Blessed by the absolute,Inspired by my family and Influenced by my teachers-While I explore and learn more in the career development, personal development and self consciousness spaces I will try to creatively express my thoughts,work and experiences through my blog, videos etc to help others while helping myself.
బడిలో కూడా లేవు ఇన్ని సెలవులు...
ప్రభుత్వ ఉద్యోగం మరపిస్తూ కాఫి సర్వర్లు...
ప్రాజెక్టు ముగిస్తే క్రికెట్ మ్యాచ్చీలు....
పది సంవస్తరాలలో తిరిగేవా అన్ని దేశాలు...
లొకేషన్:- ITPL బెంగులూరు
సమయం:-TCS లో పాతుకుపోయిన వేల...
ఉద్యోగ దరకాస్తుకి,కంపెనీలు అన్ని వీలు అయితే డెభ్భై కుదిరితే డెబ్బై-అయిదు శాతం మార్కులు ఉండాలంటుంటే...మా TCS మటుకు అరవై శాతం చాలంటూ "హం హై నా..."
పని లేక కాలిగా వుంటే ఇంటికి వెల్లొచు,ఇల్లు కొంటే ఆన్సైట్ వెల్లొచు..
ప్రాజెక్టు అయ్యిపోయి కాలిగా వుండే వాల్లకి,బెంగులురు గాంధీనగర్ బ్రాంచ్ బిల్డింగు మద్యలో బెంచీలువుంటాయి,ఎందుకంటే వాల్లకి సిస్టంలు వుండవు:).ఇంటికి వెల్లిపోయి హాయిగ మరో ఉద్యోగమో ,వ్యాపారమో చేసుకునేవారు లేకపోలేదు:).
మేనేజెర్ వచ్చి ICICI Direct లో షెర్లు ఎంత పెరిగాయో చూస్తున్న లీడు గారితో.. ఎమొయ్ ఆసైట్ వెల్తావ్ఎంటి,వెల్లి చాల రొజులయింది కదా,మీ క్లైంట్ మేనేజెర్ తెగ కలవరిస్తున్నాడు.లెదు విజయ్ మా బుడ్డోడిని వదిలి వెల్లడంఇప్పుడు కష్టం.ఆరు నెలల తర్వాత ఇదే లీడు.... విజయ్ అర్జెంటుగా ఆన్సైట్ వెల్లాలి, రెపె ఫ్లైటు ఎక్కలి అంటూవచ్చాడు మనేజర్ దగ్గరకి.విషయం ఎంటంటే లీడు గారు ఇల్లు కొన్నారు ,లోన్ త్వరగా తీర్చెయ్యాలి కదా..:).ఇంకెముందిమరొ సారి "హం హై నా" ....అంటూ ఫ్లొరిడా పంపేశారు.
ఆన్సైట్ వెల్లిన వాల్లు, పూర్వ జన్మ నుంచే రుణ పడి వున్నారు ఫీలింగ్ ఆఫ్షోర్ వాల్లకి.ఎంత అర్జెంటు పని అయిన 'వో హైనా...' అంటూ ఆన్సైట్ వాల్లకి వో ఈ-మైలు కొట్టేసి ఇంటికి పోవడమే.
ఆన్సైట్ అంటే మాకు సెవన్ వండర్స్ మటుకే కనిపించేవి. మాకు తెలియని విషయం :- ఆన్సైట్ వాల్లు ఆఫిస్ కి ఇంటికిపెద్ద తేడా లేకుండా పని చెస్తారు.ఇందులో వాల్ల తప్పు కూడ వుంది లేండి.ఇలా ఫ్లైటు దిగామో లేదో క్లైంటుని ఎలాబుట్టలో వెయ్యలి,ఇక్కడ ఎక్కువరోజులు ఎలా వుండాలి అనే అలోచన పెరగడంతో ,అంతా వాల్లే చెయ్యలనే ఫీలింగు పెరిగిఆఫ్షోర్ వాల్లతో "మంచి కమ్యునికేషన్ గ్యాప్" ఉంది మీ ఇద్దరి మద్య అనెలా తయారవుతుంది.ఎదో ఒక టైంపాస్ వుండాలికదా-ఆ-ఆ...
