Friday, August 29, 2008

ATA:-అమెరికన్ తెలుగు అస్సోసియేషన్

Visit my new portal bharaththippireddy.net


ఆనందంతో
ప్రవాసాంధ్రులు కలసిన వేలా...

సంతోషంలో సాంప్రదాయలు ఆటా-డిన మేల....

తూర్పు పడమరా కలసి వేసిన ఈల:)




జులై 4న 2008, అమెరికా అంతా ఇండిపెండెన్స్ డే సంబరాలలో బిజీ గా ఉంటే మన వాల్లంతా న్యు-జెర్సి చేరుకున్నారు.ఎక్కడ చూసిన ఒకె పోస్టర్ ఆటా. నోట విన్న అదె మాట ఆటా:)


ఆటా:-అమెరికన్ తెలుగు అస్సోసియేషన్ ,మన తెలుగు వాల్లని కలుసుకోవడానికి,పరిచయాలు పెంచ్చుకోవటానికి ఇది మంచి అవకాశం.కాకపొతే ఇది పదవ ఆటా మహా సభలు అవ్వడంతో గ్రాండ్ గా చెయ్యాలని భారి ఎత్తున నెవార్క్లోని ప్రూడెన్షియల్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు.టికెట్ కూడ అంతే గ్రాండ్ గా రెండు వందల డాలర్లు వున్నపటికీ ,పదివేల మంది అప్పటికే కొనేశారంటే ,అది రొజు రొజుకి ఇక్కడ పెరిగిపొతున్న మన జనాబా సంఖ్యకి చిన్ని ఉదాహరన మాత్రమే.


ఆటాకి వెల్లాలని డ్యన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వాలని ముందే అనుకున్నా, వ్రుత్తిరిత్య ఇద్దరం బిజిగా వుండటంతో కాస్త అలొచనలో పడ్డాము.పెర్ఫాం చెయ్యకుండా అంత కర్చుపెట్టి వెల్లడం అవసరమా అనుకుంటుండగానే, ప్రతి వారంలానె లిటిల్ రాక్ పెదమ్మ దగ్గర నుండి ఫొన్ వచ్చింది.కుశల ప్రశ్నలు అవ్వగనే పెదమ్మ ఆటా గురించి మట్లాడుతూ ,మీరు వస్తారా అని అడగడంతో,మా ఆలొచన కాస్తా నిర్నయం వైపు కదలడం మొదలయింది.ఇంతలోనె పెదమ్మ, మా దగ్గర నాలుగు ఎంట్రి పాస్లు వున్నాయి ,మీరు కొనొద్దు అంటే ,అదెలా అని అడగాలనిపిచ్చింది.మెము ప్రతి సంవత్సరం ఆటాకి $$లు డొనేట్ చెస్తాము,సో వాల్లు ఫ్యామిలికంతా ఫ్రీగా ఎంట్రి పాస్లు అండ్ హోటెల్ రూములు ఇస్తారు అని పెదమ్మ అనడంతో ఒక్కసారి మేమిద్దరం యురెకా అనుకోని ప్యాకింగ్ ప్రారంబించాము.సో నా కసిన్స్ వంశీ అండ్ రాహుల్ స్తానాలలో నెను,చోటి అన్నమాట.



అక్కడ వారం క్రితం అమెరికా చేరుకున్న నరెంద్ర తన మొదటి పబ్లిక్ మీటింగ్ ఆటాతొనే మొదలవ్వాలని డిసైడ్ అయ్యాడు:).దానితో వాడికికూడ 'నీకు ఫ్రీ నీకు ఫ్రీ' టికెట్ దొరకతదెమో అనె ఫీలింగ్ .పెదమ్మ వాలు లేటుగా ల్యండ్ అవుతారని తెలిసి మా ఎంట్రి పాస్లు ఆటా బోర్ద్ మెంబర్స్ అయిన అరునాంటీ దగ్గర తీసుకోమని చెప్పారు.అరునాంటీతో మాట్లాదుతూ నరెంద్రాకి కూడ టికెట్ సంపాదించాము.



