3-ఈడియట్స్ కాదు సాఫ్టువేర్ ఇంజినీర్స్
అనగనగా వొ బెంగులూరు మహా నగరం.ఆ ఊరిలో ముగ్గురు మిత్రులు.వాల్లు జస్ట్ మిత్రులు కాదు - స్కూలు,కలేజి,టినేజి అంతా కలసి ఈదేసిన ప్రాణ స్నేహితులు.ఉద్యోగ వేట టీనేజి కలేజి లా కాదని ,అది వో పెద్ద డ్రైనేజి అని అర్దం చేసుకోవటానికి వాల్లకి రెండు సంవస్తరాలు పట్టింది. ఈ మద్యనే ఒకరి తరువాత ఒకరు ఒకే చిన్న సాఫ్టు వేరు కంపెనిలో ఉద్యోగాలు సాదించారు.నెలకు ఏడు వేలు జీతం.మరి మన వాల్ల కర్చు అంటార పది వేలకి తగ్గదు .అందరిది కలిపి కాదు ,ఒక్కోకరిది.ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోరు.మొహమాటం కాదు,ఊరిలో,ఇళ్ళలో వాల్లు ఇచ్చిన్న బిల్డ్ అప్ అలాంటిది.సంవస్తరం క్రితమే ఒకరు ఒరాకిల్,ఒకరు ఇంఫోసిస్ మరొకరు టి.సి.ఎస్ అంటూ కమ్మిట్ అయ్యారు. ఎప్పుడయినా ఊరికి వెల్లవలసి వస్తే ఒక్కరే వెల్తారు.అంటే ముగ్గురూ వెల్తే పని ఆగిపొతుంది అని కాదు,వీల్లు చేసే పనికి అంత సీను లేదు.అసలు మెలికేంటంటే ఒకరు ఊరికి వెల్లాలంటే మిగిలిన ఇద్దరు నగలు తాకట్టు పెట్టాలి.మరి ఒరకిల్ అన్నాక ఆ మాత్రం కర్చులు వుండొదేంటి.ఆ అప్పు తీరాక మరొకరు వెల్లేవారు. ఎవరు పేర్లు చెప్తే మెస్సులో కాతా మూసేస్తారు... ఎవరు కార్డు పెడితే ఏ.టి.ఎం మిషీన్లు క్రాష్ అవుతాయో... ఎవరు...