ఇంకో గమ్మతైన విషయం ఏమిటంటే భార్య భర్త TCS కే గనుక పని చెస్తూ, ఒకరికి ఆన్సైట్ చాన్స్ వస్తే,ఇంకొకరికి ఫ్రీ ,నీకుఫ్రీ:)
ఇన్ని తమాషాలు వున్న నాలాంటి బద్దకస్తుల చేత కూడ పని చెయించి,మన దేశంలో బిల్లియన్ దాల్లర్ మార్క్ ని చేరినమొదటి IT Services Company గా చెరిత్రలో ఎక్కెసిన TCS We Luv You:).ఇండియాకి వెనక్కి వెల్లాక IT రంగంలోనే వుంటే , TCSకే పని చేస్తాను...:)
లొకేషన్:-కొట్టాయం కేరలా
సమయం:-ఆన్-సైట్ కలలు నిజమైన వేల:)
హాలివుడ్ సెలెబ్రిటీలు అంత కర్చు పెట్టి ఐలాండ్లు కొనుకుంటూంటే మాకు మటుకు ఎక్కడ బోటు ఆగినా అది వో చిన్నిఐలాండే.అలా అలల తో మా టైని-టానిక్ పైన పయనిస్తూ తెలుసుకున్న విషయం ఎంటంటే,
'కేరలా'
'కెరా అంటే కొబ్బరిబొండం/టెంకాయ ,'అలం' అంటే ప్రదేశం
సుందరమయిన "Gods own country" లో తల పైకెత్తితే టెంకాయ/కెర చెట్లే....
అసలు నానిగాడు ఇక్కడకి ఎలా చెరాడంటే...
ఫ్లాష్ బ్యాక్ @@@@@@
అది వో వర్షం కురవని సన్ని సన్ని డే.ఆన్-సైట్ అంటే ఆమడ దూరంలో వుండే మా మేనేజెర్ ...
ఏమొయ్ నాని MM ఆన్-సైట్ చాన్స్ వుంది వెల్తావ్ ఎంటి అంటే ,నా దిమ్మ తిరిగి టికెట్ బ్లాక్ అయింది...
MM అంటే అమెరికా చాక్లేట్ల కంపెనీ కాదని,చిన్నపుడు చదివిన మలయాళం మనోరమా పుస్తకాలు /కేరెలాలో అతి పెద్దదైన దిన పత్రిక అని ఫ్లైటు ఎక్కేముందు గాని తెలియలెదు.
ఆన్-సైట్ అమెరికా ఐతే వెనక్కి పంపేస్తారని పనిచేసివుండే వాడినెమో:).ఇక్కడ ఎక్కడికి పంపిచేది .ఎక్కువ చేస్తేసెలవలు పెట్టి మరీ తిరుగుతా అని చెప్పి ,రెండు నెలలలో ,నాని 'కెరలా లోకల్ 'లా తయారయ్యా.రక రకాల కొత్తవంటకాలు ట్రై చేస్తూ... 'చిల్లి ఫిష్','బనానా చిప్స్ ' నా ఫ్యావరేటుగా ఫిక్స్ అయ్యిపోయాను.మొదట్లో కొబ్బరినూనెతో తయారుచెసినా , త్వరగానే మన ఇ-స్టయిల్కి ట్యును అయ్యిపోయాడు హొటెల్వాడు.
ఇప్పుడు ఫ్లాష్ బాక్ నుంచి బాక్ వెల్తే@@@@
ఏ ఐలాండు లోఆపినా,అప్పుడే పట్టిన చాపలు,రొయ్యలు సెలెక్టు చేసెసుకోని మరీ వండించుకోవచ్చు..అల బోట్లో వెల్తూతెలుసుకున్న విసెషాలు ఇవి...
కెరెలా literacy rate is almost 100% అని తెలిసిన నాకు,దాని వల్ల నా మిత్రులు పడే కష్టాలు నా మనసునికదిలించేసాయి.ఇక్కడ సాఫ్ట్ వేరు ఇంజినీరుకి హార్డుగా నెలకి వో ఎనిమిది వేలు ముడుతుంది.ఇంక డిగ్రిలు చేసి ,కాలిగావుండే వాల్లు ఎందరో....
