Saturday, February 7, 2009

లేక్ హౌస్:- హాట్ స్ప్రింగ్స్/లిటిల్ రాక్,ఇది చాల హాటు గురు....

Visit my new portal bharaththippireddy.net


లొకేషన్:-హాట్ స్ప్రింగ్స్,లిటిల్ రాక్,ఆర్కెన్సాస్
సమయం:-చిన్నపటి కల నిజమయ్యిన వేల,నివ్ యియర్ 2007.

నేను అమెరికా కి రావడంలో పెద్ద విశేషం ఎమి లేదు,చిన్నపటి నుంచే ఎప్పుడోవకప్పుడు నాకు ఇక్కడకి రాక తప్పదని తెలుసు.ఎందుకంటే నేను ఇంజినీరింగు మొదలెట్టక ముందే అమ్మ అలా డిసైడు అయ్యిపోయింది కాబట్టి:).అలా డిసైడు అవ్వడానికి కారం ఒకరు మా ఆస్టిన్ పిన్ని ఐతే ,మరొకరు మా లిటిల్ రాక్ జ్యోతి పెదమ్మ...

She is our fairy god mother..

చిన్నపుడు అమెరికా అంటే మాకు(నాకు , తమ్ముడికి) తెలిసిందల్లా జ్యొతి పెదమ్మ,పెదనాన్న,వంశీ,రాహులు...

మాటలు చెప్పే స్పీక్ అండ్ స్పెల్ నుంచి రాక్ బ్యాండు కీబోర్డ్ల వరకు ...

బేసిక్ బాష మాట్లడే కంపుటర్ నుంచి లేటెస్టు యానిమేటెడ్ ఇంగ్లిషు సినెమాల వరకు అన్ని ఆమె ద్వారనే తెలిసేవి మాకు.వారంతం వారాంతం జ్యొతి ఆంటీ ఫోన్ వచ్చిందంటే చదువునుంచి మాకు రెండు గంటలు విరామం ప్రకటిస్తుంది అమ్మ.అందుకే ఆ కాల్ కోసం అమ్మ కంటే ఎక్కువ మెమే ఎదురు చూసే వాల్లం.





నివ్ యియర్ 2007

ఎప్పటిలానే క్రిస్టమస్ సెలవులకి పిన్ని వాల్ల ఊరు , అదే మన ఆస్టిన్ వెల్లి ,నివ్ యియర్ టైం కి లిటిల్ రాక్ చేరుకున్నాను.లిటిల్ రాక్ అంటే లిటిల్ రాక్ నుంచి వో గంట దూరం లో వున్న హాట్ స్ప్రింగ్స్...

జ్యోతి ఆంటీ కార్లో యయిర్పోర్టు నుంచి ఇంటికి వెల్తూ వుంటే,రెండు సంవస్తరాలకి వో సారి వాల్లు ఇండియాకి వచ్చినప్పుడల్లా,రాహుల్ ,వంశీలతో కలసి మేము చేసే అల్లరి గుర్తుకువచ్చింది....





లేక్ హౌస్...

పెదమ్మ వాల్ల అందమైయిన లేక్ హౌస్ లోకి మొదటి సారి అడుగుపెట్టాను........

లేక్ హ్యామిల్టన్ కి ఆనుకొని అందులో బాగమెమో అనేలా వున్న ఇంటి బాల్కని లోకి వెల్తే లోపలకి రాబుద్ది కాదు .ఫొటో స్తుడియో లో బ్యాక్ గ్రౌండ్లలా ఎటు చూసినా ఇంకో వైపు చూడాలనిపివ్వనట్టుగా వుంది వివ్...

మరో నాలుగు అడుగులు వేసి బోట్ షెడ్లోకి వెల్తే...జెట్ స్కీలు ,వో సారి ఫ్లొరిడా గుర్తు తెచుకొంటూ రంగంలోకి దిగాము యువ సెన అంతా....




అలా పోటీ పడి జెట్ స్కీ రౌండ్లు వేస్తూ చిన్నపుడు హైదరాబాదు ఓషన్ పార్కులో అందరం కలసి చేసిన విన్యాసాలు గుర్తుకు తెచ్చుకున్నాము....




రెండవ రోజు హాట్ స్ప్రింగ్స్ డౌంటౌన్ విహార యాత్ర మా లిటిల్ కసిన్ వంశి నేపద్యంలో మొదలయ్యింది...

వంశితో కలసి కాస్తా ట్రెక్కింగు చేసేసి,హాట్ స్ప్రింగ్స్ మౌంటైన్ టవర్ పై నుంచి డౌంటౌన్ చూస్తుంటే తిరుమల కొండ ఎక్కుతూ తిరుపతిని చూసినట్టు మబ్బుల మద్యలోంచి భవనాలు చిన్ని చిన్నిగా బొమ్మరిల్లలా కనిపించాయి...





