Posts

డెలవేర్లో జల్సా:క్షణమే జీవితం,ఇ క్షణమే జీవీతం

Image
క్షణమే జీవితం,ఇ క్షణమే జీవీతం... క్షణమే శాస్వతం,ఇ క్షణమే శాస్వతం... ఎవరితో నీ పోటి ? ,కలసిపో అందరితోటి... తిరిగిరాని క్షణమునైన ,కొనగలవ డబ్బుతోటి.. ఇన్నాల్ల చదువు నీకు , పొల్చుకోవడమే నెర్పలేదె? దేశాలన్ని తిరిగే నీకు, మానవత్వం ద్యాస లేదె కలుపుకుంటే కలసిపో,కలసిపోతే కలుపుకో... సారి అంటే క్షమించెయ్,తప్పు చేస్తే తలొంచెయ్.. కోట్లు పెట్టి ఇల్లు కొంటే చిన్ననాటి ప్రెమ నీద? భయం తోనె దాచె సొమ్ము , రమ్మన నీతో రాద? క్షనమే జీవితం,ఇ క్షనమే జీవీతం... క్షనమే శాస్వతం,ఇ క్షనమే శాస్వతం... తప్పు ఎప్పటికీ తెలుసుకొకపొతే? వదిలెస్తే సరి,వున్నాడుగా హరి...:) ఆలోచనే అన్నీ అయ్యినప్పుడు,అది మంచిదైతే పోలా ..... సమయం:-మరో సారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. లొకేషన్:- డెల్ డెల్ డెల్ డెల్ డెలవేర్... వారం రొజుల ముందర ఇన్వైట్ పంపినప్పటికీ ,అనుకున్నదాని కంటే ఎక్కువ మంది వచ్చేయడంతో కాస్త ఆలస్యంగా ఆరంభమైన కార్యక్రమాలు బొమ్మలకొలువుతో మొదలయ్యి చిన్నారుల న్రుత్య ప్రదర్సనలతో ఊపందుకున్నాయి. ఫోక్ డ్యాన్సుతో మొదలెట్టి హింది పాప్ సాంగ్లతో సరదాగా సాగి పోయాయి కార్యక్రమాలు. ప...

బోగి/సంక్రాంతి శుభాకాంక్షలు(అరిసెలు,త్యాగలు,తాటికాయలు:) :-A new Beginning...

Image
బోగి/సంక్రాంతి అనగానే నాకు గుర్తుకు వచ్చేది మా ఊరు,మా వాల్లు... ఎందుకంటే అది మాకు పెద్ద పండుగ,అవును చాల పెద్ద పండుగ... ప్రతి సారి హాఫియర్లీ సెలవులని వేడి వేడిగా బోగితొనే ఆరంభించేవాల్లం , పాత వాటికన్నింటికీ వీడ్కోలు పలుకేస్తూ..... వారం రొజుల ముందే ఎద్దుల బండి పై వచ్చిన తాటి ఆకులని ఇంటి వెనకాల బర్రెల కొట్టం లో పెట్టించేస్తారు నానమ్మ్మ. అమ్మ చేసిన నేతి అరిసెలు ఎర్ర పంచలో , గడ్డి మీద గుమ గుమ లాడుతున్నాయి. ఇంటి వెనకాల గోబర్ గ్యాస్ నుంచి మొదలెట్టి ,ఇంటి ముందు అవ్వ కూర్చునే గట్టు వరకు అంతా సుబ్రంగా కడిగించేశారు.ముగ్గు వేయటానికి విజయక్క,అమ్మ కల్యాప కూడ చల్లేశారు... పొద్దునే నాలుగు గంటలకి మేడ పైన పడుకోనున్న మా పిల్ల కట్టని నిద్ర లేపెశాడు రంగన్న. కొందరు తాటాకులతో, ఒకరు కిరసనాయిల్తో ,మరొకరు అగ్గిపెట్టితో రేడి అయ్యాము.తాటాకులు పోగు చేయగానే సుమన్ కిరసనాయిల్ పొసేసెడు. ఇంట్లో వాల్లంతా చుట్టూ నిలుచుని మా వైపు చూస్తూండగానే, నేను తమ్ముడు మంట వెలిగిచేశాము.మాతో పాటు మా వీధిలో అందరూ మొదలెట్టారు.కొంత మంది పాత వస్తువులతో పాటూ పాత బట్టలు కూడా వెసేశారు. ఎవరి బోగి మంట ఎక్కువ ఎత్తు లెగుస...

