Blessed by the absolute,Inspired by my family and Influenced by my teachers-While I explore and learn more in the career development, personal development and self consciousness spaces I will try to creatively express my thoughts,work and experiences through my blog, videos etc to help others while helping myself.
ఈ డెన్వర్ ట్రిప్ గురించి ఎప్పటినుంచో రాయలనుకూంటున్నా ,ఇ వీకెండ్ ఇంట్లోనే వుండేలా చేసిన హేన్నా హరిక్కేన్ దానికి తెర లేపింది:).
డెన్వర్ ట్రిప్ అనగానే నెల ముందు నుంచే కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది నాకు మా పప్పక్క అలియాస్ రాధికా రాణిగారికి.అమెరికాకి వచ్చెదాక మనకి డెన్వర్ అంటే తెలిసింది ఈ-టీవిలో వచ్చె బాబొయ్ డెన్వర్ కార్టూన్ మాత్రమే.మమూలుగా ఐతే సమ్హీ పుట్టినరోజుకి జులైలో వెల్లే మేము ఈసారి మార్చ్ లోనే రేడీ అయ్యాము.దానికి కారణం మీకు ఇంటర్వెల్ లోపు తెలుస్తుంది లేండి.
డెన్వర్:- నాకు ఇంకో పెరు కూడ వుంది ఎంటో తెలుసా భాషా:), కాదు 'దా మైల్ హై సిటీ'.అల నాకు మారుపేరు ఎందుకొచ్చిందంటే సముద్ర మట్టానికి నెను కరెట్టుగా ఒక మైలు ఎత్తున వున్నాను.
ఊరు నుంచి తాతయ్య వాల్లు వస్తే జ్వరమని చెప్పి స్కూల్ ఎగ్గొటినట్టూ, ఆఫీస్కి హాఫ్ డే డుమ్మా కొట్టీ బయలుదేరాము ఫిల్లి అంతర్జాతీయ్య విమానాస్రయానికి.కష్టపడి పార్కింగ్ సంపాదించ్చి ,పొకనోస్ 'దా స్కి రిసార్ట్' నుంచి బయలుదేరి వచ్చిన బాబు అన్న & ఫ్యామిలీని కలిసాము.సెకురిటి చెక్ అవ్వగానే కాసేపు స్నాక్స్ బార్లో కూర్చున్నాము.దాంట్లో బార్ కంటే స్నాక్స్ ఎక్కువగా చూసుకోని:), బాబు అన్న సీనియర్ ,మా ఫేవెరైట్ డైరెక్టర్ గమ్యం క్రిష్ గారి గురించి మట్లాడుతూండగానే మా బోర్డింగ్ కాల్ వినిపిచ్చింది. ఫ్రీ సినిమా క్లయిమాక్స్ చెరుకోగానే డెన్వర్ దగ్గరపడిందని పైలట్ చెప్పారు.ఐఫోన్లో చోటి ఫొటోలు తియ్యగానే,రాత్రి ఏడు గంటలకి డెన్వర్లో ల్యాండ్ అయ్యాము..
డే/నైట్ వన్
పైలట్ కి తోడుగా కొ-పైలట్ వున్నట్టు ,సమ్మర్కి తోడుగా ఇక్కడ బార్బెకివ్ వుంటుంది.ఇల ఫ్రెషప్ అవ్వగానే అల సునీల్ బాబాయ్ బార్బెకివ్ మొదలెట్టారు బల్కనీలో.ఒకటా రెండ ఇంక మవల్ల కాదు బాబొయ్/బాబాయ్ అనె దాక చెస్తునేవున్నారు.నానమ్మ జెమిని టీవిలో సీరియల్లు చూస్తూ ,వచ్చె ఎపిసొడ్లో జరగబోయెది కూడ చెప్పెస్తూ వుంటే,మేము కబుర్లు చెప్పుకుంటూ సమ్హితా,సంప్రీత్లతో ఆడుకుంటూ ఆరోజుకి విడ్కొలు పలికాము.
