Blessed by the absolute,Inspired by my family and Influenced by my teachers-While I explore and learn more in the career development, personal development and self consciousness spaces I will try to creatively express my thoughts,work and experiences through my blog, videos etc to help others while helping myself.
సమయం:-మరో సారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
లొకేషన్:- డెల్ డెల్ డెల్ డెల్ డెలవేర్...
వారం రొజుల ముందర ఇన్వైట్ పంపినప్పటికీ ,అనుకున్నదాని కంటే ఎక్కువ మంది వచ్చేయడంతో కాస్త ఆలస్యంగా ఆరంభమైన కార్యక్రమాలు బొమ్మలకొలువుతో మొదలయ్యి చిన్నారుల న్రుత్య ప్రదర్సనలతో ఊపందుకున్నాయి.
ఫోక్ డ్యాన్సుతో మొదలెట్టి హింది పాప్ సాంగ్లతో సరదాగా సాగి పోయాయి కార్యక్రమాలు.
ప్రాక్టీసుకి రెండు రొజులే వున్నపటికి మరో సారి కాలెజి రోజులు గుర్తు తెచ్చుకొంటూ జోష్ తెచ్చుకోని కొడితే కొట్టాలిరా అంటూ మొదలెట్టాను.
అందరు కలసి ఇంటిదగ్గర తయారు చేసుకొచ్చిన రక రకా వంటకాలు అంటే పూరిలు ,వడలు , పులిహోర,బెల్లం పొంగలి ,క్యరెట్ హల్వా ..అరటి పల్లెంలో వడ్డించేస్తుంటే , అమ్మ చేతి వంట గుర్తుకువచ్చేసింది అంటే నమ్మండి...
బ్రేక్ తరవాత బంగాలకాతం లో/తో మొదలయ్యి హ్యుర్రికేన్ లాగా మారి తన పాటలతో మమ్మలందరినీ ఉర్రూతలూగించారు.
ఆఖరిగా చోటీ సాయంతో(Choreography:) ప్రాక్టీసు చేసిన జెల్ జెల్ జెల్ జెల్ జల్సా రీమిక్స్ పాటకి డ్యాన్స్ చేస్తూ మరో సారి డెలవేర్ ప్రేక్షకుల హ్రుదయాలకి దగ్గర అయ్యాము!!
ఇలా కన్నుల పండుగలా జరిగాయండి మా సంక్రాంతి సంబరాలు.....
Think positive because thought propogates faster than light!!!.Now thats also energy:)
బోగి/సంక్రాంతి అనగానే నాకు గుర్తుకు వచ్చేది మా ఊరు,మా వాల్లు... ఎందుకంటే అది మాకు పెద్ద పండుగ,అవును చాల పెద్ద పండుగ...
ప్రతి సారి హాఫియర్లీ సెలవులని వేడి వేడిగా బోగితొనే ఆరంభించేవాల్లం , పాత వాటికన్నింటికీ వీడ్కోలు పలుకేస్తూ.....
వారం రొజుల ముందే ఎద్దుల బండి పై వచ్చిన తాటి ఆకులని ఇంటి వెనకాల బర్రెల కొట్టం లో పెట్టించేస్తారు నానమ్మ్మ.
అమ్మ చేసిన నేతి అరిసెలు ఎర్ర పంచలో , గడ్డి మీద గుమ గుమ లాడుతున్నాయి.
ఇంటి వెనకాల గోబర్ గ్యాస్ నుంచి మొదలెట్టి ,ఇంటి ముందు అవ్వ కూర్చునే గట్టు వరకు అంతా సుబ్రంగా కడిగించేశారు.ముగ్గు వేయటానికి విజయక్క,అమ్మ కల్యాప కూడ చల్లేశారు...
పొద్దునే నాలుగు గంటలకి మేడ పైన పడుకోనున్న మా పిల్ల కట్టని నిద్ర లేపెశాడు రంగన్న.
కొందరు తాటాకులతో, ఒకరు కిరసనాయిల్తో ,మరొకరు అగ్గిపెట్టితో రేడి అయ్యాము.తాటాకులు పోగు చేయగానే సుమన్ కిరసనాయిల్ పొసేసెడు.
