School Days : To My School With Love
భాషా రిక్షా ఆగక ముందే దుంకి వీపుకి బాగుని తగిలించుకొని చిన్న గేటు లోంచి లోపలకి అడుగెట్టగానే దారి పొడవునా రెండు వైపులా అసొకా చెట్లు స్వాగతం పలికేవి . దూరంగా కుడి వైపు ఎలిమెంటరి స్కూలు భవనము ,ఎడమ వైపు హై స్కూలు భవనము ,వాటి రెండిటిని కలుపుతూ మద్యలో మా స్టేజి.మొత్తం వో పెద్ద కోటల వుంటుంది మా స్కూల్.ఇలొపే వాచ్ మన్ పెద్ద గేటు తెరిచాడు. స్కూలు బస్సు వచ్చి అగింది.అది సెకెండు ట్రిప్.మొత్తం మూడు ట్రిప్పులు వుండేవి. వైట్ షర్టు ,బ్లూ నిక్కరు,బెల్టు ,టయీ ,బ్లూ సాక్స్,నల్ల బాట బూట్లు .మా స్కూలు పేరు లొగో వుండే బెల్టు,టై. మా క్రమసిక్షన అంతా పొద్దునే అస్సెంబ్లీలో కనపడేది.తరగతుల వారిగా వచ్చి హైటు వారిగా నిలుచునే వాల్లం.వినయంతో వందే మాతరం,చెయ్యి ముందర చాచి ప్లెడ్జి,దేశ భక్తితో జనగనమనా పాడే వాల్లం. క్రిస్టియన్ మిషీనరీ స్కూలు కనుక టీచ్చర్లతో పాటు సిస్టర్లు కూడా వుండే వారు.హెడ్ మిస్సెస్(మదర్) వీరందరికి పెద్ద.ఆరడుగుల ఆమెను ఎక్కడ చూసినా మాలో వినయం ,విదేయతా తన్నుకు వచ్చేవి.నాకు బాగ గుర్తు వున్న నా ఫ్యావరైట్ సిస్టర్స్ వెన్సి సిస్టర్ ,ముండా సిస్టర్.సిస్టర్ కి కోపం వచ్చినప్...