మల్లి పూలు,మామిడి పండ్లు అమ్మేవారు,పోలీసుల నుంచి ముస్టి వాల్ల వరకు అందరూ అక్కడికే చేరుకున్నారు. మద్రాసు బస్టాండు ఆనుకొని వున్న ఎత్తయిన టెలిఫోను టవరు పక్కనే ఎక్జిబిషన్ గ్రౌండులో ఏటా వో సారి ఏర్పాటు చేసే ఎక్జిబిషన్ చుట్టూ పక్కల వూర్ల అన్నింటి నుంచీ వచ్చిన జనాలతో హడా విడిగా వుంది.పల్లెటూర్ల నుంచి వచ్చిన వారికి అది వో తిర్నాల లాగే. అలా యల్లాయపాళెం నుంచి వచ్చిన వారిలో అమాయకంగా కనిపించే ఆ ఇద్దరు రమ ,శాంతి.బర్తల్ని ఫస్టు షో సినిమాకి పంపేసి, ఇద్దరూ ఇద్దరు పిల్లలని వేసుకొని అరగంట బస్సు ప్రయానం తో అక్కడికి సాయంత్రం ఏడు గంటలకి చేరుకున్నారు. ఎంట్రీ టికెట్టు కొని రాక్షస బల్లి నొరులా చెక్కలతో కట్టి వున్న ద్వారం లోంచి లొపలకి వెల్లారు.రక రకాల వంటకాల గుబాలింపులు ఆహ్వానం పలికాయి.చుట్టూ బొమ్మలు,సామాన్ల దుకానాలు.వాటి మద్యలో రక రకాల తిను బండారాలమ్మే దుకానాలు. వంటింటి సామన్లమ్మే దుకానం లో కోసి పడేసిన కూరగాయలు కుల్లిన కంపు. శాంతికి భయం భయం అంటున్నా రమ బలవంతంగా జైంటు వీలు ఎక్కించడంతో రంగుల రాట్రం ఆగినా శాంతి తల తిరగడం ఆగటానికి ముప్పవు గంట పట్టింది. పెద్ద అప్పడం ,పావుబాజీ ,మిరపకాయ...
Comments