్టూ రెండు చక్కర్లు వేసి మేము ఇంటికి వచ్చే సమయానికి ఎదురు వచ్చేవి....