సహజ సాదారననంగా ఏర్పడిన ఈ వేడి నీటి జలపాతాలని తిలకించటానికే ఎంతో దూరం నుంచి ఇక్కడకి వచ్చే పర్యాటకులతో కిట కిట లాడుతొంది డౌంటౌన్.వీల్లలో ఆ నీటిని బాటిల్లు బాతిల్లలో నింపెసుకొని తీసుకు వెల్లే వాల్లు లేకపొలేదు.ఎందుకంటే ఆ నీటిలో ఎన్నో జబ్బులని నయం చేసే ఔషదాలు వుంటాయి..





ఎప్పుడూ జులై 4 న కలుసుకునే రాహుల్ , వంశి స్నేహిల్తులందరూ ఇసారి నివ్ యియర్ పార్టి కలసి చేసుకోవాలి అని దెసైడు అవ్వడంతో పెదమ్మ దానికి తగిన బందోబస్తు చేసేశారు....


హోం థియేటర్...

అప్పటి వరకు హోం థియేటర్ అంటే నాలుగు స్పీకర్లు వెనకాల , రెండు స్పీకర్లు ముందర వుంటే చాలు అనుకొనే నాకు ఆ గదిలోకి వెల్లగానే బెంగులురు పి.వి.ఆర్ సినెమస్ రాయల్(500 రూ టికెట్టు) లోకి వచ్చేశానెమో అన్నట్లు అనిపించింది.


నింటెండో ' వీ '

వీ ని కలవడం అది మొదటి సారి కానప్పటికీ అంత పెద్ద స్క్రీన్ లో బేస్-బాల్ ఆడుతుంటే యాంకీ స్టేడియం లో వున్న ఫీలింగ్ కలిగింది.ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాతావరనం వేడెక్కి హోరా హోరీగా సాగి బిగినర్స్ లక్ నా వైపు వుండదంతో గెలుపు నన్నే వరించింది...



టీటి బల్ల పైన ఎర్పాటు చేసిన వార్ గేం నన్ను ఎంత గానో ఆకట్టుకుంది.అప్పుడెప్పుడో కంపుటర్లో ఆడిన యేజ్ ఆఫ్ దా ఎంపైర్స్ గేం ని మరపించింది.....


నివ్ యియర్ పార్టి హ్యాంగ్ ఓవర్ నుంచి అప్పుడప్పుడే బయట పడుతున్న మమ్మలని ఫేమస్ ఇటాలియన్ రెస్టారెంట్ ఆలివ్ గార్డంకి తీసుకువెల్లారు పెదమ్మ వాల్లు..

అదే నా మొదటి ఆర్కెన్సాస్ ట్రిప్ కి ఫేరెవెల్ పార్టి.ఇలా మొదటి సారి పెదమ్మవాల్లని వాల్ల మెట్టినిల్లు అయిన లిటిల్ రాక్ లో కలవడం నా అమెరికన్ చాప్టర్లో మరవలేని మరో పేజీని ఇలా నమోదు అయ్యింది........


Related Articles


Florida Part 2:Miami The Paradise


UK Visitor Visa for non US Citizens in USA


Hasinis Day Out


Florida Part 1:Six days in Orlando

Texas:Take 8


F.E.A.R:-Forget Everything And Ride!!


Niagara Falls With West Coast Gang


Wild Wild West 2


Dance in Delaware


Austin Texas


First Ski


Kerala


Wild Wild West 1


Denver The Mile High City


Ocean City

Visit my new portal bharaththippireddy.net

Sunday, February 1, 2009

గ్రాండ్ కెన్యన్:-Wild Wild West 2

Visit my new portal bharaththippireddy.net


లొకేషన్:-గ్రాండ్ కెన్యన్(అరిజోన-
The Grand Canyon State
)
సమయం:-2007 winter & 2006 summer





PST కూడ IST(Indian Standard Time) మెయింటెయిన్ చేస్తూ కరెట్టుగా సూర్యాస్తమయం సమయానికి రెండు నిమిషాల ముందు చేరుకున్నాము సన్సెట్ పాయింటుకి...


అస్తమిస్తున్న సూర్యుని సైతం వెలుగుతో నింపగల మన స్నేహం..

గ్రాండ్ కెన్యన్ కి మొదటి సారి నా ప్రాన స్నెహితుడు అనిల్ తో పాటు ఇతర మిత్రులతో కలసి 2006 లో వెల్లాను.





నీడైనా మనం ఒకటే నంటూ నిలిచనా...


రెండవ సారి ఇల పెళ్ళి అవ్వగనే అలా చోటితో కలసి వేగస్,గ్రాండ్ కెనియన్ చుట్టేశాము.అప్పుడు వింటర్ ఆటకెక్కి కూర్చుంది.రాత్రి పడిన మంచు వేకువ జామున సూర్యుడి కిరనాలకి మెరుస్తూ మాకు స్వాగతం పలికింది..



అసలు ఇక్కడకి ఎలా చేరాం అంటే....@@@@@





దారి పొడవునా రోడ్డుకి రెండు వైపుల పచ్చని చెట్లూ,అందమైన జలపాతాలు లేవు:).మా గార్డన్ స్టేట్ నివ్ జెర్సి నుంచి అంత దూరం వెల్లింది అవి చూడడానికి కాదు కదా:).ప్రతి మైలు అర నిమిషంలో దాటేస్తూ రాకెట్టులా దూసుకొని వెల్తూ వుంటే ,కారు అద్దం లోంచి బయటకు చూసిన ప్రతి సారి తెలుగు సినెమాల్లోనీ పాటలన్ని ఇక్కడే తీస్తారెమో అనెంత సుందరంగా వుంది ఎడారి:).


