Posts

Showing posts with the label MyCameraThisPlanet

Sunday is for mom made dosa and chicken....

Image
సెట్టమ్మ పోసేది ఎర్రకారం దోశ...  మురళి క్రిష్నాలో తెస్తే రవ్వ-మసాల దోశ..  హాస్టల్లో పెట్టారు నిదురబుచ్చే దోశ..  ఎడిసన్ చేరాక కీమా రొయ్యల దోశ...  వీటన్నింటినీ మరపించేదే ఆదివారం అమ్మ చేతి దోశ.... స్కూలున్నపుడు అమ్మ విస్సుకోని నాన్న ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తే కాని నిద్ర లేయని మేము ,ఆదివారం నాన్న గారు చికెన్ తేవడానికి వెల్తున్నారు అనగానే ఇట్టే లేసి అట్టే రేడీ అయ్యిపొయేవాల్లం.అది 1982లో పెదనాన్న గారు నాన గారికి ఇచ్చిన బజాజ్ చేతక్ .పేరుకి చేతక్ అయిన మాకు మటుకు అది బజాజ్ పుష్పక్ .మనసుకి ఎక్కడికి వెల్లాలనిపిస్తే అక్కడికి సెరవేగంగా వెల్లిపొయేవాల్లం. తమ్ముడు హ్యాండిల్ పట్టుకుని ముందు నిలుచున్నాడు,వెనక సీట్ ఎక్కేసి నాన్న నడుము చుట్టూ చేతులు వేసి నేను రెడీ అయ్యాను.కిక్ కొట్టగానే మొదట పొగ వచ్చింది ,తరువాత డి.కె.మ కలాశాల ఇంకాస్త దూరం వెల్లగానే మా స్కూలు వచ్చాయి. సూర్య కిరణాలు తాకి ఆవిరవుతున్న మంచు చినుకులు గాలిలో తేమలా మొహానికి తగులుతూంటే మనసు ఆనందంతో నెండిపోయేది. ఇంకాస్తా దూరం పొదలకూరు రోడ్డు పై వెల్లగనే రోడ్డుకి కుడి వైపు భాషా భై చికెన్ షాప్.కేజి బ్రయిలర్ ...

నా ఊరు :To my village with love...

Image
వీదంతా స్నేహితులే,ఊరంతా బందువులే ,కలసి ఆడిన ఆటలెన్నో... వేసవి కాలంలో ఈత కధలు ,వాన వస్తే తీపి జ్ఞాపకాలు.. ప్ల్యానిటోరియం అక్కర్లేదు,మేడ ఎక్కితే తారలన్నీ మావే... భందుత్వాలు తెలుసుకోవటానికి పెళ్ళిలకి వెల్లనక్కర్లేదు ,ఊరంతా వరుసలే.. కోట్ల ఆస్తులు అక్కర్లేదు ప్రతి రేయి హాయిగా నిద్ర పొతే చాలు.. మరో జన్మ అక్కర్లేదు నాకు ఇచ్చిన ఆనందాలన్ని తిరిగి నితో/నా వాల్లతో పంచుకోగలిగితే చాలు... రోడ్డుకి రెండు వైపుల పచ్చని పొంట పొలాలు ,అక్కడక్కడ రొయ్యల చెరువులు... బస్సు బుచ్చి రెడ్డి పాళెం లో ఆగగానే కిటికీలకి వున్న కమ్ములని పట్టుకోని ,టైరు పైన కాల్లు పెట్టి ఎక్కేస్తున్నారు జనాలు.సీటు కోసం కర్చీఫ్ వేసే వాల్లు కాదు.అరిటపండ్ల నుంచి జాంకాయలు దాక,సెనగపప్పుల నుంచి ఉప్పుసెనగలవరకు అమ్మేస్తుంటారు వాల్లు.. పొలం గట్టు పైన వరుసగా తాటి చెట్ల మద్యలోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు ,టెలిఫోన్ తీగలపైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న గువ్వలు.అంటే మరో అరగంటలో ఊరు చేరుకుంటాం. చెరువు కట్ట పైన వరుసగా మామిడి చెట్లు .చీకట్లో కనిపించక పోయిన ఎక్కడ ఏ చెట్టు వుందో ఏ పుట్ట వుందో నా మనసుకి తెలుసు,అందుకే అది...

బోగి/సంక్రాంతి శుభాకాంక్షలు(అరిసెలు,త్యాగలు,తాటికాయలు:) :-A new Beginning...