రెండవ రోజు
ఒ పక్క సంప్రీత్ మొదటి పుట్టినరోజు వేడుకల ఎర్పాట్లు సెరవెగంతో సాగిపొతుంటే మరో పక్క మమ్మల్ని డెన్వర్ పర్యటనకు తీసుకువెల్లారు.రెడ్ రాక్స్ యాంఫి థియేటర్తో మొదలెట్టాము.ప్రముఖ రాక్ బ్యాండ్లెన్నో ఇక్కడే వాల్ల మొదటి పెర్ఫామెన్స్ ఇచ్చారు.కాసేపు ట్రెక్కింగ్ చేసి,కొండపై వున్న రాక్ ముసియంలోఫేమస్ రాక్ బ్యాండ్ల గిటార్లు వగైరా చూసాము.దూరంగా వున్న డెన్వర్ దౌంటౌన్ చూస్తూ థియేటర్ మెట్ల పైన పోటీలు పడి కిందకి చేరాము.
దారిలో అందరికి ఐస్క్రీం కొనిచ్చి ,సునీల్ బాబాయ్ కారుని రేస్ ట్రాక్ చూపిస్తూ అటు వైపుకి తిప్పడంతో,ఒ పక్క ఉత్సాహం మరోపక్క కాస్త భయం.చోటిని కస్టపడి ఆపి నెను,బాబాయ్,బాబు అన్న రంగంలోకి దిగాము.సునిల్ బాబాయ్ ఆకరిలో మొదలయినా హోం ట్రాక్ కావడంతో మాకంటే ఒ ల్యాప్ ముందరకి వెల్లిపోయారు.ల్యాప్స్ పెరిగే కొద్ది కాస్తా ఫాంలోకి వచ్చి ఆకరిదయిన పదవ ల్యాప్ వచ్చెసరికి బాబయ్ కి మంచి పోటీ ఇస్తూ ఫినిష్ లైన్ దాటాము.
చీకటిపడుతూండగానే డెన్వర్ డౌంటౌన్లో వున్న ఆర్ట్స్ సెంటర్ చేరుకున్నాము.స్టార్బక్స్ లో ' ఒ మంచి కాఫిలాంటి ' కాఫి తాగి ఆకసెమే మా హద్దు అనేలా వున్న బిల్డింగ్ల మద్య నడవసాగాము.రోడ్ మద్యలో సన్నటి లొకల్ ట్రైన్ ట్రాక్,రోడ్కి రెండు వైపుల మా ఊరు తిర్నాళ్ళలా లైట్లు,ఆస్టిన్(టెక్సాస్) తర్వాత ఇంత ప్రసాంతంగా నైట్ అంతా ఇక్కడే వుండిపొవాలనిపించెలా వుంది డెన్వర్ డౌంటౌన్.సిటీ బుస్లు తిరుగుతూండగానే మద్యలో పెద్ద పెద్ద గుఱ్ఱాలు నడిపిస్తున్నజట్కా బండులు.అలా కాసెపు చల్లగాలిలో పిల్లగాలితో తిరిగి ఇంటికి చేరాము.
సంప్రీత్ మొదటి పుట్టినరోజు /3 వ రోజు
పొద్దునే కళ్ళు తెరవగానే ఇంట్లో పండగ వాతావరనం కనబడింది.త్వరగా రెడీ అయ్యి నేను బాబు అన్న , రెక్ సెంటర్ లో బుక్ చేసిన ఫన్షన్ హాల్ ని డెకరేట్ చేసాము.సూచనలు మా అర్కిటెక్ట్ అక్కయ్య గారు, అదె భి ఆర్క్ చేసిన మా పప్పక్క ఇచ్చారనుకోండి.పదకొండు గంటలకల్లా ఇంట్లొవాల్లంతా రెక్ సెంటర్ చెరారు. వాల్లని ఫాలో అవుతూ అతిధులంతా వచ్సారు.పిల్లలకోసం స్పెషల్గా ఎర్పాటు చేసిన క్లౌన్ షో పిల్లలనే కకుండా పెదల్లని కూడ బాగా ఆకట్టుకుంది.పిల్లలకి గిఫ్టులతో పాటు , టాటూలు కూడ వేసెసింది క్లౌన్.
మేము కార్లో వచ్చాము ,కేక్ ట్రైనులా వచ్చింది.కేక్ కట్టింగ్ ముందే కెమేరా,అంటే ఫొటోలు/వీడియోల భాద్యత నాకు ఇచ్చారు.ఇంక మనం వూరుకుంటామా, పిచ్చెకిచేసా:).సంప్రీత్ కేక్ కట్ చెయ్యగానే అందరూ గిఫ్ట్లతో మనసారా దీవించారు.