దిస్నీ ల్యాండ్లో రైడ్లు ఎమన్న మిగిలిపొయాయ్ అంటే అవి ఇక్కడ ఎక్కేయమన్నట్టు గా రోలర్ కోస్టర్లని మరపించాయి రోడ్లు.





ఇక్కడ స్పీడ్ లిమిట్స్ చాలా ఎక్కువ.అంటే నేల తాకిన టైరు స్పీడు తగ్గని కారు!!



దారి మద్యలో,మా నెల్లూరు నుంచి మద్రాసుకి వెల్లేపుడు రోడ్డు పక్కన వుండే ధాబాల లా వున్న వో డైనర్ దగ్గర బ్రేక్ తీసుకున్నాము.మరో రెండు గంటలు డ్రైవ్ చేసి జురాసిక్ పార్క్ లాంటి ఎంట్రన్స్ దగ్గర టిక్కెట్టులు కొనుక్కోని కారు పార్క్ చెయ్యగానే...




కొన్ని వందల గుడులు ఒకే చోట ఆవీర్భవించినట్టుగా ,రెండు కల్లని నింపేసిన ఆ గ్రాండ్ కెన్యన్ ద్రుస్యాన్ని మా కెనాన్ కమెరా లో భందించేశాము.ఇంకొ గమ్మతయిన విషయం ఎంటంటే ఇక్కడ విష్ను టెంపుల్ అనే పాయింట్ వుంది.అక్కడ నుంచి కాస్త దూరం లో వున్న సికరం వైపు చూస్తే వో విష్ను మందిరం కనిపిస్తుంది.మందిరం అనుకొని లోపలకి వెల్లాలని ప్రయత్నిస్తే , మీరు గ్రాండ్ కెన్యన్ లో కాలు వేసినట్టే.అది సహజ సాదారనంగా ఎర్పడిన విష్ను మందిర ఆకారము మాత్రమే.విష్ను మాయా అంటే ఇదెనేమో...ఇంతలో వో పెద్ద శబ్దం.తలపైకెత్తి చూస్తే ఇంకెముంది హెలికాఫ్టర్:) ,అప్పుడు గుర్తుకు వచ్చింది దారిలో మేము వచ్చేపుడు చూసిన హెలిప్యాడ్/హెలికాఫ్టర్ రైడ్ పాయింట్.గ్రాండ్ కెన్యన్ అందాన్ని ఏరియల్ వివ్ లో చూసెయొచ్చు ...



స్కై వాక్

అన్నింటికంటే ఎత్తయిన సిఖరానికి చిట్టచివర అయిసుకాంత్తం అతుకున్నటుగా వుంటూంది స్కై వాక్ ..దాని పై నిలుచోని కిందకి చూస్తే వేగస్ లో వంద అంతస్తుల పైన ఎక్కిన స్ట్రాటోస్పియర్ రైడ్లు గుర్తుకు వచ్చాయి.గ్రాండ్ కెన్యన్ మద్యలో , నాజూకుగా ప్రవహిస్తున్న సన్నటి లిటిల్ కొలరెడో నది చూస్తుంటే చంద్రమండలంపైనుంచి హిందూ మహా సముద్రాన్ని చూస్తునట్టుగా అనిపిచింది.ఆంటే నేను చంద్రమండలానికి ఎప్పుడు వెల్లలెదు అనుకొండి.ఎదో మా యాంస్ట్రాంగ్ నాతో చెప్పింది మీకు చెప్పాను:)



ఐ-మ్యాక్స్
రామా రావ్ సినెమాలన్నీ చూసేసి సీతకి రాముడు ఏమవుతాడు అని అడిగినట్లు ,అన్ని తిరిగెశాం,అంతా చూసేశాం,కాని ఎమీ తెల్వద్ ? లా వునింది మా పరిస్తితి సయకాలం ఐ-మ్యాక్స్ థియేటర్ కి వెల్లే వరకు.గ్రాండ్ కెన్యన్ ఎలా ఏర్పడింది,ఏ తోక చుక్క వచ్చి కొట్టింది,ఎప్పుడు ఎలా కొట్టింది ,ఇక్కడకి మొదట చేరుకున్న రెడ్ ఇండియన్స్ ఎవరు?,వాల్లు ఎల అంతరించిపొయ్యరు..ఇలా మొత్తం కల్లకి నాలు గింతలు కట్టినట్లు(4డి) చూపిస్తే గాని మాకు అర్దం అవ్వలేదు:) ..సహజ సాదారనంగా ఏర్పడిన గ్రాండ్ కెన్యన్ మహాద్భుతం గురించి.ప్రక్రుతిలోని ఎనో అద్భుతాలలో అగ్ర స్తానం సంపదించిన గ్రాండ్ కెన్యన్ ని తనివితీరా చూసుకునే చాన్స్ చందమామ కి ఇచ్చేసి మేము కార్లు ఎక్కేశాము...



