3 ఈడియట్స్ కాదు సాఫ్టువేరు ఇంజినీర్స్ : రాంబాబు ఇంటర్వివ్
పేరుకు ఇస్త్రీ కొట్టే అయినా ఆ ఏరియా లో రాజన్న తెలియని సాఫ్టు వేరు ఇంజినీరు వుండడు.జాబ్ ఇంటర్వివ్ అయినా పెళ్ళి ఇంటర్వివ్ అయినా రాజన్నకు తెలియాల్సిందే.ఆయన కుక్క పేరు ఫేస్ బుక్.వీది కుక్కకి వింత పేరు ఏంటని అడిగితే,ట్రెండుకి తగ్గటే వుండాలి పేర్లు అయినా షేర్లు అయినా అనేవాడు.ఇక మన ముగ్గురు సాఫ్టు వేరు ఇంజినీర్ల విషయానికి వస్తే,ఇంకా అదే చిన్న కంపెనీలో పనిచేస్తూ వారానికి మూడు ఇంటర్వివ్ లు ఆరు పార్టీలతో లాక్కొస్తున్నారు. రాంబాబు నలబై ఏడో ఇంటర్వివ్ తర్వాత... రాజన్న: నవ్వుతూ,ఎం రాంబాబు మల్లీ పొయ్యినట్టుంది ఇంటర్వివ్. రాంబాబు: ఒక ఇంటర్వివ్ అంటే ఎంత పెద్ద విషయమో తెలుసా నీకు? రాజన్న: ఎముంది ఇస్త్రి బట్టలు తగిలించామ ,ఆటో ఎక్కామా. బాల: ఇంతకీ ఏమయింది? రాంబాబు: ఎప్పట్లా కాకుండా ఇసారి నలుగురు - వో లీడు,వో ఆర్కిటెక్టు,మేనేజెరు ,డైరక్టరు ఎదురుగ్గా కూర్చున్నరు.నా రేంజు పెరిగిందేమో అనుకుని, మొదట నా గురించి చెప్పాను . బాల: అక్కడ దొబ్బుంటుంది రాంబాబు: లేదు నా పని గురించి అడిగారు.రాం గోపాల్ వర్మ నాగర్జున కి శివా సినిమా న్యారేట్ చేసినట్టు ,బాలయ్యకు విజయేంద్ర వర్మా సినిమా కధ చెప్పినట్టు,జాని సినిమ...