Social Security Number - Step 1

Image
లొకేషన్:- నివ్ జెర్సి సమయం:-అప్పుడప్పుడే జెట్ ల్యాగ్ వదిలించుకుంటున్న నన్ను మా కంపెని రిసెప్షనిష్టు పట్టుకొని ఇసెలిన్ S.S.N ఆఫీసుకి తీసుకువెల్లిన వేల.... Naniz Disclaimer:) ------------------------------------------------------------------------------------- నాకు తెలిసిందల్లా పంచుకోవడం స్నెహమైనా , సమాచారమయినా.... నేను అయిదు ఫ్లోర్లు ఎక్కితే , నీకు ఎలివేటర్ చూపలేక పోయినా ఆ అయిదు మెట్లూ సులువు చెయ్యాలన్నదే ఈ ప్రయత్నం... తప్పులుంటే మన్నించండి , కుదిరితే సరిచేసేయండి .... ------------------------------------------------------------------------------------- As per the social security office... "You need a Social Security number to get a job, collect Social Security benefits and receive some other government services. But you don't often need to show your Social Security card." You need an S.S.N to open a bank account.. You need an S.S.N to get your pay stub running... You need an S.S.N to apply for a drivers license.. You need an S.S.N to breath,drink,e...

ఆస్టిన్ పవర్స్ c/o టెక్సస్

Image
శానాంటొనియో రివర్ వాక్ గూటికి చేరుకుంటున్న పక్షులని స్వాగతిస్తూ చిన్ని చిన్ని గువ్వల కేరింతలు ఒ పక్క... మాతో పాటు నడచి వస్తున్నట్టుగా ప్రవహిస్తున్న శానాంటొనియో నది మరోపక్క... సమయమే తెలియనివ్వని తోడు నా పక్క... ఆస్టిన్ నదికి తోడు గా , దానిలో నీడలా ఆకశాన్నంటే భవనాలతో వెలిగిపొతున్న ఆస్టిన్ దౌంటౌన్... చిన్నపుడు జగ దేక వీరుడు అతిలోక సుంధరి సినెమాలో చూసిన గ్రుహలని మరపించిన ఆస్టిన్ కేవ్స్(caravans).. మౌంట్ బర్నెట్ నుంచి లేక్ ఆస్టిన్..ఎలా ఉంది? వింటర్ అన్నాక స్నో, సమ్మర్ అన్నాక గ్రిల్ తప్పవు మరి... చికెన్ నుంచి రొయ్యల వరకు దేనికైనా రేడి అంటూ కుమ్మేశాం.. సీ వరల్డ్..మరొ ప్రపంచమే మరి... బ్రమ్మి ని గుర్తు తెప్పించే రైడ్ల తో పాటు... సీ లయన్స్ షో.. చాపలని ఎలా దొంగలించాలో చూపించే సముద్రపు సిమ్హాలు... షాము షో... ఆకశమే మా హద్దు అన్నట్టు ఎగిరి పడుతున్న తెల్ల తిమింగలాల విన్యాసాలు... Dolphin is mans best friend అనిపించేలా డాల్ఫిన్లు... ఆస్టిన్ సఫారి జింక నుంచి జీబ్రాల వరకు... ఆస్ట్రిచ్ నుంచి అందమైన అడవి బర్రె వరకు...:) అందరు మా వింధుని స్వీకరించారు....

ఎక్కడ వుంది ఆనందం? :- 2009 నూతన సంవత్సర సుభాకాంక్షలు

Image
సమయం:-2008 కి వీడ్కోలు పలుకుతూ 2009 కోసం ఎదురు చూస్తూ..... ఎక్కడో లేదు రా ఆనందం.... నీలోనే వుంది రా ప్రపంచం... అది తెలుసుకోవడమే రా జీవితం.. తెలుసుకున్న వాడికదే శాస్వతం.... ఇల్లు వదలి స్కూలుకెల్తే ,మాస్టర్స్ డిగ్ర్రితో కలిసొస్తుందా? బైకులంటు,ప్రేమలంటే ,మొదటి రోజు సినెమాలో వుందా? జాబు వచ్చి ,రెక్కలొంచితే,డబ్బుతోనె పెరుగుతుందా? బారు కెల్లి బీరు కొట్టిన స్నేహం వెనుక ఆగి వుందా? ఫ్లైటు ఎక్కి అలలు దాటితే , ఏడు వింతలలో దాగి వుందా? ఎక్కడో లేదు రా ఆనందం.... నీలోనే వుంది రా ప్రపంచం... అది తెలుసుకోవడమే రా జీవితం.. తెలుసుకున్న వాడికదే శాస్వతం.... When you can share others happiness ,There will be no moment of sadness. And when u can't, All you are left with is..... Happy New Year!! Inspired by her, నాని

ప్రమోషన్:-కార్ నుంచి సైకిల్ కి...