హోటల్ ఫుడ్కి నో ఆని చెప్పీ రక రకాల హోమ్మేడ్ డిషెష్స్ వండి తీసుకొచ్చారు పప్పక్క అండ్ ఫ్రెండ్స్.ఒక సైడ్ శాఖాహారాన్ని డిస్సపాఇంట్ చెయ్యకుండానే నాన్ వెజ్ కుంసియో .
కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకొనెలోపే మా డ్యాన్స్ కి టైం అయిందంటూ అక్క మ్యుసిక్ స్తార్ట్ చెయ్యడంతో ఇంకేముంది మిరే చూడండీ...
'చుడొదంటూన్నా చూస్తొనేవుంటా..' అంటూ పోకిరిగా మొదలెట్టి,అందరూ చూస్తూ వుండగానే నెను చోటి డెన్వర్ ప్రెక్షకుల మనసులకి దగ్గరయ్యాము.గురు సినిమాలోని 'బర్సోరే ' పాటకి చోటీ డ్యన్స్ చేస్తే ,నెను ' యమహో యమ్మా ' అంటూ చిరూత్తాతో మొదలెట్టి, చిరు ' బంగారు కోడి పెట్టతో ' ముగించాను.
మాతో పాటు బర్త్డే బోయ్ సంప్రీత్ కూడ జాయిన్ అవ్వడంతో కాసెపు హాల్ నవ్వులతో నెండిపోయింది.డెన్వర్ని 'దా మైల్ హై సిటీ' అని ఎందుకు అంటారో అప్పుడే తెలిసింది మాకు.పది నిమిషాలు చేసామో లేదో అలసట:).అందుకే కాబోలు డెన్వర్ ఫూట్ బాల్ టీమ్ని, డెన్వర్లో వోడించటం అసాద్యం.రెండు వారాల మా ప్రాక్టీస్కి చరిపొయే పొగడ్తలు:) అందుకోని, అందరం ఇంటికి బయలుదేరాము.
నాల్గవ రోజు
ఆకరిరోజు రోజు అనగానే మా సిస్టర్ ఎవ్వరినీ ఇంట్లోనుంచి కదలనివ్వదు.కాసేపు బాల్కనీలో రాక్కీ పర్వతస్రేనులని చూస్తూ చిన్నప్పటి కబుర్లతో మొదలెట్టీ టైం మెషీన్ 1998 చేరగానే నానమ్మ దగ్గరనుంచి లంచ్ కాల్.ఇ నాలుగురోజుల కిచెన్లో వంటలతో,బేస్మెంట్లో డ్యన్స్ ప్రాక్టీసుతో హడావుడిగా వున్నా మా "జిల్లియన్ డాల్లర్ బేబి" సమ్హితా హీరోఇన్ గారి కాల్ షీట్లు సంపాదించ్చి ఓ చిన్ని వీడియో తీసేశాం.
సమ్మర్ హాలిడేయ్స్ ముగిసాక స్కూల్కి వెల్త్తున్న ఫీలింగ్-తో ఫిల్లికి బయలుదేరాము మా యునైటెడ్ ఐర్-లైన్స్ వారి విమానంలో.
పరిక్షలు రాయడం,వేసవి సెలవులు రావడంతో పాటు ప్రతి సంవత్సరం ఫ్యామిలిలు ఫ్యామిలిలుగా బయలుదేరి తిరుమలకి వెల్లడం మాకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితి.గోవిందుని దర్శనం మాకు సంవత్సరానికి ఒక్కసారి మ్యాండేటరి అండ్ మా చిన్నమామకైతే క్వాటర్లి ఓసారి కంపల్సరీ.అందుకే ఆయన ఎక్కువగా గుండులొనే దర్శనం ఇస్తుంటారు.కాని 1994 లొ ట్రెండ్ మారి క్రిస్టమస్ సెలవులకే బయలుదెరాము తిరుమలకి.హైదరాబాదు నుంచి పెద్ద-అత్తమ అండ్ ఫ్యామిలి మరియు నెల్లూరు నుంచి మెము అండ్ చిన్న అత్తమ ఫ్యామిలీలు పొద్దునే అయిదు గంటలకి సూర్యుడితో పాటు కార్లలొ బయలుదెరాము.పిల్లలు అందరం ఒకె కార్ ఎక్కాలని డిసైడ్ అవ్వడం/ఎడ్వడం తో అందరిని మా అంబాస్సడర్ లొ కుక్కారు.ఆ కార్కి మా నాన్నగారు డ్రైవర్ కావడంతో ఇక మా అల్లరికి బౌండరీలు లేకుండా పొయింది.