ఇంట్లో వాల్లంతా చుట్టూ నిలుచుని మా వైపు చూస్తూండగానే, నేను తమ్ముడు మంట వెలిగిచేశాము.మాతో పాటు మా వీధిలో అందరూ మొదలెట్టారు.కొంత మంది పాత వస్తువులతో పాటూ పాత బట్టలు కూడా వెసేశారు.
ఎవరి బోగి మంట ఎక్కువ ఎత్తు లెగుస్తుంది అని పోటా పోటిగా తాటకులనుంచి,ఇంట్లో పాత సామను అంతా వెసేస్తు వుంటే ,నాన్న కొన్ని త్యాగలు ,తాటి కాయలు తెచ్చి మంటలో వెసెశారు.
మంట పెరగడానికెమొ అనుకున్నాము,కాని అవి మంట ఆగాక తినటానికి అని పొద్దునకి కాని తెలియలెదు మాకు:)
అందరిని వోడించేస్తూ,స్వర్గాన్ని తాకుతున్నట్లుగా ఎగసింది మా బోగి మంట.ఇ సంవస్తరం వర్షాలు బాగ కురిపించాలని ,పంటలు బాగ పండి మా వూరు పచ్చగా కల కల లాడలని ఇంద్రునికి చెప్పేసింది....
మిగతా నిద్రా కార్యక్రమం కొనసాగించి కిందికి రాగానే....
బోగి స్పెషల్ దొశలు,వడలు మరియు నాటు కోడి కూర:)...అవి తినేయగానే డెసర్ట్ రూపంలో పొద్దున నాన్న గారు మంటల్లో వేసిన త్యాగలు ,కాల్చిన పండు తాటికాయలు.పండగ చేసుకోవడం అంటే అది అనేలా కుమ్మెశాం:)
ఇక ఆరోజు నుంచి ఇంటి ముంగిట ముగ్గుని దాటుకుంటూ మామూల్లకి వచ్చే వాల్లతో,అరిసెలు కోసం వచ్చే వాల్లు,వడ్ల కోసం వచ్చే వాల్లతో వీది/ఊరు, పండగ వాతావరనంలో మునిగి పోతుంది.
అంతరించిపోతున్న కట్టుబాట్లు , మరచిపోతున్న ఆచారాలతో పరుగులు తీస్తున్న నగర వాసులతో పాటు ఇంకెమన్నామిగిలి వుంది అంటే అది మా పల్లెటూరి లాంటి పల్లెటూర్లలోనే.....
So leave all those old thoughts/worries and renew yourself!!
సమయం:-అప్పుడప్పుడే జెట్ ల్యాగ్ వదిలించుకుంటున్న నన్ను మా కంపెని రిసెప్షనిష్టు పట్టుకొని ఇసెలిన్ S.S.N ఆఫీసుకి తీసుకువెల్లిన వేల....
Naniz Disclaimer:)
-------------------------------------------------------------------------------------
నాకు తెలిసిందల్లా పంచుకోవడం స్నెహమైనా , సమాచారమయినా....
నేను అయిదు ఫ్లోర్లు ఎక్కితే , నీకు ఎలివేటర్ చూపలేక పోయినా ఆ అయిదు మెట్లూ సులువు చెయ్యాలన్నదే ఈ ప్రయత్నం...
తప్పులుంటే మన్నించండి , కుదిరితే సరిచేసేయండి ....
-------------------------------------------------------------------------------------
As per the social security office...
"You need a Social Security number to get a job, collect Social Security benefits and receive some other government services. But you don't often need to show your Social Security card."
You need an S.S.N to open a bank account..
You need an S.S.N to get your pay stub running...
You need an S.S.N to apply for a drivers license..
You need an S.S.N to breath,drink,eat.....
etc etc:)
Form SS-5 is the first form you would fill once you land in USA and before you start working.Thats because you need an SSN before you work in U.S.A "legally".And to get an S.S.N you need to fill the form mentioned above,go to the S.S.N Office close by and submit the same by providing two forms of IDs,your passport and Visa should do.
I guess the federal government computers are still mainframe based .Sometimes it might take several weeks before the SSN office gets updated information about your immigration status from the port of entry:).Due to this the officer S.S.N office might ask you come back later if they dont see the information on their system.
