Tuesday, July 12, 2011

సింహపురి కధలు:అమ్మ మాట - కోట గోడ

Visit my new portal bharaththippireddy.net

ఇ మూడంతస్తుల మేడ వుంది చూసారు ,అది మహేస్వర రావు గారిది .నాకు వూహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే కింద వాటాలో అద్దెకు వుంటున్నాము.పక్కనే ఆనుకొని వున్న రెండు అంతస్తుల భవనము ఆయన తమ్ముడు చంద్ర సేకర్ రావు గారిది.దానికి అవతల సింహపురి గ్యాస్ కంపెనీ.ఇంటికి ఇటు వైపు కారు-లారి డ్రైవింగు స్కూలు.ఇంటి బయట రక రకాల పూల చెట్లతో పాటు ఇద్దో ఈ జామ చెట్టు.జామ కాయలు కోయడంలో మాతో ఎవరన్నా పోటి పడగలరంటే అది  సాయంత్రం వచ్చే కోతి మూకే.జామ చెట్టు కొమ్మలు అంత తేలికగా విరగవు అని అమ్మ చెప్పింది.అందుకే కాస్త కూడ జంక కుండా ఇలా కొమ్మ అంచున నిలుచుంటాం.


మా ఆటలంతా గొడల పైనా,రేకు షెడ్డుల పైనా,డ్రైవింగు స్కూలు లోని మామిడి చెట్ల పైనా.సందుకి ఒక చివరి నుంచి మరో చివరకు నేల పై కాలు పెట్టకుండా వెల్లి పోతాము.కాని దాసాని పూల చెట్లకు ఆనుకొని వున్న  ఎత్తయిన కొట గోడ జోలికి మటుకు ఎప్పుడు వెల్ల లేదు.గోడ అవతలి కోట మా మేడ పై నుంచి కనపడేది .తోకలు,చెవ్వులు కత్తిరించిన డాబర్మ్యాన్ కుక్కలు ,పని వాల్లు తప్ప ఇంట్లో వారు ఎవరూ కనుబడరు.ఎప్పుడన్నా ఆటల్లో బంతి అటు వైపు పడితే మేడ పైకి వెల్లి పని వాల్లని కేక వేసే వాల్లమే కాని గోడ ఎక్కే ధైర్యం చెయ్యలేదు.ఆ గోడ వో సారి గోపీ ఎక్కాడని చరన్ చెప్తే నేను నమ్మలేదు.చరన్ మహేస్వర రావు గారి మనవడు.


ఏ గోడ అయినా క్షణాలలో ఎక్కటం గోపి గాడికి ఇడ్లీ తో పెట్టిన విద్య.డ్రైవింగు స్కూలు గోడకు ఆనుకొని ఆకాసాన్ని అంటుతున్న ఆ రెండు బూరగ చెట్లనూ గోపి తప్ప ఎవరూ ఎక్కలేదు ,ఎక్కలేరు.సంవస్తరానికి వోసారి వాడి చేత బూరగ కాయలు రాల గొట్టించి వాటితో పరుపులు ,దిండ్లు కుట్టిస్తారు.మూడు రోజుల నుంచి వాడు ఆడుకోవటానికి రాలేదు.వాల్ల నాన్న గారితో ఇల్లకి సున్నాలు వెయ్యడానికి వెల్లాడెమో అని వాసు అన్నాడు.


అందరం కలసి డీమిండాల్,దొంగా పోలీస్,కరెంటు షాకు తో పాటు నేను కనిపెట్టిన కమ్మాండో ఆట ఆడుతాం.దీనికి చెట్టుకొమ్మలతో,తర్మకోల్ తో తయారు చేసిన తుపాకిలు,బానాలు.టెంకాయి పిందెలు, పచ్చి జామకాయల,బూరగ కాయలు బాంబులు.