శ్రికాళహస్తి దగ్గర కార్ నంబర్ 1 పిట్-స్టాప్ తీసుకోగానె,కార్ నంబర్ 2 లొ చీరలు-నగలు దిస్కషన్ కి బ్రేక్ పడింది.కార్ నంబర్ 3 లొ గాడ నిద్రలో వున్న పెద్దమామయ్య అండ్ బావ మసాల దోశ అండ్ సాంబార్ గుమ గుమలకి కలలకు బ్రేక్ ఇవ్వడంతో అందరం నాయుడి హొటల్ లోకి వెల్లి బాగ తిని,మల్లి 7 హిల్ల్స్ ట్రాక్లోకి ప్రవేసించాము.మామయ్య కొనిచ్చిన చాక్లేట్స్ తింటుండగానె చుట్టు అంద్దమయిన సన్ ఫ్లవర్ ఫీల్డ్స్.సూర్యుడిని అవి ఫాలో అవుతుంటే మెము వాటిని ఫాల్లో అవుతూ వుండిపొయాము.ఇంతలో తిరుపతి అంతలో అలిపిరి వచ్చెసింది.
ఇ తిరుమల ట్రిప్ కి మునుపటి ట్రిప్లకి తేడా ఎమన్న వుంటే అది ఎప్పటికీ మరచిపోలేని కాలి నడకె.వాతవరనం చల్లగా వుండడంతో మమ్మల్ని మెట్ల దగ్గర వదిలి అమ్మ కార్లో బయలుదేరారు.
పదకొండు కిలోమీటర్ల భక్తి-ముక్తి మ్యారతాన్ని గొవిందా గోవిందా అంటూ ప్రారంభించాము.పది మెట్లు ఎక్కెమో లేదొ ఇటు పది మంది అటు పది మంది ముందు పది పైసల్ల గుట్టలు పెట్టుకోని కూర్చొని వున్నారు.బిచ్చగాల్లు అనుకొనె లోపె వాల్లకి పది రూపయల నోట్ ఇచ్చి తొమ్మిది రూపయల చిల్లర తీసుకున్నారు మామయ్య.రుపయికి పది పైసలు వాల్ల కమిషన్ అంట.మెట్టు మెట్టుకి హారతి ఇస్తు నామాలు పెడుతు, ముందు నుంచి మా ఇద్దరు అత్తలు ప్రతి మెట్టుకి మాకు వెల్కం చెప్తువుంటే,మా బావ చెప్పిన్న రకరకాల ట్రిక్స్ ఫాలో అవుతూ చక చకా మెట్లు ఎక్కాము.అప్పటి వరకూ ఇంకెంత దూరం అనుకుంటూ వెనకబడి వస్తున్న తమ్ముడు ఒక్కసారిగా పరిగెట్టటం మొదలెట్టాడు.నెక్స్ట్ ఫ్రేములో ఒక చేతిలొ ఉప్పు-కారం చల్లిన అంటు మామిడికాయ పీస్ ,ఇంకొ చేతిలొ బొరుగుల మసాల పొట్లంతో కనిపించాడు.ఇవన్ని తింటూ వెల్తుంటే దారి పొడవునా రకరకాల తినుబండారాలు(ఐస్ క్రీంస్,చాక్లేట్లు) అమ్మే అంగడులు దర్సనమిచ్చాయి , మా అందరి కరుణ పొందాయి.ఎక్కిన మెట్ల సంఖ్య పెరిగే కొద్ది కింద తిరుపతిలోని ఇల్లు చిన్నవయ్, బొమ్మరిల్లులాకనిపించ్చాయి.పుణ్యక్షేత్రము అయినంతమాత్రాన పార్ట్-టైం దొంగలు లేకపోలెరు.అందుకె అక్కడక్కడా సెకురిటీ గార్డులు కనిపించారు.