అందుకే నిరుద్యొగంతో పాటు ఇక్కడ సుఇసైడ్ల సంఖ్య కూడ ఎక్కువ అవ్వటం దురద్రుష్టకరమయిన విషయం...
ఒకప్పుడు కేరలకి తమిలనాడుకి ఒక్కటే బాష వుండెదంట.అందుకే కాబొలు ఇప్పటికి కెరల వాసులు తమిల సినెమాలుతెగ చూస్తారు.
'చటా' అంటే మళయాళంలో 'అన్నా అని కూడ తెలుసుకున్నను:)
అప్పట్లొ మనకి అమెరికాలో ఎముందో తెలిదు కాని,ఇంతకంటే సుందరమైన ప్రదేశం ప్రపంచ్చంలో ఎక్కడా వుండదనిఫిక్స్ అయ్యిపొయ్యా... ఇక్కడ వొక్క,కాఫీతో పాటు రబ్బర్ ఎంత ఎక్కువ దొరుకుతుందో రబ్బరుతో వేసిన రోడ్లు చూస్తే తెలుస్తుంది....
ఇలాంటి విషయాలు తెలుసుకుంటూనే అందమైన ఎన్నో ప్రదేసాలు తిరిగేశాము.వైకొం టెంపుల్ (లక్ష దీపలదెవాలయం),కొట్టాయం బ్యాక్వాటర్స్.
ఇన్ని కొత్త ప్రదేశాలు తిరిగినా ఒక్కసారి కూడా నా పర్సుని బయటకి తీనివ్వని నా మిత్రులకి వీడ్కోలు పలుకుతూ ,బెంగులూరుకి రండి మీ పని చెప్తా అని చెప్తూ జెట్ యయిర్వేస్ వారి విమానం ఎక్కేశాను....
This part of my blog is dedicated to my mallu friends:).reji,praveen,rajesh,joseph.pavan....
పొదున్ లెగ్గాలీ,స్నానం చెయ్యాలీ
కారులో ఎక్కాలీ,ఆఫ్ఫిస్ కెల్లాలీ
బాత్-రూం లొ పాటలు, బ్రేక్-ఫాస్ట్ లో మాటలు
పిల్ల ముందు వొండర్లు,మేనేజర్ ముందు బ్లండ్డర్లు
నేను మన చైనా నుంచీ వచ్చిన మేయ్(అది పేరు) తో అనింది అల్లా ,మీరందరు అనుకుంటున్నట్టూ ఆ టెస్టింగ్ టీంలోఅమ్మాయికి నాకు యే సంభందం లేదు అండి అని అంతే:)....
ఆఫిస్ మొత్తం తెలిసిపోయింది విషయం.కాని ఆ పెళ్ళి పుస్తకం సినిమాలోలా,ఈ తీయ్యని నిజాన్ని అందరికితెలియకుండా ఎక్కువ రోజులు దాచక పోయినా,దాచినన్ని రోజులు బలే ఎంజాయ్ చశాము లే....
తెలియక ముందు ప్రశ్నలు మీ ఊహా ప్రపంచానికి వదిలేస్తూ ...తెలిసిన తరవత అడిగినవి ఇవి..
మీరిద్దరూ ఒకే కారులో వస్తరా?
అబ్బా సూపర్ గ్యాసు/petrol సేవింగ్ కదా...
హేహ్ అది నీ ఇంటర్నెట్ కేబుల్ కాదు మీ ఆయనది...
ఎంటీ మీ ఆయన రాసిన కోడ్లో బగ్గులే లెవంట.ఇందులో నీ హస్తం వుందా..?
కుకింగ్ కాంపటీషనుకి తెచ్చేవి నువ్వు చేస్తవా మీ అయాన చెస్తాడా?
hmmm వాల్ల ప్రశ్నలకి అంతం లేదు ,మా ప్రాజెట్టుకి డెడ్-లైన్ లేదు అనుకోండి:).
