నా పేరు బన్నీ,నేను ఎనిమిదో తరగతి చదవట్లేదు ,చదివిస్తున్నారు.నా కోసం ఏ దేశం పోలీసులు వెతకటం లేదు ,అయినా నెనే డాన్.
మొత్తం మూడు ఫ్లోర్లు ,ఫ్లోరుకు ఆరు ఫ్లాట్లు ,పిల్ల పెద్దలతో హాయిగా వుంటుంది మా అపార్టుమెంటు.సన్ని గాడి ఇంట్లో తీవి డిన్ను గాడితో WWF.చింటూ వాల్ల ఇంట్లో వీడియో గేంస్ ,సాయి బొమ్మలతో టాయ్ స్టోరీ, ఇలా ఆట అయినా పాటం అయినా అందరికీ ఒకే ఒక సమయం వుండేది.అవినాష్ అంటూ పిలుపు వినపడడమే ఆలస్యం అందరి అమ్మలూ అటెండెన్సులా వరుసగా పిలిచేస్తారు.అలా అని గమ్మునే వుంటే యాబ్సెంటు వేస్తే బానే వుండేది .లేటు చేస్తే వాల్లు ప్రెసెంటు అవుతారు.
తల తలా మెరిసే ఆ సిమెంటు రంగు ఫియట్ కారుకు టెన్నిసు బంతి తగిలినా చిన్న పిల్లవాడి గావు కేకతో బయటకు వచ్చేస్తారు అపార్ట్మెంట్ బోర్డు ప్రెసిడెంటు నారాయన రెడ్డి.ఆయన కళ్ళదాలు లానే ఆయన కూడ మందంగా వుండేవారు.అంతగా ఆరాదించే ఆ కారు ఎప్పుడు బయటకు తీస్తారా అని వీది వీదంతా ఎదురు చూసేది.అందరినీ నిరాశ పరుస్తూ సిమ్హపురికే మొదటిది అయిన మోపెడ్ లో ముందర ఆయన,వెనక గతుకులొస్తే పడిపోతాడెమో అని కోతి పిల్ల తల్లి కడుపుకు అతుకున్నట్టు పనబ్బాయ్ మల్లి గాడు.ఆయన గురించి వెంకటేషు వో అహ నా పెళ్ళంట సినెమా కధే వల్లించాడు.
వెంకటేషుకు రోజూ అందరితో పాటు మిర్చి బజ్జీలు,బోండాలు తినిపించే వాడిని.విస్వాసం ఎక్కువైనప్పుడు వచ్చిన ప్రేమ లేకలు మతో పంచుకొనే వాడు.తనకు వచ్చినవి ఐతే గ్రామరు గ్లామరు ఏముంది ?. అవి 214 లో స్వేతకు వచ్చినవి.వాచ్ మన్ వెంకి వో మంచి స్నేహితుడు.
లిఫ్టుకు రెండు తలుపులు వుండేవి ,ఒకటి లిఫ్టుది ఒకటి ఫ్లోరుది.మొదటి ఫ్లోరు తలుపు కాస్తా లూజు .నాకు అదంటే ఎంతో మోజు. ఎవడయినా ఆటలో ఎక్కువ చేస్తే వాడు ఇంతికి వెల్లేపుడు ఆ తలుపు కాస్త లాగడమే.లిఫ్టు రెండు ఫ్లోర్ల మద్య ఆగి పొయీ కై మని తల చిట్లించే సెబ్దం చెయ్యడం మొదలెడుతుంది.అప్పుడు వాడితో ఆట ఎలా ఆడలో ఆడ కూడదో సరదాగా చెర్చిస్తాం.
ఎప్పుడు మా వీదిలో కనపడని నా క్లాస్ మేట్ అషోక్ గాడు కరెంటు పోయినప్పుడు మటుకు తప్పకుండా హిరో రేంజెర్ లో దూసుకు వచ్చేస్తాడు.కరెంటు పోయి నప్పుడు దాక్కునే ఆటలో మజానే వేరు.అయినా వాడు వచ్చేది ఆట కోసం కాదు ఆషా కోసం.నవ్వితే పల్లు తెరిస్తే కల్లు తప్ప అషోక్ గాడి మొహం అసలు కనిపించేది కాదు ఆ చీకట్లో.అంకుదే ఎమో ప్రేమ గుడ్డిదన్నారు.అయినా నేను చెయ్యలేని పని వాడు చేస్తున్నాడని ఎప్పుడు ఎమి అనే వాడిని కాదు.దానికి తోడు వాడు బాగ చదివే వాడు.అంతకు మించి ఎమి గునం వుండాలి మంచి స్నేహితుడుకి?
ప్రతి పుట్టిన రోజు వో పండుగలా జరుపుకుంటాం.దీపావలికి పండుగకు నెల ముందరి నుంచే వీది వీదంతా దద్దరిల్లుతుంది.ఒకటా రెండా ఇరవై రెండు ఫ్లాట్ల టపాకాయలు.అక్కడితో ఆగకుండా సన్ని గాడు మిగిలిపోయిన,కాలిపోయిన టపాకాయల నల్ల మందు అంతా తీసి వో కుప్పలా తయారు చేసేడు.అలా వూరుకుంటే వాడు స్మార్ట్ బాయ్ సన్ని ఎల అవుతాడు ? అందుకే మంటెట్టాడు.సింహపురి లో ఇంతక ముందు ఏ టపాకాయ పేలినప్పుడు రానటువంతి పెద్ద సెబ్దం.వాడికి ఏమీ అవ్వలేదు కాని పక్కనే వున్న మల్లి గాడి ఫుసులు ఎగిరాయి.పాపం నరాయన రెడ్డి గారు రెండు నెలలు మోపెడ్ తియ్యలేదు.
మా అపార్టుమెంటుకి ఎదురుగ్గా చిరంజీవి అపార్టుమెంటు.క్రికెట్టు అయినా క్యారంస్ అయినా అపార్టుమెంట్ల మద్య జరిగే పోరు వో అండర్ 14 వరల్డు కప్పులా ప్రతిస్టాత్మకంగా వుంటుంది.