Blessed by the absolute,Inspired by my family and Influenced by my teachers-While I explore and learn more in the career development, personal development and self consciousness spaces I will try to creatively express my thoughts,work and experiences through my blog, videos etc to help others while helping myself.
Oak Tree Road:The Mini India
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Moghul Express is for shrimp dosa and
Dakshin Express is for Biriyani
America runs on Dunkin and we walk
for masala chai:)
ఇక్కడకి వచ్చిన ప్రతి సారి డిజవు - ఇతహ్ పూర్వం ఎన్నో సార్లు వచ్చిన అనుభూతి ప్రతీ వారం ఇలయ రాజా నుంచి రెహ్మాన్ పాటలు వరకు వింటూ నైంటీ ఫైవ్ పైన యనబై మైల్ల స్పీడులో ఏ టోల్లుదగ్గరా ఆగకుండా కింగులా ఈజీ పాసులో లైన్లో దూసుకెల్లి పదకొండో ఏక్జిత్ తీసుకొంటే మా ఓక్ ట్రీ రోడ్డు.
Desi Galaxy
సాయి బాబా కే వేసి చూస్తూ వో వారనికి కావాల్సిన ప్రసాంతతతని జుర్రేసుకొని మరో వారనికి కావల్సిన గ్రొసరీలు కారు ట్రంకుకు ఎక్కించేసి ...
Shrimp or Keema Dosa with authentic
Sambar:)
A Nostalgia every weekend!
మొగల్ ఎక్ష్ప్రెస్స్ లో రొయ్యల దోసా ,దక్షిన్ ఎక్ష్ప్రెస్స్లో బిరియాని.అంటే ఒక్కో ట్రిప్ లో ఒక్కోటి:)
బిగ్ సినిమాస్ లో వో తెలుగు సినిమా ప్రీమియర్ చూసేసి,వేడి వేడి మిర్చీ బజ్జీ పాటు రిం జిం మసాలా చాయ్ తాగుతూ స్వర్నకమలం పాటలు వింటూ చందమామకు గూడ్మార్నింగ్ కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరుకుంటాం.
వీదంతా స్నేహితులే,ఊరంతా బందువులే ,కలసి ఆడిన ఆటలెన్నో... వేసవి కాలంలో ఈత కధలు ,వాన వస్తే తీపి జ్ఞాపకాలు.. ప్ల్యానిటోరియం అక్కర్లేదు,మేడ ఎక్కితే తారలన్నీ మావే... భందుత్వాలు తెలుసుకోవటానికి పెళ్ళిలకి వెల్లనక్కర్లేదు ,ఊరంతా వరుసలే.. కోట్ల ఆస్తులు అక్కర్లేదు ప్రతి రేయి హాయిగా నిద్ర పొతే చాలు.. మరో జన్మ అక్కర్లేదు నాకు ఇచ్చిన ఆనందాలన్ని తిరిగి నితో/నా వాల్లతో పంచుకోగలిగితే చాలు... రోడ్డుకి రెండు వైపుల పచ్చని పొంట పొలాలు ,అక్కడక్కడ రొయ్యల చెరువులు... బస్సు బుచ్చి రెడ్డి పాళెం లో ఆగగానే కిటికీలకి వున్న కమ్ములని పట్టుకోని ,టైరు పైన కాల్లు పెట్టి ఎక్కేస్తున్నారు జనాలు.సీటు కోసం కర్చీఫ్ వేసే వాల్లు కాదు.అరిటపండ్ల నుంచి జాంకాయలు దాక,సెనగపప్పుల నుంచి ఉప్పుసెనగలవరకు అమ్మేస్తుంటారు వాల్లు.. పొలం గట్టు పైన వరుసగా తాటి చెట్ల మద్యలోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు ,టెలిఫోన్ తీగలపైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న గువ్వలు.అంటే మరో అరగంటలో ఊరు చేరుకుంటాం. చెరువు కట్ట పైన వరుసగా మామిడి చెట్లు .చీకట్లో కనిపించక పోయిన ఎక్కడ ఏ చెట్టు వుందో ఏ పుట్ట వుందో నా మనసుకి తెలుసు,అందుకే అది...
