Posts

Showing posts from November, 2008

మొదటి స్కీయింగ్:-జై చిరంజీవా,జగదేక వీరా:)

Image
లొకేషన్ :- ఫిల్లీ స్కీ రిసార్ట్ సమయం :- టీం ఫిల్లీ స్కీయింగ్కి బయలుదేరిన సమయం . మౌంట్ ఎవరెస్టు ఎక్కాలనుకున్న నాని మంచు కొండ ఎక్కిన వేల ... వారాంతం స్కీయింగ్కి వెల్లాలని టీం ఫిల్లీ డిసైడు అవ్వడంతో తగిన బందొబస్తు , కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు కార్యకర్తలు :). అంటే కింద పడినా ఫొటోలలో బాగా పడాలి కాబట్టి మంచి సన్ గ్లాస్లు , గ్లౌస్లు తదితర షాప్పింగ్ అన్నమాట . ఓ అరగంట డ్రైవ్ చేస్తే వచ్చేసింది ఫిల్లీ స్కీ రిసార్ట్ . కారులోంచి దిగగానే కాస్త దూరంలో మా వింజమూరి తిర్నాళ్ళలా వుంది కోలాహలం . చిన్నపుడు జగదేక వీరుడు అతిలోక సుందరీ సినిమాలో చూసిన కొండలంటి మంచు కొండ . కొండకి ఒక వైపు తీగలకి వేలడుతూ పైకీ కిందకి తిరుగుతున్న కుర్చీలలా కనిపించాయి . మరో వైపు ఇంకో చిన్న కొండ వుంది . దాని పైన చిన్న పిల్లలు ట్యుబులలో జారుతూ , కొందరయితే దొల్లుకుంటూ కిందకి వచ్చేస్తున్నారు :) లోపలకి వెల్లి కొన్ని $ లు చెల్లించి , ఎంట్రి పాస్లు తీసుకున్నము . పక్కన గదిలోకి వెల్లి పాస్లు చూపిస్తే ఒక జత బూట్లు , ఒక జత స్కీలు ...

డెలావేర్ డ్యాన్స్:-తెలుగువారి దసరా,దీపావళి....

Image
లొకేషన్:-డెలావేర్ సమయం:-దసరా,దీపావళి పండుగలని గనంగా జరుపుకొనేందుకు తెలుగు వారంతా ఏకమయిన వేల.... నెలరోజుల నుంచీ ఇల్లు,కారు,ఆఫీసు అని తెడా లెకుండా KBL పాటలు వింటూన్న సమయం అది.జీవి నాలుగురాటింగు ఇచాడనే కాదు ,మా నివ్ జెర్సీ నవ యువ తార వరున్ సినిమా చూడాలని వారాంతం వరకూ ఆగలేకగురువారమే బయలుదేరాము డెలవేర్లో ప్రివివ్ షోక్ చూడాలని ఫ్యమిలీ మరియూ మిత్రులతో... సమయానికి మేము హాలు చేరెను...సమయానికి...:) టికెట్లతో పాటు పాప్-కార్న్ కూడ కొనుక్కోని లోపలకి వెల్లాము.Actually వెల్లబొయే లోపే వైట్ అండ్ వైట్ దుస్తులుదరించిన నలుగురు వ్యక్తులు మమ్మల్ని అడ్డుకున్నారు.విషయం ఎంటంటే డెలావేర్ తెలుగు అస్సొసియేషన్ వారు దిపావళి ,దసరాపండుగలను గనంగా జరుపుకుంటున్నారంట,మెమంతా రావాలంట..:). వెంటనే నేను ,కల్చరల్ ప్రోగ్రాంస్ ఎమన్న వున్నాయ అండి అని అడిగాను.స్టేజీ వుందంటే డ్యాన్సు కట్టేసేవాడినికాలెజిలో.ఆ కధ మరో సారి చెప్తాను లేండి.ఆ నలుగురి లో ఒకరు, మీరు డ్యన్స్ చెస్తారు కదు పోయిన సంవత్సరంరావల్సింది ,పెళ్ళి పనుల వల్ల రాలేక పోయారు అనడంతో నాకు సగం పని తగ్గిపోయింది... ఇ సారి తప్పకుండా చేస్తానని చెప్పి, KBL సినిమాతో బాగా...

