తన బ్యాగు టిపాయి పై పెట్టి చెల్లెలి బ్యాగు మంచం పై విసిరేసి, అమ్మ ఉప్మా కావాలి అన్నాడు అనిల్(7త్ క్లాస్).సొఫా లో కూర్చున్న సునీత మెడ చుట్టు చేతులు వేస్తూ అమ్మ నాకు మ్యాగి అంది అమిష(4త్ క్లాస్).మి సంగతి తెలిసే సేమియా ఉప్మా చేసాను .త్వరగా రేడి అయ్యి తిని బయలు దేరండి ,అమమ్మ ఎదురు చూస్తుంటుంది.నాన్న గారు రావడానికి లేటు అవుతుందంట , మిరు రిక్షా పట్టుకొని వెళ్లాలి అంటూ మసాలా డబ్బా లోంచి పది రూపాయలు తీసి అనిల్ కి ఇచ్చింది సునీత. పవర్ కోసం ప్రతిపక్షం ఎదురు చూసి నట్టు ఈ రోజు కోసమే అనిల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తునాడు. ఎప్పుడూ నాన్న గారి మొటారు సైకిల్ లెదా రిక్షాలో వెళ్లే అనిల్ కి టౌన్ బస్ లో వెళ్లాలనే కోరిక.దీనికి కారణం అనీల్ స్నేహితుడు సలీం - టౌన్ బస్సు లో ఐతే చవకగా ,త్వరగా వెల్లిపోవొచ్చు అని వాడు ఎప్పుడూ అంటుంటాడు.రిక్షా ఐతే ఏడు నుంచి తొమ్మిది రూపాయలు,అదే టౌన్ బస్ అయితే రెండు రూపయలే , మిగతా ఎనిమిది రూపయలతో చాక్లేట్లు కొనుక్కోవచ్చని అమీషాని అమ్మకి చెప్పొదంటూ వప్పించాడు. అర కిలోమీటరు నడచి రిక్షా స్టాండు దాటి కే.వి.ఆర్ పెట్రొల్ బంకు బస్ స్టాప్ చేరుకున్నారు.ముందర బ్యానెట్టుకి వ...
Comments