Posts

Showing posts from April, 2009

Niagara Falls - మా నయాగరా ట్రిప్ అండ్ Elections 2009

Image
లొకేషన్:- ఫిల్లి 2 నయాగరా ఫాల్స్.. సమయం:- ఈనాటి మన దేశ రాజకియాలు ఆనాటి మా నయగరా ట్రిప్ ని గుర్తుకు తెచ్చిన వేల... లాస్ యేంజెల్స్ నుంచి అనిల్ గాడు,నార్త్ కెరొలినా నుంచి కామెష్ మరియు అనిల్ మిత్రుడు హరీష్ వచ్చి దిగబడ్డారు ఫిల్లికి.మూడు రొజులలో నివ్ యార్క్ నుంచి నయగరా ఫాల్స్ వరకు చూసేయాలన్నాడు అనీలు... మొదట రెంటల్ కార్ అనుకున్న ఆకరి నిమిషం లో అప్పటికి కేవలం ఇరవయ్ వేల మైల్లే తిరిగింది కదా అని చిన్నగా నా బుజ్జి అలియాస్ హొండా అకార్డ్ ని బూక్ చేసెశారు అందరు కలసి. దారిలో అమిత్ గాడు తోడు అవ్వడంతో మంటకి గాలి తొడైనట్టు సెర వేగంతో నివ్ జెర్సి,నివ్ యార్క్ లని దాటుకుంటూ వంతుల వారిగా ద్రైవ్ చేసుకుంటూ సరదాగా సాగిపోయింది విహార యాత్ర. ఫాల్స్ దగ్గర పడుతూండే కొద్దీ రోడ్డుకి రెండు వైపులా మెడని అలా దాని వైపుకి తిప్పెసుకొనే సౌందర్యం, కంపుటర్ రేస్ గేం లో అప్పుడే ఎర్పడి నట్టూ ఎర్పడుతున్నట్టుగా కనిపించ సాగింది... మొత్తానికి ఆకరి ల్యాప్ అమిత్ మా గుండెలు గుప్పెట్లోకి వచ్చేలా డ్రైవ్ చేసినప్పటికీ ఆ పైవాడి దయతో హోటల్ చేరుకున్నాము....రాత్రి పది గంటలకి... వేకువ పాదునే లేసి ఫాల...