దారిలో మరో వింత చూసేశాం అండోయ్ ,అదే హోవర్ డ్యాం...


ఇంకెముంది నేల తాకిన టైరు స్పీడు తగ్గని కారు!!:)

నాని

Visit my new portal bharaththippireddy.net

Friday, January 23, 2009

డెలవేర్లో జల్సా:క్షణమే జీవితం,ఇ క్షణమే జీవీతం

Visit my new portal bharaththippireddy.net








క్షణమే జీవితం,ఇ క్షణమే జీవీతం...

క్షణమే శాస్వతం,ఇ క్షణమే శాస్వతం...

ఎవరితో నీ పోటి ? ,కలసిపో అందరితోటి...
తిరిగిరాని క్షణమునైన ,కొనగలవ డబ్బుతోటి..

ఇన్నాల్ల చదువు నీకు , పొల్చుకోవడమే నెర్పలేదె?
దేశాలన్ని తిరిగే నీకు, మానవత్వం ద్యాస లేదె

కలుపుకుంటే కలసిపో,కలసిపోతే కలుపుకో...
సారి అంటే క్షమించెయ్,తప్పు చేస్తే తలొంచెయ్..

కోట్లు పెట్టి ఇల్లు కొంటే చిన్ననాటి ప్రెమ నీద?
భయం తోనె దాచె సొమ్ము , రమ్మన నీతో రాద?

క్షనమే జీవితం,ఇ క్షనమే జీవీతం...
క్షనమే శాస్వతం,ఇ క్షనమే శాస్వతం...

తప్పు ఎప్పటికీ తెలుసుకొకపొతే?

వదిలెస్తే సరి,వున్నాడుగా హరి...:)


ఆలోచనే అన్నీ అయ్యినప్పుడు,అది మంచిదైతే పోలా .....


సమయం:-మరో సారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
లొకేషన్:- డెల్ డెల్ డెల్ డెల్ డెలవేర్...





వారం రొజుల ముందర ఇన్వైట్ పంపినప్పటికీ ,అనుకున్నదాని కంటే ఎక్కువ మంది వచ్చేయడంతో కాస్త ఆలస్యంగా ఆరంభమైన కార్యక్రమాలు బొమ్మలకొలువుతో మొదలయ్యి చిన్నారుల న్రుత్య ప్రదర్సనలతో ఊపందుకున్నాయి.


ఫోక్ డ్యాన్సుతో మొదలెట్టి హింది పాప్ సాంగ్లతో సరదాగా సాగి పోయాయి కార్యక్రమాలు.






ప్రాక్టీసుకి రెండు రొజులే వున్నపటికి మరో సారి కాలెజి రోజులు గుర్తు తెచ్చుకొంటూ జోష్ తెచ్చుకోని కొడితే కొట్టాలిరా అంటూ మొదలెట్టాను.




అందరు కలసి ఇంటిదగ్గర తయారు చేసుకొచ్చిన రక రకా వంటకాలు అంటే పూరిలు ,వడలు , పులిహోర,బెల్లం పొంగలి ,క్యరెట్ హల్వా ..అరటి పల్లెంలో వడ్డించేస్తుంటే , అమ్మ చేతి వంట గుర్తుకువచ్చేసింది అంటే నమ్మండి...



బ్రేక్ తరవాత బంగాలకాతం లో/తో మొదలయ్యి హ్యుర్రికేన్ లాగా మారి తన పాటలతో మమ్మలందరినీ ఉర్రూతలూగించారు.



ఆఖరిగా చోటీ సాయంతో(Choreography:) ప్రాక్టీసు చేసిన జెల్ జెల్ జెల్ జెల్ జల్సా రీమిక్స్ పాటకి డ్యాన్స్ చేస్తూ మరో సారి డెలవేర్ ప్రేక్షకుల హ్రుదయాలకి దగ్గర అయ్యాము!!




ఇలా కన్నుల పండుగలా జరిగాయండి మా సంక్రాంతి సంబరాలు.....


Think positive because thought propogates faster than light!!!.Now thats also energy:)

Related Articles


Florida Part 2:Miami The Paradise


UK Visitor Visa for non US Citizens in USA


Hasinis Day Out


Florida Part 1:Six days in Orlando

Texas:Take 8


F.E.A.R:-Forget Everything And Ride!!


Niagara Falls With West Coast Gang


Little Rock ,Arkansas


Wild Wild West 2


Austin Texas


First Ski


Kerala


Wild Wild West 1


Denver The Mile High City


Ocean City

Visit my new portal bharaththippireddy.net

Monday, January 12, 2009

బోగి/సంక్రాంతి శుభాకాంక్షలు(అరిసెలు,త్యాగలు,తాటికాయలు:) :-A new Beginning...

Visit my new portal bharaththippireddy.net



బోగి/సంక్రాంతి అనగానే నాకు గుర్తుకు వచ్చేది మా ఊరు,మా వాల్లు... ఎందుకంటే అది మాకు పెద్ద పండుగ,అవును చాల పెద్ద పండుగ...