ఆటా కి వెల్లాలని ఆఫిస్ నుంచి త్వరగా బయలుదేరాము.లాంగ్ వీకెండ్ అవ్వడంతో మాతోపాటు చాల మందే బయలుదెరారనుకోండి ఇంటికి.దారిలో నరెన్ని పిక్ చేసుకోని, నంబర్ 12 పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసి లొపలికి వెల్లగానే,అమెరికలో వుండే తెలుగు వారంతా ఇక్కడె వున్నారేమో అనేలా కోలాహలం.


మూడు రోజుల కార్యక్రమం బ్యాంక్వెట్ డిన్నర్ అండ్ శివమణి గారి గానా బజానాతో మొదలైయింది.ఆయన సూట్కేస్ నుంచి డ్రంస్ వరకూ దేన్ని ముట్టుకున్నా సంగీతమే.ఓ గంట సేపు అందరం తన్మయంలో మునిగి డిన్నర్ టైంకి లేసాము.ఇదె ఇల వుంటే ఇక రెహ్మన్ గారి షొ ఎల వుంటుందో అనుకుంటూ డిన్నర్ మొదలెట్టాము.హాల్కి మద్యలో ఎర్పాటు చేసిన టేబుల్స్ చుట్టు కాసెపు నిలుచుంటే మాకు చాన్స్ వచ్చింది:).చూస్తేనే కడుపు ఫుల్ అయ్యిపొయెట్టు వున్న ఐటెంస్ని బాగ కుమ్మాము.మా నరెన్ గాడు మూడు రోజులు ఇలానె పెదుతారెంట్రా అని అడుగుతూ,కొంచం బ్యాక్-అప్ కూడ తెచుకున్నాడు ,అంటే ఐస్క్రీంస్ అలాంటివి లేండి.నైట్ కెనడా నుంచి వచ్చిన్న ఫ్యంటాస్టిక్ ఫోర్ టీం డ్యాన్స్ మామ్మల్ని ఎంతో ఆకట్టుకుంది.




రెండవ రోజు..




స్టేడియం చుట్టూ వున్న స్టాల్స్ చుట్టూ తిరుగుతూ ప్రారంబించాం మా రొజుని.హైదరాబాదు నుండి వచ్చిన కీర్తిలాల్స్ జివిలర్స్ నుంచి మంత్ర రియల్ ఎస్టేట్స్ వరకు చూసి ఎంటర్డ్ దా డ్రాగన్/హాల్.చిన్నారుల న్రుత్యాలతో మొదలయిన కార్యక్రమాలు,కోటా గారు తమషాగా చెప్పిన తెలంగాణ రామయనంతో ఊపందుకున్నాయి.పక్కనే వున్న హిల్టన్ హోటెల్లో తెలుగు సినెమాలకి , సంగితానికి సంభందించిన చిన్న సైజ్ చర్చలు జరుగుతున్నాయ్ అని తెలియడంతో లంచ్ అవ్వగానే అటు వైపుకి బయలుదేరాము.ఇంతమంది భారతియులని ఒకేసారి రోడ్లపై చూడడంతో ఏరీలోని అమెరికన్స్ అంతా UFO/ఏలియన్స్ చూసినట్టు చూస్తూవుండగా పది నిమిషాలు నడిచి ,హిల్టన్ హొటల్ చెరుకున్నాము.

కాంఫరన్స్ హాల్ దగ్గర పడగానె అక్కడ వున్న ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగిపోయాడు.ఇప్పుడే కదరా తిన్నావ్ అని మెము వెనక్కి వెల్లగానే ఫూడ్ కొర్టులో అల్లు అర్జున్.ఇంకెముంది వెల్లడం ఫొటోలు దిగడమే కాకుండా మాటలు మట్లాడాము...


హాయ్ అర్జున్ ,can we take a picture with you?
యా స్యూర్,అనగానే ఫ్లాష్లు మొదలు...

సొ ఎల వుంది మీకు ఇ ప్లేస్...
బాగుందిi am having a great time.

Dint see you guyz on the cruise yesterday?
మెము శివమణి గారి పెర్ఫామెన్స్ చూడాలని ఆగిపోయాము

Nice to meet you arjun..

Pleasure to meet you all,అనడంతో టాట చెప్పేసి, తన శాండ్విచ్ తినె అవకాసెం ఇచ్చి మెము గొల్లపూడి గారి ఆద్వర్యంలోజరుగుతున్న కవితలు/కధా రచయితల సమావెసంలో దూరాము.