If you are lucky and if they do see your information ,you will get your S.S.N in 1 week to 5 weeks time depending on the place/office you have applied.In new jersey and in peak season (jan till april) it typically take a month to get an S.S.N due to the number of consultants landing every day.But dont worry most of our consultancies will get you started with out an S.S.N:).
మీకు తెలుసా?
ఇంత బిల్డ్ అప్ ఇచ్చారు కదా ,S.S.N కాదు కదా ,కనీసం వీసా లేకుండానే ఎందరో విచ్చలవిడిగా పనిచేస్తుంటారు.పోయిన సంవత్సరం చేసిన సర్వేలో ఫోర్ మిల్లియన్ , అంటే నలభై లక్షల మంది ఇలాంటి వారు వున్నారని తేలింది.
మరి ఇలాంటి ఇల్లీగల్ వర్కర్స్ లేకపొతే ఇంటి కప్పుల వేయడం నుంచి వంట కప్పులు కడిగే వరకు పనులన్నీ ఎవరు చేస్తారు ?
America not only runs on Dunkin Coffee,but also on illegal workforce:)
లలితక్కబడిగంఠకొట్టేసింది ,మా st joseph స్కూల్ అషోకా చెట్ల మద్యలో తమ్ముడితో కలసిగేట్దగ్గరకినడుస్తూవుంటేఎదురుగ్గాజార్జి... 'George of the jungle' కాదు,మాడ్రైవర్జార్జ్.జార్జిమొహంపైకాల్గేట్స్మైల్.దానిఅర్దంమాకుతెలుసు.పరిగెత్తుకుంటూమాజీపువైపువెల్లామునేనుతమ్ముడు.జీపులోంచిదిగగానేఇద్దరినీచెరొకచేతులోఎత్తేసుకున్నారుతాతయ్య.జేబులోంచిఫైస్టార్చాక్లేట్లుతీసిచ్చారు.ఎవరుముందుతినెస్తారఅనినెనుతమ్ముడునెమ్మదిగా తింటూవుంటే,ఇల్లుదగ్గరపడింది. జీపుఇంటివైపుకికాకుండానేరుగాపోనిచ్చాడుజార్జి.ఎక్కడికివెల్తున్నామో తెలియకపోయిన,ఎందుకువెల్తున్నమోతెలియడంతోఇంకమామనస్సు వర్షా కాలం పెన్నానదిలా ఆనందంతో ఉరకలు వేసింది.
RTC బస్స్తాండు,మెడ్రాస్బస్స్టాండు ,గాంధిబొమ్మాదాటేయగానేజీపుని ట్రంక్కు రోడ్డుకి కుడి వైపున నిలిపాడుజార్జి. షాపులోపలికివెల్లగానెకుడివైపుహీరోసైకిల్లు,యెడమవైపు B.S.A SLR సైకిల్లుకనిపించాయి.తతయ్యచేయిపట్టుకోనికాస్తలోపలకివెల్లగానేకుడివైపు అమ్మాయిల ద్విచక్రవాహనాలుకనిపించాయి ,అంటేవాటికిసీట్కి హ్యాండిల్ కిమద్య కమ్మి లేదన్నమాట. చిన్నపిల్లలకికొత్తగావచ్చిన సైకిల్లు ఇపక్క వున్నాయి అండి, అన్నాడు షాపుఅతను .అటువైపుతిరగగానే ...
మునుపెప్పుడూ చూడలేదు ....
రెండు నేరేడు పండ్ల లాంటి చక్రాలు ,ఒక మల్లె తీగ లాంటి హ్యండిలు ,వెనక ఒక క్యరెజి ....
అంటే అన్ని సైకిల్లకి ఇలనే వుంటాయి అనుకోండి.కాని మీరు అర్దం చేసుకోవలి..."Luv at first sight" మరి....:)
అప్పుడు మన అలోచన ఇలా వుండేది..
పొడువాటి సీటు..నేను తమ్ముడు కూర్చొవచ్చు...
వెనక క్యరియర్ వుంది..క్రికెట్టు బ్యాటు పెట్టుకోవచ్చు...
సైజు చిన్నగా వుంది సైకిల్ గ్యాప్లో దూరేయొచ్చు...
చిన్న పిల్లోడిలా ఆలోచించా కదా:).మరి అప్పుడు నేను ఒకటో తరగతి చదువుతున్నాను...