Image
బోగి/సంక్రాంతి అనగానే నాకు గుర్తుకు వచ్చేది మా ఊరు,మా వాల్లు... ఎందుకంటే అది మాకు పెద్ద పండుగ,అవును చాల పెద్ద పండుగ... ప్రతి సారి హాఫియర్లీ సెలవులని వేడి వేడిగా బోగితొనే ఆరంభించేవాల్లం , పాత వాటికన్నింటికీ వీడ్కోలు పలుకేస్తూ..... వారం రొజుల ముందే ఎద్దుల బండి పై వచ్చిన తాటి ఆకులని ఇంటి వెనకాల బర్రెల కొట్టం లో పెట్టించేస్తారు నానమ్మ్మ. అమ్మ చేసిన నేతి అరిసెలు ఎర్ర పంచలో , గడ్డి మీద గుమ గుమ లాడుతున్నాయి. ఇంటి వెనకాల గోబర్ గ్యాస్ నుంచి మొదలెట్టి ,ఇంటి ముందు అవ్వ కూర్చునే గట్టు వరకు అంతా సుబ్రంగా కడిగించేశారు.ముగ్గు వేయటానికి విజయక్క,అమ్మ కల్యాప కూడ చల్లేశారు... పొద్దునే నాలుగు గంటలకి మేడ పైన పడుకోనున్న మా పిల్ల కట్టని నిద్ర లేపెశాడు రంగన్న. కొందరు తాటాకులతో, ఒకరు కిరసనాయిల్తో ,మరొకరు అగ్గిపెట్టితో రేడి అయ్యాము.తాటాకులు పోగు చేయగానే సుమన్ కిరసనాయిల్ పొసేసెడు. ఇంట్లో వాల్లంతా చుట్టూ నిలుచుని మా వైపు చూస్తూండగానే, నేను తమ్ముడు మంట వెలిగిచేశాము.మాతో పాటు మా వీధిలో అందరూ మొదలెట్టారు.కొంత మంది పాత వస్తువులతో పాటూ పాత బట్టలు కూడా వెసేశారు. ఎవరి బోగి మంట ఎక్కువ ఎత్తు లెగుస...

ఆన్-సైట్ కేరలా:-Gods Own Country

Image
లొకేషన్:-కొట్టాయం కేరలా సమయం:-ఆన్-సైట్ కలలు నిజమైన వేల:) హాలివుడ్ సెలెబ్రిటీలు అంత కర్చు పెట్టి ఐలాండ్లు కొనుకుంటూంటే మాకు మటుకు ఎక్కడ బోటు ఆగినా అది వో చిన్ని ఐలాండే.అలా అలల తో మా టైని-టానిక్ పైన పయనిస్తూ తెలుసుకున్న విషయం ఎంటంటే, 'కేరలా' 'కెరా అంటే కొబ్బరిబొండం/టెంకాయ ,'అలం' అంటే ప్రదేశం సుందరమయిన "Gods own country" లో తల పైకెత్తితే టెంకాయ/కెర చెట్లే.... అసలు నానిగాడు ఇక్కడకి ఎలా చెరాడంటే... ఫ్లాష్ బ్యాక్ @@@@@@ అది వో వర్షం కురవని సన్ని సన్ని డే.ఆన్-సైట్ అంటే ఆమడ దూరంలో వుండే మా మేనేజెర్ ... ఏమొయ్ నాని MM ఆన్-సైట్ చాన్స్ వుంది వెల్తావ్ ఎంటి అంటే ,నా దిమ్మ తిరిగి టికెట్ బ్లాక్ అయింది... MM అంటే అమెరికా చాక్లేట్ల కంపెనీ కాదని,చిన్నపుడు చదివిన మలయాళం మనోరమా పుస్తకాలు /కేరెలాలో అతి పెద్ద దైన దిన పత్రిక అని ఫ్లైటు ఎక్కేముందు గాని తెలియలెదు. సో చికాగోగురించీ కలలు కంటూన్న నెను మొత్తానికి కొచ్చిన్ చేరుకున్నాను ఇలా. ఆన్-సైట్ అమెరికా ఐతే వెనక్కి పంపేస్తారని పనిచేసివుండే వాడినెమో:).ఇక్కడ ఎక్కడికి పంపిచేది .ఎక్కువ చేస్తే సెలవలు...

జల్సా మా కారుకి కొత్త పేరు...

Image
పవర్ స్టార్ ఫాన్స్ అనే కాదు... ఒ మంచి హిట్ సినిమాకె కాదు.. ప్రతి ఒక్కరి జీవితం లొ జల్సా అనె పద్దానికి అర్ధంపలుకుతూ... మా కుర్ర కారుకి నివ్ నేం ప్లేట్. http://idlebrain.com/news/2000march20/jalsa-numberplate.html మీకు తెలుస ఇక్కడ ఒ చిన్నపాటి మొత్తం చెల్లించి నంబర్ ప్లేట్ ల పైన మనకి ఇస్టం అయిన 7 అక్షరాళు వేయించుకొవచ్హు. జల్సా, నాని