ప్రతి సారి హాఫియర్లీ సెలవులని వేడి వేడిగా బోగితొనే ఆరంభించేవాల్లం , పాత వాటికన్నింటికీ వీడ్కోలు పలుకేస్తూ.....

వారం రొజుల ముందే ఎద్దుల బండి పై వచ్చిన తాటి ఆకులని ఇంటి వెనకాల బర్రెల కొట్టం లో పెట్టించేస్తారు నానమ్మ్మ.



అమ్మ చేసిన నేతి అరిసెలు ఎర్ర పంచలో , గడ్డి మీద గుమ గుమ లాడుతున్నాయి.

ఇంటి వెనకాల గోబర్ గ్యాస్ నుంచి మొదలెట్టి ,ఇంటి ముందు అవ్వ కూర్చునే గట్టు వరకు అంతా సుబ్రంగా కడిగించేశారు.ముగ్గు వేయటానికి విజయక్క,అమ్మ కల్యాప కూడ చల్లేశారు...

పొద్దునే నాలుగు గంటలకి మేడ పైన పడుకోనున్న మా పిల్ల కట్టని నిద్ర లేపెశాడు రంగన్న.

కొందరు తాటాకులతో, ఒకరు కిరసనాయిల్తో ,మరొకరు అగ్గిపెట్టితో రేడి అయ్యాము.తాటాకులు పోగు చేయగానే సుమన్ కిరసనాయిల్ పొసేసెడు.





ఇంట్లో వాల్లంతా చుట్టూ నిలుచుని మా వైపు చూస్తూండగానే, నేను తమ్ముడు మంట వెలిగిచేశాము.మాతో పాటు మా వీధిలో అందరూ మొదలెట్టారు.కొంత మంది పాత వస్తువులతో పాటూ పాత బట్టలు కూడా వెసేశారు.

ఎవరి బోగి మంట ఎక్కువ ఎత్తు లెగుస్తుంది అని పోటా పోటిగా తాటకులనుంచి,ఇంట్లో పాత సామను అంతా వెసేస్తు వుంటే ,నాన్న కొన్ని త్యాగలు ,తాటి కాయలు తెచ్చి మంటలో వెసెశారు.

మంట పెరగడానికెమొ అనుకున్నాము,కాని అవి మంట ఆగాక తినటానికి అని పొద్దునకి కాని తెలియలెదు మాకు:)



అందరిని వోడించేస్తూ,స్వర్గాన్ని తాకుతున్నట్లుగా ఎగసింది మా బోగి మంట.ఇ సంవస్తరం వర్షాలు బాగ కురిపించాలని ,పంటలు బాగ పండి మా వూరు పచ్చగా కల కల లాడలని ఇంద్రునికి చెప్పేసింది....

మిగతా నిద్రా కార్యక్రమం కొనసాగించి కిందికి రాగానే....

బోగి స్పెషల్ దొశలు,వడలు మరియు నాటు కోడి కూర:)...అవి తినేయగానే డెసర్ట్ రూపంలో పొద్దున నాన్న గారు మంటల్లో వేసిన త్యాగలు ,కాల్చిన పండు తాటికాయలు.పండగ చేసుకోవడం అంటే అది అనేలా కుమ్మెశాం:)



ఇక ఆరోజు నుంచి ఇంటి ముంగిట ముగ్గుని దాటుకుంటూ మామూల్లకి వచ్చే వాల్లతో,అరిసెలు కోసం వచ్చే వాల్లు,వడ్ల కోసం వచ్చే వాల్లతో వీది/ఊరు, పండగ వాతావరనంలో మునిగి పోతుంది.

అంతరించిపోతున్న కట్టుబాట్లు , మరచిపోతున్న ఆచారాలతో పరుగులు తీస్తున్న నగర వాసులతో పాటు ఇంకెమన్నామిగిలి వుంది అంటే అది మా పల్లెటూరి లాంటి పల్లెటూర్లలోనే.....


So leave all those old thoughts/worries and renew yourself!!

Happy Boagi/Sankranthi/Pongal!!

A New Beginning,

నాని

Visit my new portal bharaththippireddy.net

Saturday, January 10, 2009

Social Security Number - Step 1

Visit my new portal bharaththippireddy.net


లొకేషన్:- నివ్ జెర్సి

సమయం:-అప్పుడప్పుడే జెట్ ల్యాగ్ వదిలించుకుంటున్న నన్ను మా కంపెని రిసెప్షనిష్టు పట్టుకొని ఇసెలిన్ S.S.N ఆఫీసుకి తీసుకువెల్లిన వేల....

Naniz Disclaimer:)

-------------------------------------------------------------------------------------
నాకు తెలిసిందల్లా పంచుకోవడం స్నెహమైనా , సమాచారమయినా....
నేను అయిదు ఫ్లోర్లు ఎక్కితే , నీకు ఎలివేటర్ చూపలేక పోయినా ఆ అయిదు మెట్లూ సులువు చెయ్యాలన్నదే ఈ ప్రయత్నం...
తప్పులుంటే మన్నించండి , కుదిరితే సరిచేసేయండి ....
-------------------------------------------------------------------------------------



As per the social security office...

