తీహార్ జైల్లో డాడీ
బంగారు కమ్మెల జైలు కిటికీ లోంచి చొరబడి నా కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్న సూర్య కిరనాలనుంచీ తప్పించుకొంటూ మెత్తటి పరుపు మీద ముసుగు మొహం పైకి లాక్కొని కూలరు గాలికి హాయిగా కునుకేస్తున్న నేను టక్ టక్ అన్న శబ్దానికి ఉల్లిక్కి పడి లేచాను.ఒక చేతిలో లాఠితో కానిస్టేబుల్ సౌమ్య "సార్ లెగండి ,లేట్ అయితే టిఫ్ఫిన్ వుండదు" ఇక్కడకి ఏ తప్పు చేసి వచ్చానో,ఎలా వచ్చానో నాకు పూర్తిగా గుర్తు లేదు,వచ్చి ముప్పై సంవస్తరాల పైనే అయ్యింది.తెల్లటి టీ షర్టు,పొట్టి నిక్కరు వేసుకొని పరిగెడుతున్న ఆ పిల్లాడు ఎవరు ? అసలు ఇక్కడకి ఏ నేరం చేసి వచ్చాడు? అడుగుదామని ఎంత ప్రయంత్నిచినా ఆగడే.కానిస్టేబుల్ రామయ్యను అడిగితే ,"ఏమో మీకే తెలియాలి" అంటూ వెటకారంగా నవ్వుతున్నాడు.ఈ రోజు ఎలా అయినా వాడి వివరాలు కనుక్కోవాలి. ఇన్ని సంవస్తరాలు అయినా, తను జైలుకి రాని భుధవారం లేదు.నాకు ఇష్టమయిన తిను బండారాలు,పచడ్లు,పుస్తకాలు వారానికి సరిపడా తెచ్చి వుంటుంది.దేశంలోనే ప్రసిద్ది గాంచిన జైలు కనుక, బద్రత ద్రుస్య తనని లోపలకి పంపేప్పుడు చెప్పులు కూడా వేసుకోనివ్వరు.వాల్లు ఇచ్చిన దుస్తులు వేసుకొని బాంబు స్కానర్ లోంచి లోపలకి వచ్...