కాస్తా దూరం వెల్లగానే పక్కనె అందమయిన పెద్ద పార్క్ కనబడటంతో ఫొటొలు దిగటం ప్రారంబం.ఇంతలో ఒ పెద్ద ధుప్పు,జింకకి కసిన్ సిస్టర్ మా తమ్ముడి కంట పడడంతో, వాటికి అరటి పండులు కొనిఫెట్టి బదులుగా మెము కొన్ని ఫొటోలు తీసుకున్నాం.అది ఇంకా కొడాక్ కెమరా అండ్ ఫిల్మ్ కాలం కావడంతొ ఫొటోల విషయం లొ కాస్త ముందుచూపు వుండెది.మోకాల్ల పర్వతం దగ్గర పదుతుండగానె ఒ చిన్న బ్రేక్ తీసుకున్నం.అక్కడ ఒ అంగడి పక్కనె జనం వాల్ల దగ్గర మంచి స్నాక్స్ వుండటంతో అక్కడకి ఒ చిన్న సైజ్ వానర సైన్యం వచ్చిపండింది.అవి బాల్కని క్లాస్ కి చెందినవి అవ్వటంతొ,చిప్స్ నుంచి చాక్లేట్లు వరకు,మినిరల్ వాటర్ నుంచి మెరిండ వరకు అన్ని లాక్కొని పోతున్నయి.ఒక కోతి వచ్చి మా మమయ్య కాలు పట్టుకోని అయన చేతిలో వున్న చిప్స్ ప్యకేట్లో షేర్ అడిగింది.ఆయన ఇవ్వకపొవడంతో అది సీరియస్ గా చూసింది.కాని ఆయన సిలా విగ్రహంలా అలానే వుండడంతో దానికి మండి ,జై హనుమాన్ అన్నీ అయన చంప పైన ఒక్కటి పీకి చిప్స్ ప్యాకెట్తో మాయమైయింది.అత్తమ్మ మావయ్య వైపు నవ్వాలా వద్ద అన్నట్టు చూస్తూ వుంటె ,మామటుకు మేము కొన్ని డొనేషన్స్ చేసుకుంటూ ముందుకి సాగిపోయాం.
కాసెపు మెట్లు పోయి రోడ్ వచ్చింది.అందరికి బాగా దాహం వేస్తొంది, అంగడులేమి లేవు అనుకుంటూండగా,మహిమో మాయో వొ అయిదుగురు పసుపు రంగు డ్రసుల్లో అందరికి నీళ్ళు,మజ్జిగ సప్లయ్ చెస్తున్నారు.ఒక్కసారిగా సముద్రం దాటుతున్న హనుమ అంత పవర్ వచ్చింది.దారిపొడవునా మంచ్చు వుండటంతో రోడ్ అసలు కనిపించటం లేదు.ఇంతలో బావ అన్నాడు అది మంచ్చు కాదు మబ్బులు అని.నిర్దారించుకోవడానికి ఒక్కసారి లొయలోకి చుస్తే బడి వదిలేస్తే పిల్లలు వెల్లినట్లుగా వెల్తున్నాయి మబ్బులు.ఆ ద్రుస్యాన్ని తిలకిస్తూ మిగిలిన కాస్త మెట్లు ఎక్కెయగానె చుట్టూ కొన్ని పురాతన సిల్పాలు . నాన్నగారి నోట వచ్చేశాం అనె మాట వినగానె అందరం తిరుమల గాలి పీల్చుకున్నాం!!!.
విచిత్రం ఏమిటంటే కాలి నడకన మెము కార్లొ వచ్చిన అమ్మ, అందరం ఇంచు మించు ఒకే సమయానికి చేరుకున్నాం.దీనికి కారనం మెము రోడ్డుపై నడుస్తూ వుండగా మమ్మల్ని పలకరించ్చిన మేఘాలె:).
ఇంక తిరుమల గురించి వెరె చెప్పాల, అన్నమయ్య ఎప్పుడో చెప్పారు!!
ఇ వేగములో మేము సాగిపొతుంటే
ఇ గాలిలో మేము తేలిపొతుంటే
ఎ అలలు మమ్మలిని ఆపలేకుంటే...
ఒషన్ సిటి ఫిల్లి నుంచి రెండు గంటలు ,అట్లాంటిక్ సిటి నుంచి అర గంట దూరంలో వుండే సుందరమయిన సముద్ర తీరం.సుక్రవారం పార్టి నుంచి మేలుకొని ఒషన్ సిటికి బయలుదేరెసరికి మద్యానం రెండు గంటలు అయింది. మంచి ఎండలోబయలుదెరి దారిలో లంచ్ బ్రేక్ తీసుకొని,ఒకటిన్నర గంటలు డ్రైవ్ చేస్తె వచ్చేసింది భే వివ్ జెట్ స్కీస్/బ్యాక్ వాటర్స్.కార్ దిగగానే ఎక్సైట్మెంట్తో క్యమెరా క్లిక్లు మొదలయ్యాయి.ముందె కాల్ చేసి రిసర్వ్ చేసుకొవడం వల్ల 25$ దిస్కౌంట్ ఇచి 55$ కే 1 హవర్ రైడ్ ఇవ్వడంతో అ ఎక్సైట్మెంట్ రెండింతలు అయింది.