మా పెళ్ళి పుస్తకంలో వో మరపురాని మరచిపోలెని మొదటి చాప్టరు ఇంతటితో ముగిస్తున్నాను
ఈ "నా కెమెరా ఈ ప్రపంచం" సెక్షన్ని ఈ ట్రిప్పుతో మొదలెట్టటానికి కారనం మా అనీల్ గాడు...
అస్తమిస్తున్న సూర్యుని సైతం,వెలుగుతో నింపగల మన స్నేహం....
ద్యాంక్స్-గివింగ్ అంటే నాకు అదో ఎక్ట్రా జోష్ వచ్చేస్తది , నాకే కాదు నాలుగు రోజులు సెలవలు అంటే యే సాఫ్టువేరు ఇంజినీరుకి మటుకు జోష్ రాదు చెప్పండి.ఇ జోష్ లోనే నా వీసా స్టాంపింగ్ నిమిషంలో చేసేశారు చెన్నై అమెరికన్యంబస్సిలో ఒకప్పుడు :).ఇ జోష్తో పాటూ చిన్నపటి బెస్టు ఫ్రెండుని పది సంవస్తరాల తరవాత కలుస్తున్నా అనే ఫీలింగ్తో ఫిల్లడల్ఫియా ఇంటర్నేషనల్ యయిర్పొర్ట్ నుంచి బయలుదేరాము వైల్డ్ వైల్డ్ వెస్ట్ కి.
నాతోపాటు వచ్చిన నా రూమేట్ సుమంత్ తో కబుర్లు చెప్పుకుంటూ ల్యాప్టాపులో సినిమాలు చోస్తూ, అయిదు గంటలలోలాస్ వేగాస్ చేరుకున్నము.ఫ్లైట్ మారడనికి టెర్మినల్కి వెల్తుంటే అది యయిర్పొర్ట్ కి తక్కువ కెసినోకి ఎక్కువలా వుంది.మరో గంటసేపు ఫ్లై చేసి LA చేరుకున్నాము. ఆ తూరుపుకి ఈ పడమర ఎంత దూరమో ,ఈ తూరుపుకి ఈ పడమర అంతే దూరం అనిపించింది.
అనీల్:- 10త్ క్లాస్లో నా పేపర్ ని వాడి పేపర్ లా చూసుకొని పాస్ అయ్యినా:) ,ఇంఫొసిస్లో జాబ్ సంపదించి నాకంటే ముందే అమెరికాచెరుకున్న నా ప్రాణ స్నేహితుడు .ఇద్దరం కలసి పది సంవస్తరాలు అయినా ,ఆకరి రోజు మాటలు ఎక్కడ ఆపెమో అక్కడనుంచే మొదలెట్టినట్టు స్టార్ట్ చేశాం . మరో పక్క నార్త్ కెరోలినా నుంచి వచ్చిన సుజిత్ని, సుమంత్ ఫ్రెండ్ అయిన సుబ్బుని కలవడంతో వో చిన్ని క్రికెట్ టీం తయారయింది.వచ్చివో వొన్ యియర్ అయ్యిపోవడంతో అనీలుగాడికి universal స్టూడియోకి వెల్లడం వో హాబి,దిస్నీ లాండ్ అంటే వో ఆట,వెగస్ కి వెల్లి డబ్బులు పోగొట్టు కోవడం అంటే వో సరదా:)
డిస్నీ ప్రపంచం (వరల్డ్)తో ప్రారంభించాము మా ఫైవ్ డే వెకేషన్ని.రక రకాల రైడ్లు ఎక్కడమే గాక నా ఫ్యవరైట్ యానిమేటెడ్ క్యారెక్టర్ అయిన ష్రెక్ ని కూడ కలిశాము.