లొకేషన్ :- ఫిల్లీ స్కీ రిసార్ట్ సమయం :- టీం ఫిల్లీ స్కీయింగ్కి బయలుదేరిన సమయం . మౌంట్ ఎవరెస్టు ఎక్కాలనుకున్న నాని మంచు కొండ ఎక్కిన వేల ... వారాంతం స్కీయింగ్కి వెల్లాలని టీం ఫిల్లీ డిసైడు అవ్వడంతో తగిన బందొబస్తు , కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు కార్యకర్తలు :). అంటే కింద పడినా ఫొటోలలో బాగా పడాలి కాబట్టి మంచి సన్ గ్లాస్లు , గ్లౌస్లు తదితర షాప్పింగ్ అన్నమాట . ఓ అరగంట డ్రైవ్ చేస్తే వచ్చేసింది ఫిల్లీ స్కీ రిసార్ట్ . కారులోంచి దిగగానే కాస్త దూరంలో మా వింజమూరి తిర్నాళ్ళలా వుంది కోలాహలం . చిన్నపుడు జగదేక వీరుడు అతిలోక సుందరీ సినిమాలో చూసిన కొండలంటి మంచు కొండ . కొండకి ఒక వైపు తీగలకి వేలడుతూ పైకీ కిందకి తిరుగుతున్న కుర్చీలలా కనిపించాయి . మరో వైపు ఇంకో చిన్న కొండ వుంది . దాని పైన చిన్న పిల్లలు ట్యుబులలో జారుతూ , కొందరయితే దొల్లుకుంటూ కిందకి వచ్చేస్తున్నారు :) లోపలకి వెల్లి కొన్ని $ లు చెల్లించి , ఎంట్రి పాస్లు తీసుకున్నము . పక్కన గదిలోకి వెల్లి పాస్లు చూపిస్తే ఒక జత బూట్లు , ఒక జత స్కీలు ...
సెట్టమ్మ పోసేది ఎర్రకారం దోశ... మురళి క్రిష్నాలో తెస్తే రవ్వ-మసాల దోశ.. హాస్టల్లో పెట్టారు నిదురబుచ్చే దోశ.. ఎడిసన్ చేరాక కీమా రొయ్యల దోశ... వీటన్నింటినీ మరపించేదే ఆదివారం అమ్మ చేతి దోశ.... స్కూలున్నపుడు అమ్మ విస్సుకోని నాన్న ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తే కాని నిద్ర లేయని మేము ,ఆదివారం నాన్న గారు చికెన్ తేవడానికి వెల్తున్నారు అనగానే ఇట్టే లేసి అట్టే రేడీ అయ్యిపొయేవాల్లం.అది 1982లో పెదనాన్న గారు నాన గారికి ఇచ్చిన బజాజ్ చేతక్ .పేరుకి చేతక్ అయిన మాకు మటుకు అది బజాజ్ పుష్పక్ .మనసుకి ఎక్కడికి వెల్లాలనిపిస్తే అక్కడికి సెరవేగంగా వెల్లిపొయేవాల్లం. తమ్ముడు హ్యాండిల్ పట్టుకుని ముందు నిలుచున్నాడు,వెనక సీట్ ఎక్కేసి నాన్న నడుము చుట్టూ చేతులు వేసి నేను రెడీ అయ్యాను.కిక్ కొట్టగానే మొదట పొగ వచ్చింది ,తరువాత డి.కె.మ కలాశాల ఇంకాస్త దూరం వెల్లగానే మా స్కూలు వచ్చాయి. సూర్య కిరణాలు తాకి ఆవిరవుతున్న మంచు చినుకులు గాలిలో తేమలా మొహానికి తగులుతూంటే మనసు ఆనందంతో నెండిపోయేది. ఇంకాస్తా దూరం పొదలకూరు రోడ్డు పై వెల్లగనే రోడ్డుకి కుడి వైపు భాషా భై చికెన్ షాప్.కేజి బ్రయిలర్ ...