టీవిలో ఇన్స్ట్రక్షన్స్/ప్రికాక్షన్స్ చూపిస్తుంటే అలాగె చెయ్యలని మరీ మరీ అనిపించింది:).జట్-స్కిలో ఎక్కి కూర్చొగానే ఎల స్టార్ట్ చెయ్యాలి ఎల ఆపాలి అని బట్టన్లు చూపించారు. చెతికి ఒ టాగ్ తగిలిచ్చారు ,పొరపాటునో/కావలనొ మనం నీళ్ళలో పడితే,ఇంజిన్ ఆగిపొయి జెట్-స్కి అక్కడె మనకోసం ఎదురు చూస్తుంది.ఇంజిన్ స్టార్ట్ చెసి నెమదిగా పాసింజర్ని గట్టిగా పటుకోమని చెప్తూ ఒక్కసారి వేగం పెంచడంతో ఇంకెముంది 'మెగాలలో తెలిపొమ్మని నుంచి .. గాల్లొ తెలినట్టుందే వరకు పాడెసుకున్నాం:).మొదటి సారి అయిన ప్రవీన్ తన ప్రావిణ్యం చూపించడంతో కసెపు రేసింగ్ వాతావరనం నెలకొంది.నలబై మైల్ల స్పీడ్లో దూసుకుపొతుంటే వాటర్-కేమెరాలో ఫొటోలు తీసుకున్నాము.బయటకి రావలనిపంచలేదు,అందుకే ఎగస్ట్రా రెండు మూడు రౌండ్లు వేసి తీరం చేరాము.
బీచ్కి వెల్దాం అనగానే అందరి మొహలలో మెంటో-ప్లెస్ వెలుగు కనిపిచింది.ఎద్దన్నా ఇష్టమయిన పని చెస్తే త్వరగా ఆకలెస్తుందో ఎంటొ అందరికి బాగ కాలడంతో బొర్డ్ వాక్ ఎక్కగానే ఫూడ్ కోర్ట్-లోకి దూరి పిజాలు,బర్గర్లు అనె బేదం లెకుండా కుమ్మేసాము.చెతిలో కోక్ పటుకుని బీచ్ వైపు నడుస్తూ వుంటే పైన సీగల్స్.వాటికి మన చెతుల్లొ వుండేవన్నీ ఆహారమాఎ.అలలు పిలవడంతో అందరం బీచ్ వైపు పరిగెట్టాము.కెరటాలతో ఆడుకోని తనివితీరా ఫొటోలు తీసుకున్నాము.చొటీ కొనుకున్న పీచు మిఠాయి తింటు మిగత డబ్బులతో అట్లాంటిక్ సిటీకి బయలుదేరాము.
తాజ్ మహల్ కెసినో చేరగనే,నరెందర్ కి ప్రవీన్ రొల్లెట్ అంద్ బ్లాక్ జాక్ నెర్పిస్తువుంటే మెము స్లాట్ మషిన్లో మ అద్రుస్టాన్ని పరిక్షించుకున్నం.ఒక్కసరి వేగస్ చూసాక ఇ కెసినోలు సూపర్ అనిపించకపొయిన నరెన్కి మొదటి సారి కావడంతో మెము వాడితో ఆడుకుంటూ బానే టైంపస్ చెసాము.అక్కడ నుంచి సీసర్స్ ప్యాలస్ కెసినోకి వెల్లి నరేదర్గాడు పార్కింగ్ ఎమౌంట్ గెలవడంతో ఇంక హ్యాప్పీగా ఇంటికి బయలుదెరాము:).ఇంటికి చేరీ కల్లుమూసేసరికి తెలవరిజామున రెండు గంటలు అయింది:).మరువలేని అనూభవం మా మనస్సులొనూ ఫొటోలు కమెరొలోను బందించడంతో మరో టిం ఫిల్లీ ట్రిప్ ముగిసింది.