చిన్నపుడు వారం అంతా వెయిట్ చేసి ఆదివారం దూర-దర్షన్లో చూసిన మిక్కి మౌస్ని డైరక్టుగా తన ఇంట్లోనే కలవటం వో తీయ్యని అనుభూతి. 'నీ ఇంటి కొచ్చా నీ నట్టింటికొచ్చా అనుకుంటూ ఫొటోలు తీసుకున్నాం:)'
LA నుంచి వేగస్ నాలుగు గంటల డ్రైవ్.అది 'one of my favourite drives' అనె చెప్పుకోవాలి.ఎందుకంటే అక్కడ స్పీడ్ లిమిట్ చాల ఎక్కువ:).ఇంకెముంది నేల తాకినా టైరు స్పీడు తగ్గని కారు.కారు అగిందంటే ఫొటోలు.యే పని చేసినా ఫొటోనే .యే పని చెస్తున్నా,పాపం మా అనిలుగాడు:).రోడ్డుకి రెండు వైపులా ఎడారి. వేగస్ స్ట్రిప్పులోకి ఎంటర్ అవ్వగానే కల్లు జిగెల్ మనిపిస్తూ అవి బిల్డింగులా పెద్ద సైజు ట్యుబులైట్లా అనిపించింది ,అనిల్ గాడికి తప్ప మా అందరికి. ప్రతి కెసీనోకీ వో హొటెల్తో పాటు వో తీం కూడా వుంటుంది.సీసర్స్ ప్యాలస్ ఐతె ఈజిప్టులోని రోము మహా నగరములా,నివ్యార్క్ నివ్యార్క్ ఐతె వొ మిని సైజు నివ్యార్క్ లానే వుంటుంది. మా మంకీ మందకి తగ్గటే సర్కస్-సర్కస్ హొటెల్లో రూములు బుక్ చేశాడు అనిలుగాడు. స్లాట్ మెషీన్ల నుంచ్చీ పోకర్ వరకూ ,బ్లాక్ జాక్ నుంచీ రోలెట్ వరకూ అన్నింటిలోనూ మా అద్రుష్టాన్ని పరీక్షించుకొంటూ కెసీనోలన్నీ తిరిగేశాం. వేగస్ అంటెనే నైట్ లైఫ్ .కెసినోలో బ్రోకర్లకి కాసేపు రెస్ట్ ఇచ్చి బయటకు వస్తే సీసర్స్ ప్యాలస్ దగ్గర డ్యన్సింగ్ ఫౌంటైన్ చూస్తూ అరగంట సెపు అలానే వుండి పోయాము.
వెగస్కి వెల్లి శ్ట్రాటోస్పియర్ ఎక్కకపోతే తిరుమలకి వెల్లి లడ్డు తిననట్టే:).
వంద ఫ్లోర్ల పైన హొటెల్లో కూర్చొని వెగస్ని చూడడమే కాదు అంత ఎత్తున మల్లి రైడ్లు కూడ ఎక్కెయొచ్చు.
హాసిని డ్రైవర్ లేడు:) X-Scream:- బిల్డింగ్ కి చిట్ట చివరకి తీసుకొచ్చి అపేస్తాడంతే!!
Insanity:-వేగస్ మొత్తం చిన్నిదిగా కనిపిస్తూ వుంటే,మనల్నిఆకాశాంలోకి విసిరి వేసి నట్టూ అనిపిస్తుంది.
Big Shot:- వంద ఫ్లోర్ల పైన అల్లి బిల్లి ఆట:).ఆపండ్రోయ్ అంటే అక్కడే ఆపేస్తారని ,గమ్మునే వున్నా వో రెండు క్షనాలు అక్కడే ఆపేశారు.రోడ్డు పైన కార్లు,బిల్డింగ్లు, లెగోస్తో కట్టీన బొమ్మల్లా చిన్ని చిన్నిగా కనిపిస్తుంటే మాకు ఆకాశంలో చుక్కలు నేల మీదేకనిపించాయి:).
ఒక్కొ రైడు అయిదు సార్లు ఎక్కితే గాని తనివి తీరలేదు మాకు:)
ఇలా రెండు రోజులు రెండు రాత్రులు వేగస్ కెసినోల స్టాక్ వ్యాలువ్ పెంచి ,మా పర్సుల బరువు తగ్గించుకోని,మరచిపోలెని ఎన్నో అనుభవలని బ్యాగ్లలో ప్యాక్ చేసుకొని కొత్త స్నెహితులతో కలసి గ్ర్యాండ్ కెన్యాన్ కి బయలుదేరాము.