"You need a Social Security number to get a job, collect Social Security benefits and receive some other government services. But you don't often need to show your Social Security card."

You need an S.S.N to open a bank account..

You need an S.S.N to get your pay stub running...

You need an S.S.N to apply for a drivers license..

You need an S.S.N to breath,drink,eat.....

etc etc:)

Form SS-5 is the first form you would fill once you land in USA and before you start working.Thats because you need an SSN before you work in U.S.A "legally".And to get an S.S.N you need to fill the form mentioned above,go to the S.S.N Office close by and submit the same by providing two forms of IDs,your passport and Visa should do.

I guess the federal government computers are still mainframe based .Sometimes it might take several weeks before the SSN office gets updated information about your immigration status from the port of entry:).Due to this the officer S.S.N office might ask you come back later if they dont see the information on their system.

If you are lucky and if they do see your information ,you will get your S.S.N in 1 week to 5 weeks time depending on the place/office you have applied.In new jersey and in peak season (jan till april) it typically take a month to get an S.S.N due to the number of consultants landing every day.But dont worry most of our consultancies will get you started with out an S.S.N:).

మీకు తెలుసా?

ఇంత బిల్డ్ అప్ ఇచ్చారు కదా ,S.S.N కాదు కదా ,కనీసం వీసా లేకుండానే ఎందరో విచ్చలవిడిగా పనిచేస్తుంటారు.పోయిన సంవత్సరం చేసిన సర్వేలో ఫోర్ మిల్లియన్ , అంటే నలభై లక్షల మంది ఇలాంటి వారు వున్నారని తేలింది.

మరి ఇలాంటి ఇల్లీగల్ వర్కర్స్ లేకపొతే ఇంటి కప్పుల వేయడం నుంచి వంట కప్పులు కడిగే వరకు పనులన్నీ ఎవరు చేస్తారు ?

America not only runs on Dunkin Coffee,but also on illegal workforce:)

నాని

Visit my new portal bharaththippireddy.net

Monday, January 5, 2009

ఆస్టిన్ పవర్స్ c/o టెక్సస్

Visit my new portal bharaththippireddy.net



శానాంటొనియో రివర్ వాక్





గూటికి చేరుకుంటున్న పక్షులని స్వాగతిస్తూ చిన్ని చిన్ని గువ్వల కేరింతలు ఒ పక్క...

మాతో పాటు నడచి వస్తున్నట్టుగా ప్రవహిస్తున్న శానాంటొనియో నది మరోపక్క...

సమయమే తెలియనివ్వని తోడు నా పక్క...






ఆస్టిన్ నదికి తోడు గా , దానిలో నీడలా ఆకశాన్నంటే భవనాలతో వెలిగిపొతున్న ఆస్టిన్ దౌంటౌన్...



చిన్నపుడు జగ దేక వీరుడు అతిలోక సుంధరి సినెమాలో చూసిన గ్రుహలని మరపించిన ఆస్టిన్ కేవ్స్(caravans)..



మౌంట్ బర్నెట్ నుంచి లేక్ ఆస్టిన్..ఎలా ఉంది?


వింటర్ అన్నాక స్నో, సమ్మర్ అన్నాక గ్రిల్ తప్పవు మరి...
చికెన్ నుంచి రొయ్యల వరకు దేనికైనా రేడి అంటూ కుమ్మేశాం..


సీ వరల్డ్..మరొ ప్రపంచమే మరి...



బ్రమ్మి ని గుర్తు తెప్పించే రైడ్ల తో పాటు...


సీ లయన్స్ షో..



చాపలని ఎలా దొంగలించాలో చూపించే సముద్రపు సిమ్హాలు...

షాము షో...

ఆకశమే మా హద్దు అన్నట్టు ఎగిరి పడుతున్న తెల్ల తిమింగలాల విన్యాసాలు...



Dolphin is mans best friend అనిపించేలా డాల్ఫిన్లు...


ఆస్టిన్ సఫారి


జింక నుంచి జీబ్రాల వరకు...
ఆస్ట్రిచ్ నుంచి అందమైన అడవి బర్రె వరకు...:) అందరు మా వింధుని స్వీకరించారు...


జీబ్రా తెలుపు, మచ్చలు నలుపు,లెదు అది నలుపు ,మచ్చలు తెలుపు అని మేము గొడవపడుతూ వుంటే,జీబ్రాలు మటుకు

వాటి పని అవి చేసుకొంటూ మేము తెచ్చిన ప్యాకెట్లు కాలి చేసెశాయి..



స్క్వాష్ నుంచి సిమ్మింగ్ వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా...





దాక్కొని వున్న చిన్ని క్రిష్నుడుని వెతుకుతునట్టుగా నెమల్లు,మనసుని వికసింపజేసే జలపాతం....



అదో బ్రుందావనం,అదే 'బర్సనా ధం'

ఇలా ఎన్నో ఎన్నెనో ఆస్టిన్ పవర్స్...