ఇ రోజు కూడ అలానే కొమ్మలు విరుస్తూ రేకుల షెడ్డు పై నిలుచుని దొరికిన పొడువాటి జామ కొమ్మ దోటి లా ఉపయొగిస్తూ బూరగ కాయలు కొడుతున్నను.జామ కొమ్మ బూరగ చెట్టు కొమ్మలో ఇరుకుంది.ఎంత లాగినా రావట్లేదు.ఇంతలో నా అయిన్స్టీన్ మెదడుకి వో తొంటరి ఆలోచన.స్పైడర్ మ్యాన్ లా షెడ్డు ఇటు నుంచి అటు వైపుకి ఆ జామ కొమ్మకు వ్రేలాడుతూ వెల్తే.వాసు చరన్ల వైపు చూసాను.వాల్లు తర్వాత నేను నేను అంటూ వచ్చి నా వెనక నిలబడి వూగు వూగు అంటూ ప్రోత్సహించారు.దానికి తోడు జామ చెట్టు కొమ్మ గురించి అమ్మ చెప్పిన మాటలు.చిన్నపటి నుంచి పెద్దల మాట చద్దనం మూట అన్న సామెత నాకు బాగ కలిసొచ్చిందనో ఎమో వూగాను.టార్జాన్ ల అటు వైపుకు చేరి గోడ పై నిలబడ్డాను.వాసు ,చరన్ మొహాలలో ఆత్రుత పెరిగింది .వెనక్కి వూగుదామని కాలు తో గోడను తన్నాను- నిటారుగా షెడ్డు పై కూలబడ్డాను ,నేను పడిన ప్రాంతం వరకే రేకు విరిగి దానితో పాటు ఏడు అడుగు లు గాల్లో వేసి నేల పై నిలుచున్నాను.ఉరుములా పెద్ద సెబ్దం చేస్తూ రేకు రెండు ముక్కలు అయింది.


రెండు ఇల్లలో పెద్ద వారందరూ పరుగెత్తి వచ్చారు.చేతిలో జామ చెట్టు కొమ్మ ,దానికి వేలాడుతున్న బూరగ కొమ్మతో నేను తీర్ద యాత్రకు బయలు దేరిన యోగి లా నిలబడ్డాను.అప్పటి వరకు ప్రోస్తహించిన వాసు మామిడి చెట్టులో,చరన్ షెడ్డులో దాకున్నారు.జరిగిన ఆస్తి నష్టం చూసిన పెద్దవాల్లు నాకు ఏమీ కాలేదని తెలిసి ఆనందించి ఎక్కువ తిట్ట లేదు.మోసం చేసింది జామ కొమ్మ కాదని బూరగ కొమ్మని తెలిసినా, చరిత్రలో ఇంతక ముందు ఎప్పుడూ లేని విదంగా పడటం నా పైన నాకే కోపం,అసహ్యం కలిగే లా చేసింది.అదే సంగటన మల్లి మల్లి గుర్తుకు వస్తోంది, రాత్రి పన్నెండు గంటలు అయినా నిద్ర పట్టట్లేదు.దానికి తోడు ఎప్పుడూ లేని విదంగా కోట లోని డాబర్మ్యాన్లు ఆగకుండా అరుస్తూనే వున్నాయి.


ఇంతలో దొంగ దొంగా అనే కోటేస్వర రావు అన్న అరుపులు వినబడ్డాయి.ఆ సమయం వరకూ డాబా పై కుర్చీ వేసుకొని చదువుకొనే చంద్ర సెకరు గారి అబ్బయి అయన వొక్కడే.నాన్నగారు లైట్లు వెయ్యగనే కోట గోడ పై రెండు నీడలు.అందరు బయటకు వచ్చే సరికి ఎవరు కనపడలేదు.పారి పొయ్యారు అనుకునే సమయానికి పొద్దున నేను పడినప్పుడు వచ్చినటువంటి పెద్ద సెబ్ధం.రేకుల షెడ్డు వైపు అందరు కర్రలు పట్టుకొని చిన్నగా వెల్ల్తూంటే అక్కడ వో కుర్రాడి ఆప్తనాదాలు.నాన్న గారు టార్చి లైటు  అటు వైపు తిప్పగానే అందరు ఆస్చర్య పోయాము.గోపి గాడు మా గోపి గాడు పక్కనే వాడి నాన్న,డబ్బు కట్టలు ,బంగారు నగలు చిరిగిన వో సంచి.


గోపి గాడు అలా చేసాడని మొదట బాధ వేసినా ,మూడు రోజుల నుంచి కోటకి సున్నం వేస్తూ ఎంతో కష్ట పడి వాల్లు వేసిన పధకానికి నా అయిన్స్టీన్ బుర్ర గొయ్యి తీసిందని తెలసి ఆనందం కలిగింది.హాయిగా నిద్రపొయ్యి పొద్దునే లేచి అదే ఉత్సాహంతో కోట గోడ ఎక్కి చరన్ ,వాసూల కోసం ఎదురు చూసాను.

Visit my new portal bharaththippireddy.net