Blessed by the absolute,Inspired by my family and Influenced by my teachers-While I explore and learn more in the career development, personal development and self consciousness spaces I will try to creatively express my thoughts,work and experiences through my blog, videos etc to help others while helping myself.
Sunday, August 17, 2008
తిరుమల బై వాక్, ఏడు కొండలు = నాలుగు గంటలు + మూడు ఫ్యామిలీలు
Visit my new portal bharaththippireddy.net
బస్సులో వెల్తే శ్రినివాస
కారులో వెల్తే వేంకటేశా
నడిచి వెల్తే గొవింద గోవిందా....
పరిక్షలు రాయడం,వేసవి సెలవులు రావడంతో పాటు ప్రతి సంవత్సరం ఫ్యామిలిలు ఫ్యామిలిలుగా బయలుదేరి తిరుమలకి వెల్లడం మాకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితి.గోవిందుని దర్శనం మాకు సంవత్సరానికి ఒక్కసారి మ్యాండేటరి అండ్ మా చిన్నమామకైతే క్వాటర్లి ఓసారి కంపల్సరీ.అందుకే ఆయన ఎక్కువగా గుండులొనే దర్శనం ఇస్తుంటారు.కాని 1994 లొ ట్రెండ్ మారి క్రిస్టమస్ సెలవులకే బయలుదెరాము తిరుమలకి.హైదరాబాదు నుంచి పెద్ద-అత్తమ అండ్ ఫ్యామిలి మరియు నెల్లూరు నుంచి మెము అండ్ చిన్న అత్తమ ఫ్యామిలీలు పొద్దునే అయిదు గంటలకి సూర్యుడితో పాటు కార్లలొ బయలుదెరాము.పిల్లలు అందరం ఒకె కార్ ఎక్కాలని డిసైడ్ అవ్వడం/ఎడ్వడం తో అందరిని మా అంబాస్సడర్ లొ కుక్కారు.ఆ కార్కి మా నాన్నగారు డ్రైవర్ కావడంతో ఇక మా అల్లరికి బౌండరీలు లేకుండా పొయింది.
శ్రికాళహస్తి దగ్గర కార్ నంబర్ 1 పిట్-స్టాప్ తీసుకోగానె,కార్ నంబర్ 2 లొ చీరలు-నగలు దిస్కషన్ కి బ్రేక్ పడింది.కార్ నంబర్ 3 లొ గాడ నిద్రలో వున్న పెద్దమామయ్య అండ్ బావ మసాల దోశ అండ్ సాంబార్ గుమ గుమలకి కలలకు బ్రేక్ ఇవ్వడంతో అందరం నాయుడి హొటల్ లోకి వెల్లి బాగ తిని,మల్లి 7 హిల్ల్స్ ట్రాక్లోకి ప్రవేసించాము.మామయ్య కొనిచ్చిన చాక్లేట్స్ తింటుండగానె చుట్టు అంద్దమయిన సన్ ఫ్లవర్ ఫీల్డ్స్.సూర్యుడిని అవి ఫాలో అవుతుంటే మెము వాటిని ఫాల్లో అవుతూ వుండిపొయాము.ఇంతలో తిరుపతి అంతలో అలిపిరి వచ్చెసింది.
ఇ తిరుమల ట్రిప్ కి మునుపటి ట్రిప్లకి తేడా ఎమన్న వుంటే అది ఎప్పటికీ మరచిపోలేని కాలి నడకె.వాతవరనం చల్లగా వుండడంతో మమ్మల్ని మెట్ల దగ్గర వదిలి అమ్మ కార్లో బయలుదేరారు.
పదకొండు కిలోమీటర్ల భక్తి-ముక్తి మ్యారతాన్ని గొవిందా గోవిందా అంటూ ప్రారంభించాము.పది మెట్లు ఎక్కెమో లేదొ ఇటు పది మంది అటు పది మంది ముందు పది పైసల్ల గుట్టలు పెట్టుకోని కూర్చొని వున్నారు.బిచ్చగాల్లు అనుకొనె లోపె వాల్లకి పది రూపయల నోట్ ఇచ్చి తొమ్మిది రూపయల చిల్లర తీసుకున్నారు మామయ్య.రుపయికి పది పైసలు వాల్ల కమిషన్ అంట.మెట్టు మెట్టుకి హారతి ఇస్తు నామాలు పెడుతు, ముందు నుంచి మా ఇద్దరు అత్తలు ప్రతి మెట్టుకి మాకు వెల్కం చెప్తువుంటే,మా బావ చెప్పిన్న రకరకాల ట్రిక్స్ ఫాలో అవుతూ చక చకా మెట్లు ఎక్కాము.అప్పటి వరకూ ఇంకెంత దూరం అనుకుంటూ వెనకబడి వస్తున్న తమ్ముడు ఒక్కసారిగా పరిగెట్టటం మొదలెట్టాడు.నెక్స్ట్ ఫ్రేములో ఒక చేతిలొ ఉప్పు-కారం చల్లిన అంటు మామిడికాయ పీస్ ,ఇంకొ చేతిలొ బొరుగుల మసాల పొట్లంతో కనిపించాడు.ఇవన్ని తింటూ వెల్తుంటే దారి పొడవునా రకరకాల తినుబండారాలు(ఐస్ క్రీంస్,చాక్లేట్లు) అమ్మే అంగడులు దర్సనమిచ్చాయి , మా అందరి కరుణ పొందాయి.ఎక్కిన మెట్ల సంఖ్య పెరిగే కొద్ది కింద తిరుపతిలోని ఇల్లు చిన్నవయ్, బొమ్మరిల్లులాకనిపించ్చాయి.పుణ్యక్షేత్రము అయినంతమాత్రాన పార్ట్-టైం దొంగలు లేకపోలెరు.అందుకె అక్కడక్కడా సెకురిటీ గార్డులు కనిపించారు.