వీటన్నింటితో పాటు మా అంజలి అంజలి అంజలీ....







నాని

Visit my new portal bharaththippireddy.net

Tuesday, December 30, 2008

ఎక్కడ వుంది ఆనందం? :- 2009 నూతన సంవత్సర సుభాకాంక్షలు

Visit my new portal bharaththippireddy.net


సమయం:-2008 కి వీడ్కోలు పలుకుతూ 2009 కోసం ఎదురు చూస్తూ.....





ఎక్కడో లేదు రా ఆనందం....
నీలోనే వుంది రా ప్రపంచం...
అది తెలుసుకోవడమే రా జీవితం..
తెలుసుకున్న వాడికదే శాస్వతం....


ఇల్లు వదలి స్కూలుకెల్తే ,మాస్టర్స్ డిగ్ర్రితో కలిసొస్తుందా?

బైకులంటు,ప్రేమలంటే ,మొదటి రోజు సినెమాలో వుందా?

జాబు వచ్చి ,రెక్కలొంచితే,డబ్బుతోనె పెరుగుతుందా?

బారు కెల్లి బీరు కొట్టిన స్నేహం వెనుక ఆగి వుందా?

ఫ్లైటు ఎక్కి అలలు దాటితే , ఏడు వింతలలో దాగి వుందా?

ఎక్కడో లేదు రా ఆనందం....
నీలోనే వుంది రా ప్రపంచం...
అది తెలుసుకోవడమే రా జీవితం..
తెలుసుకున్న వాడికదే శాస్వతం....

When you can share others happiness ,There will be no moment of sadness.

And when u can't, All you are left with is.....

Happy New Year!!


Inspired by her,

నాని

Visit my new portal bharaththippireddy.net

Saturday, December 6, 2008

ప్రమోషన్:-కార్ నుంచి సైకిల్ కి...

Visit my new portal bharaththippireddy.net


లొకేషన్:-దర్గామిట్ట నెల్లూరు...

సమయం:-బిజి బిజిగా ఆఫిసు నుంచి వచ్చి హరి హరిగా కారు పార్కు చేసిన నన్ను,సైకెల్లలో ఎదురొచ్చిన ఇద్దరు చిన్నారులు పలకరిస్తే...

"A journey through my beautiful childhood..."



ఆనందం ,అది శినివారం హాల్ఫ్ డే,ఇంటికి త్వరగా వెల్లి పోవొచ్చనా?

సంతోషం, ఇంటికి వెల్లగానే ఊరినుంచీ తాతయ్య వాల్లు వచ్చి వుంటారనా?

ఉత్సాహం ,ఈసారి వచ్చినప్పుడు నాకు టు వీలర్ కొనిస్తామని తాతయ్య వాల్లు చెప్పారనా?





లలితక్క బడి గంఠ కొట్టేసింది ,మా st joseph స్కూల్ అషోకా చెట్ల మద్యలో తమ్ముడితో కలసి గేట్ దగ్గరకి నడుస్తూ వుంటే ఎదురుగ్గా జార్జి... 'George of the jungle' కాదు,మా డ్రైవర్ జార్జ్.జార్జి మొహంపై కాల్గేట్ స్మైల్.దాని అర్దం మాకు తెలుసు.పరిగెత్తుకుంటూ మా జీపు వైపు వెల్లాము నేను తమ్ముడు.జీపు లోంచి దిగగానే ఇద్దరినీ చెరొక చేతులో ఎత్తేసుకున్నారు తాతయ్య.జేబు లోంచి ఫైస్టార్ చాక్లేట్లు తీసిచ్చారు.ఎవరు ముందు తినెస్తార అని నెను తమ్ముడు నెమ్మదిగా తింటూ వుంటే,ఇల్లు దగ్గర పడింది. జీపు ఇంటివైపుకి కాకుండా నేరుగా పోనిచ్చాడు జార్జి.ఎక్కడికి వెల్తున్నామో తెలియకపోయిన,ఎందుకు వెల్తున్నమో తెలియడంతో ఇంక మా మనస్సు వర్షా కాలం పెన్నా నదిలా ఆనందంతో ఉరకలు వేసింది.

RTC
బస్ స్తాండు,మెడ్రాస్ బస్ స్టాండు ,గాంధి బొమ్మా దాటేయగానే జీపుని ట్రంక్కు రోడ్డుకి కుడి వైపున నిలిపాడు జార్జి. షాపులోపలికి వెల్లగానె కుడివైపు హీరో సైకిల్లు,యెడమ వైపు B.S.A SLR సైకిల్లు కనిపించాయి.తతయ్య చేయి పట్టుకోని కాస్త లోపలకి వెల్లగానే కుడి వైపు అమ్మాయిల ద్వి చక్ర వాహనాలు కనిపించాయి ,అంటే వాటికి సీట్కి హ్యాండిల్ కి మద్య కమ్మి లేదన్నమాట. చిన్నపిల్లలకి కొత్తగా వచ్చిన సైకిల్లు ఇ పక్క వున్నాయి అండి, అన్నాడు షాపు అతను .అటు వైపు తిరగగానే ...