US Trip:- Things to carry

Image
లొకేషన్ :- నెల్లూరు సమయం :- యంబ్బస్సీ వారు వీసా ఇచ్చారు , కన్సల్టన్సీ వారు టికెట్టు పంపారు .అమ్మ కల నిజమయ్యింది,నాని అమెరికా కధ మొదలయ్యింది... Naniz Disclaimer:) ------------------------------------------------------------------------------------- నాకు తెలిసిందల్లా పంచుకోవడం స్నెహమైనా , సమాచారమయినా .... నేను అయిదు ఫ్లోలు ఎక్కితే , నీకు ఎలివేటర్ చూపలేక పోయినా ఆ అయిదు మెట్లూ సులువు చెయ్యాలన్నదే ఈ ప్రయత్నం... తప్పులుంటే మన్నించండి , కుదిరితే సరిచేసేయండి .... ------------------------------------------------------------------------------------- ప్యకింగ్ అయ్యిపోయాక మాటవరసకి నా అమెరికా స్నేహితులని ఏమి తెచ్చుకోవాలి రా అని అడిగా అంతే ...ఒక్కొక్కరూ ఒక్కో పర్వం రాసి పంపారు , ఆకరికి అది ఇలా చాట భారతంలా తయారయింది .... MS అయినా ,H1B అయినా ,Business అయిన ,H4 అయినా ,L1 అయినా , గోడ దూకి వచ్చినా , ఈత కొట్టి వచ్చినా ఈ కింద నేను చెప్పే వస్తువుల్లో మీకు కావలసినవి ప్యాక్ చెసుకోవచ్చు . అన్నీ తెచ్చుకుంటే అందరం కలసీ హోటెల్ లేదా బట్టల...

శెఖర్ కమ్ముల:-Jab We Met

Image
లొకేషన్ :- డల్లస్ టెక్సస్ సమయం :- మా పెళ్ళికి రెండు వారాల ముందు , హ్యాపి డేయ్స్ సినిమా యాబై రోజులు పూర్తి చేసుకున్న వేల , ఓ పక్క పెళ్ళి పనులు , మనం చేసేదేముంది షాపింగ్ :) తో బిజీ గా వున్నా , మా సినిమా లోకంలో నేను నా ప్రాన స్నేహితుడు నరెందర్ S.K ని ఎలాగయిన కలవాలని ఆరాటపడుతున్న సమయం .... మొదటి సారి ఓ తెలుగు సినిమా చెరిత్ర స్రుష్టిస్తూ యాబ్బై రోజులు పూర్తి చేసుకుంది అమెరికాలో . హ్యాపీ డేస్ యాబై రోజుల పండుగ డాల్లస్ లోనే జరుపుకుకోవాలని ఏర్పాట్లు మొదలయ్యాయి . ఈ సందర్బంగా శేఖర్ కమ్ములా వస్తున్నారని తెలిసింది . అంత కర్చు పెట్టి అంత దూరం వెల్లి ఆయనని కలవగలనో లెదో అనే అలోచనలో నేను నరేందర్ ... ఈ లోపే idlebrain.com లో ఓ ప్రకటన వచ్చింది ... http://idlebrain.com/news/2000march20/happydays-50days-announcement.html ఎందుకన్నానో తెలీదు గాని , రెయ్ నరెన్ ఇప్పుడు అంత కర్చు పెట్టి , కలుస్తమో లెదో అనే కదా అలోచనా , కంటెస్ట్ విన్ అయితే పోలా :)... అని సరదాగా అనుకుంటూనే స్పర్శాతో కలసి మా ఇంజినీరింగ్...