డైరక్టర్లు హీరోలకి ఇలానె చెప్తారేమొ అనిపించెలా కమలా గారు చెప్పిన చిన్ని కధలు విన్నాము.దాక్టర్లకి డబ్బులు ఎక్కువైతే యాక్టర్లు ,ప్రొడ్యుసర్లు అవుతుంటారు. ద్రొవలో పయనిస్తున్న హరనాథ్ పోలిచర్ల గారు మా దారిలో కనిపించడంతో కాసెపు మాట్లాడాము.ఆయనలో వున్న తపన,పట్టుదల మాకు కనిపించాయి.చోటి వాల్ల పెదమ్మవాల్లతో,మా పెదమ్మ వాల్లతో కలసి డిన్నర్ చేసి అరోజుకి గూటికి/హోటల్ చేరుకున్నము.

మూడవ రోజు..

ఆటాకె హైలైట్ అయిన డ్యాన్స్ పెర్ఫర్మన్స్ హిట్చ్కాక్ గారి డ్యాన్స్ బ్రుందం వారు ఇచ్చారు.తెలుగు పాటలకి అమెరికన్ డ్యాన్స్తో పాటు మంచి క్రియేటివిటి తోడవడంతో ...మీరే చూడండి....

కలా తప్పస్వి కె.విస్వనాద్ గారిని సన్మానించడానికి స్టేజి పైకి అహ్వానించారు.విస్వనాద్ గారు మైక్ పట్టుకోని మట్లాడబోతుండగానె వెనక నుంచి న్రుత్య బ్రుందం శంకరాభరణంలో పాటకి నాట్యం చేస్తూ ముందుకొచ్చారు.వాల్లలో ముందు వున్నది ఎవరో తెలుసా , మంజు భార్ఘవి గారు.శంకరబరనంలో చెసిన తర్వత పాటకి న్రుత్యం చేయటం ఇదె మొదటి సారి అని చెప్పారు. తర్వత విస్వనాద్ గారు మట్లాడుతూ మన దేశంలో అంతరించిపొతున్న కలలు ఇక్కడ పునర్జన్మిస్తున్నాయని అన్నారు. స్పీచ్తో ఇన్స్పైర్ అయిన సినీ తారలు రాజ,వేను,అల్లు అర్జున్ తమ ప్రసంగాలు మరియు డ్యాన్స్ తో మమ్మల్ని అలరించారు.


అప్పుడే వచ్చి మా పక్కనే కూర్చొని వున్న ఫ్యామిలిలోంచి ఒహ్ అమ్మాయి చోటీని అల్లు అర్జున్ డ్యాన్స్ అయిందా అని అడిగింది.విషయం ఎమిటంటే చి-న్నారి పెరు మీతు ,అల్లు అర్జున్ కి వీరాభిమాని .చికాగో నుంచి అర్జుని కలవడానికె ఫ్యమిలిని తీసుకొచ్చేసింది.కసెపు వాల్లతో మాట్లాడుతూ , వాల్లకి కూడ డాన్స్ అంటే ఇస్టమనీ,తరచు పెర్ఫామెన్స్లు ఇస్తుంటారని తెలుసుకున్నాం. నెక్స్ట్ దెవిశ్రి ప్రోగ్రామని జనాలలో కొత్త ఉత్సాహం.లైట్స్ ఆఫ్ అవ్వగానే , దెవిశ్రి ' సరీ గమా పద నిస్సా' అంటూ ముందరికి వచ్చారు. వివిద సినిమా పాటలతో జల్సా చెయించేరు.జనల మద్యలోకి వచ్చి పాడుతూ అందరినీ అలరించారు.బాగ గలబా చేస్తూ సీట్ల దగ్గరే మా టాల్-ఎంట్ చూపించాము.


ఫైనల్గా బందువులతో,కొత్త స్నేహితులతో ఫొటోలు తీసుకున్నాము.ఆటా అయింది ఇక తందాన TANA 2009 అంటూ ఇంటికి పయనం అయ్యాము.



నాని

Visit my new portal bharaththippireddy.net