మునుపెప్పుడూ చూడలేదు ....

రెండు నేరేడు పండ్ల లాంటి చక్రాలు ,ఒక మల్లె తీగ లాంటి హ్యండిలు ,వెనక ఒక క్యరెజి ....

అంటే అన్ని సైకిల్లకి ఇలనే వుంటాయి అనుకోండి.కాని మీరు అర్దం చేసుకోవలి..."Luv at first sight" మరి....:)

అప్పుడు మన అలోచన ఇలా వుండేది..

పొడువాటి సీటు..నేను తమ్ముడు కూర్చొవచ్చు...
వెనక క్యరియర్ వుంది..క్రికెట్టు బ్యాటు పెట్టుకోవచ్చు...
సైజు చిన్నగా వుంది సైకిల్ గ్యాప్లో దూరేయొచ్చు...

చిన్న పిల్లోడిలా ఆలోచించా కదా:).మరి అప్పుడు నేను ఒకటో తరగతి చదువుతున్నాను...

మా వాడి హైటుకి అది కాస్త పెద్దదవుతుందెమొ ,కాల్లు అందుతాయి అంటారా?.లెదండి,బ్యలెన్స్ చెయ్యడం నెర్చుకునే వరకూ వెనక చక్రానికి రెండు వైపులా రెండు వీల్స్ని అమరుస్తాము.అవి మీ వాడు కాలు అందకపోయినా పడకుండా ఆపుతాయి.తాతయ్య లాంత్తరులా వెలిగి పోతున్న నా మొహాన్ని చూడగానే , జార్జి నా బైక్ ని జీప్ ఎక్కించాడు...




జీపు దిగగానే ఎదురుగ్గా షెడ్డులో నా టయొటా .నాకు రెండవ పుట్టినరోజు నాడు పెదనాన్న ఇచ్చిన బహుమతి అది.ఇంజిన్ లేక పోయినా,నెల్లూరిలో మా ఇంటి దగ్గర ,వింజమూరిలో అది తిరగని సందంటూ లేదు.రెపటి నుంచి నీ భాద్యత తమ్ముడిది అనుకొంటూండగానే..జార్జి నా టూ వీలర్ దించశాడు.

అమ్మ హ్యండిల్కి బొట్టు పెట్టి, పచ్చ జెండా వూపేయ గానే ,నాన్న జాగ్రత్తలు చెబుతూ ఫొటోలు తీస్తుంటే,వెనుక నుంచి తమ్ముడు నెడుతూ సందు చివరిదాక వెల్లాక వెగిరి వెనకాల క్యరీయర్ పైన కూర్చున్నాడు.



టీవిలో స్ట్ర్రిట్-హాక్ సీరియల్ చూసి రాత్రి పగలు అని తేడా లెకుండ ,మెయిన్ రోడ్డు, బైపాస్ రోడ్డు అని బేదం లేకుండా తిరిగేశాం నేను నా కో-పైలట్(తమ్ముడు). వీల్స్ వున్నంత కాలం అమ్మ వంట సామాను నుంచీ మా క్రికెట్టు బాల్ల వరకూ అన్నింటికీ మా స్ట్రీట్-హాక్ పైనే వెల్లేవాల్లం.

తాతయ్య వూరికి వెల్లిపోయి రెండు వారాలు అయ్యింది ,నాన్న నేను బాగ తొకుతున్ననాని ,తొక్కలో వీల్స్ తీసేశారు.కాస్త దూరం నెట్టి వదిలేశారు .సందు చివరదాక వెల్లిపోయను....రోడ్డు పైకి ఎక్కుదాం అంటే ఎదురుగ్గా వో కారు వస్తోంది.ఆగాలంటే కాల్లు అందట్లేదు ,కుడి పక్క చిన్న కాలువ ,యెడం పక్క వో కరెంటు స్తంభం .నాన్న పరిగెడుతున్నారు నాకేసి దూరం నుంచి.ఇంతలో బ్రేకు వేసి కరెంటు స్తంభానికి వుండే సిమెంటు పునాది రాయి పై కాలు పెట్టి అపేశాను .హీరోలా నిలుచున్నాను నాన్న గారు వచ్చి దింపే వరకు.లోపల షేక్ అయినా బయట బ్రేక్ వెయ్యడం అంటే ఇదే అంటూ ఇంటికి తీసుకెల్లారు.....

ఇక ఆరోజు నుంచీ స్కూలికి వెల్లేముందు పది ట్రిప్పులు, వచ్చాక అలసిపొయాం అనేంత వరకూ తిరుగుడే తిరుగుడు మా స్ట్రీట్-హాక్ పైన.ఎంత తిరిగాం అంటే మా తిరుగుడు నచ్చి N.T.R గారు అయన పార్టికి మా సైకెల్ గుర్తు పెట్టేసుకున్నారు...

ఇలా మా తాత గారి రెకమెండేషన్-తో నాకు కార్ నుంచీ సైకిల్ కి ప్రమోషన్ వచ్చేసిందన్నమాట:)

నాని


Visit my new portal bharaththippireddy.net