Image
లొకేషన్:-దర్గామిట్ట నెల్లూరు... సమయం:-బిజి బిజిగా ఆఫిసు నుంచి వచ్చి హరి హరిగా కారు పార్కు చేసిన నన్ను,సైకెల్లలో ఎదురొచ్చిన ఇద్దరు చిన్నారులు పలకరిస్తే... "A journey through my beautiful childhood..." ఆనందం , అది శినివారం హాల్ఫ్ డే , ఇంటికి త్వరగా వెల్లి పోవొచ్చనా ? సంతోషం , ఇంటికి వెల్లగానే ఊరినుంచీ తాతయ్య వాల్లు వచ్చి వుంటారనా ? ఉత్సాహం ,ఈసారి వచ్చినప్పుడు నాకు టు వీలర్ కొనిస్తామని తాతయ్య వాల్లు చెప్పారనా ? లలితక్క బడి గంఠ కొట్టేసింది ,మా st joseph స్కూల్ అషోకా చెట్ల మద్యలో తమ్ముడితో కలసి గేట్ దగ్గరకి నడుస్తూ వుంటే ఎదురుగ్గా జార్జి ... 'George of the jungle' కాదు , మా డ్రైవర్ జార్జ్ . జార్జి మొహంపై కాల్గేట్ స్మైల్ . దాని అర్దం మాకు తెలుసు . పరిగెత్తుకుంటూ మా జీపు వైపు వెల్లాము నేను తమ్ముడు . జీపు లోంచి దిగగానే ఇద్దరినీ చెరొక చేతులో ఎత్తేసుకున్నారు తాతయ్య . జేబు లోంచి ఫైస్టార్ చాక్లేట్లు తీసిచ్చారు . ఎవరు ముందు తినెస్తార అని నెను తమ్ముడు నెమ్మదిగా తింటూ వుంటే , ఇల్లు దగ్గర పడింది...

మొదటి స్కీయింగ్:-జై చిరంజీవా,జగదేక వీరా:)

Image
లొకేషన్ :- ఫిల్లీ స్కీ రిసార్ట్ సమయం :- టీం ఫిల్లీ స్కీయింగ్కి బయలుదేరిన సమయం . మౌంట్ ఎవరెస్టు ఎక్కాలనుకున్న నాని మంచు కొండ ఎక్కిన వేల ... వారాంతం స్కీయింగ్కి వెల్లాలని టీం ఫిల్లీ డిసైడు అవ్వడంతో తగిన బందొబస్తు , కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు కార్యకర్తలు :). అంటే కింద పడినా ఫొటోలలో బాగా పడాలి కాబట్టి మంచి సన్ గ్లాస్లు , గ్లౌస్లు తదితర షాప్పింగ్ అన్నమాట . ఓ అరగంట డ్రైవ్ చేస్తే వచ్చేసింది ఫిల్లీ స్కీ రిసార్ట్ . కారులోంచి దిగగానే కాస్త దూరంలో మా వింజమూరి తిర్నాళ్ళలా వుంది కోలాహలం . చిన్నపుడు జగదేక వీరుడు అతిలోక సుందరీ సినిమాలో చూసిన కొండలంటి మంచు కొండ . కొండకి ఒక వైపు తీగలకి వేలడుతూ పైకీ కిందకి తిరుగుతున్న కుర్చీలలా కనిపించాయి . మరో వైపు ఇంకో చిన్న కొండ వుంది . దాని పైన చిన్న పిల్లలు ట్యుబులలో జారుతూ , కొందరయితే దొల్లుకుంటూ కిందకి వచ్చేస్తున్నారు :) లోపలకి వెల్లి కొన్ని $ లు చెల్లించి , ఎంట్రి పాస్లు తీసుకున్నము . పక్కన గదిలోకి వెల్లి పాస్లు చూపిస్తే ఒక జత బూట్లు , ఒక జత స్కీలు ...