కాస్తా దూరం వెల్లగానే పక్కనె అందమయిన పెద్ద పార్క్ కనబడటంతో ఫొటొలు దిగటం ప్రారంబం.ఇంతలో ఒ పెద్ద ధుప్పు,జింకకి కసిన్ సిస్టర్ మా తమ్ముడి కంట పడడంతో, వాటికి అరటి పండులు కొనిఫెట్టి బదులుగా మెము కొన్ని ఫొటోలు తీసుకున్నాం.అది ఇంకా కొడాక్ కెమరా అండ్ ఫిల్మ్ కాలం కావడంతొ ఫొటోల విషయం లొ కాస్త ముందుచూపు వుండెది.మోకాల్ల పర్వతం దగ్గర పదుతుండగానె ఒ చిన్న బ్రేక్ తీసుకున్నం.అక్కడ ఒ అంగడి పక్కనె జనం వాల్ల దగ్గర మంచి స్నాక్స్ వుండటంతో అక్కడకి ఒ చిన్న సైజ్ వానర సైన్యం వచ్చిపండింది.అవి బాల్కని క్లాస్ కి చెందినవి అవ్వటంతొ,చిప్స్ నుంచి చాక్లేట్లు వరకు,మినిరల్ వాటర్ నుంచి మెరిండ వరకు అన్ని లాక్కొని పోతున్నయి.ఒక కోతి వచ్చి మా మమయ్య కాలు పట్టుకోని అయన చేతిలో వున్న చిప్స్ ప్యకేట్లో షేర్ అడిగింది.ఆయన ఇవ్వకపొవడంతో అది సీరియస్ గా చూసింది.కాని ఆయన సిలా విగ్రహంలా అలానే వుండడంతో దానికి మండి ,జై హనుమాన్ అన్నీ అయన చంప పైన ఒక్కటి పీకి చిప్స్ ప్యాకెట్తో మాయమైయింది.అత్తమ్మ మావయ్య వైపు నవ్వాలా వద్ద అన్నట్టు చూస్తూ వుంటె ,మామటుకు మేము కొన్ని డొనేషన్స్ చేసుకుంటూ ముందుకి సాగిపోయాం.
కాసెపు మెట్లు పోయి రోడ్ వచ్చింది.అందరికి బాగా దాహం వేస్తొంది, అంగడులేమి లేవు అనుకుంటూండగా,మహిమో మాయో వొ అయిదుగురు పసుపు రంగు డ్రసుల్లో అందరికి నీళ్ళు,మజ్జిగ సప్లయ్ చెస్తున్నారు.ఒక్కసారిగా సముద్రం దాటుతున్న హనుమ అంత పవర్ వచ్చింది.దారిపొడవునా మంచ్చు వుండటంతో రోడ్ అసలు కనిపించటం లేదు.ఇంతలో బావ అన్నాడు అది మంచ్చు కాదు మబ్బులు అని.నిర్దారించుకోవడానికి ఒక్కసారి లొయలోకి చుస్తే బడి వదిలేస్తే పిల్లలు వెల్లినట్లుగా వెల్తున్నాయి మబ్బులు.ఆ ద్రుస్యాన్ని తిలకిస్తూ మిగిలిన కాస్త మెట్లు ఎక్కెయగానె చుట్టూ కొన్ని పురాతన సిల్పాలు . నాన్నగారి నోట వచ్చేశాం అనె మాట వినగానె అందరం తిరుమల గాలి పీల్చుకున్నాం!!!.
విచిత్రం ఏమిటంటే కాలి నడకన మెము కార్లొ వచ్చిన అమ్మ, అందరం ఇంచు మించు ఒకే సమయానికి చేరుకున్నాం.దీనికి కారనం మెము రోడ్డుపై నడుస్తూ వుండగా మమ్మల్ని పలకరించ్చిన మేఘాలె:).
ఇంక తిరుమల గురించి వెరె చెప్పాల, అన్నమయ్య ఎప్పుడో చెప్పారు!!
నాని
Visit my new portal bharaththippireddy.net
Labels:
తెలుగులో