మావాడిహైటుకి అదికాస్తపెద్దదవుతుందెమొ ,కాల్లుఅందుతాయిఅంటారా?.లెదండి,బ్యలెన్స్చెయ్యడంనెర్చుకునేవరకూవెనకచక్రానికిరెండువైపులారెండువీల్స్నిఅమరుస్తాము.అవిమీవాడుకాలుఅందకపోయినాపడకుండాఆపుతాయి.తాతయ్య లాంత్తరులా వెలిగి పోతున్న నా మొహాన్ని చూడగానే , జార్జి నా బైక్ ని జీప్ ఎక్కించాడు...
టీవిలో స్ట్ర్రిట్-హాక్ సీరియల్ చూసి రాత్రి పగలు అని తేడా లెకుండ ,మెయిన్ రోడ్డు, బైపాస్ రోడ్డు అని బేదం లేకుండా తిరిగేశాం నేను నా కో-పైలట్(తమ్ముడు). వీల్స్ వున్నంత కాలం అమ్మ వంట సామాను నుంచీ మా క్రికెట్టు బాల్ల వరకూ అన్నింటికీ మా స్ట్రీట్-హాక్ పైనే వెల్లేవాల్లం.
తాతయ్య వూరికి వెల్లిపోయి రెండు వారాలు అయ్యింది ,నాన్న నేను బాగ తొకుతున్ననాని ,తొక్కలో వీల్స్ తీసేశారు.కాస్త దూరం నెట్టి వదిలేశారు .సందు చివరదాక వెల్లిపోయను....రోడ్డు పైకి ఎక్కుదాం అంటే ఎదురుగ్గా వో కారు వస్తోంది.ఆగాలంటే కాల్లు అందట్లేదు ,కుడి పక్క చిన్న కాలువ ,యెడం పక్క వో కరెంటు స్తంభం .నాన్న పరిగెడుతున్నారు నాకేసి దూరం నుంచి.ఇంతలో బ్రేకు వేసి కరెంటు స్తంభానికి వుండే సిమెంటు పునాది రాయి పై కాలు పెట్టి అపేశాను .హీరోలా నిలుచున్నాను నాన్న గారు వచ్చి దింపే వరకు.లోపల షేక్ అయినా బయట బ్రేక్ వెయ్యడం అంటే ఇదే అంటూ ఇంటికి తీసుకెల్లారు.....
ఇక ఆరోజు నుంచీ స్కూలికి వెల్లేముందు పది ట్రిప్పులు, వచ్చాక అలసిపొయాం అనేంత వరకూ తిరుగుడే తిరుగుడు మా స్ట్రీట్-హాక్ పైన.ఎంత తిరిగాం అంటే మా తిరుగుడు నచ్చి N.T.R గారు అయన పార్టికి మా సైకెల్ గుర్తు పెట్టేసుకున్నారు...
ఇలా మా తాత గారి రెకమెండేషన్-తో నాకు కార్ నుంచీ సైకిల్ కి ప్రమోషన్ వచ్చేసిందన్నమాట:)
కొండ పైకి వచ్చేసాము అనగానే జేంస్ బాండు సినెమాలో హెలికాఫ్టర్లోంచీ దూకి నట్టూ దూకమన్నారు మమ్మల్ని.భయం భయంగా దూకేశాం .ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ,మనం పడినా ఫర్లేదు మిగతా వాల్ల పైన పదకూడదు,పడేయకూడదు అని అనుకుంటూ జై చిరంజీవా,జగదేక వీరా అంటూ:) మొదలెట్టాము మా స్కీయింగ్.చల్ల గలిలో అలా దూసుకొని కిందకి వెల్తుంటే, ఇందాక దాటి వచ్చామే సరస్సు అదే కనిపిస్తోంది ఎదురుగ్గా.కాల్లు హ్యండ్ ఇచ్చి త్రికోనం ఆకరం తీసుకొకపొతే స్కీలు ఆగక ,వెల్లి దంట్లో ఎక్కడ పడిపొతమో అనే భయంతో మాకు మెమే ముందే పడిపొయాం మొదటి రెండు ట్రిప్లలో:).దారి పొడవునా అక్కడక్కాడ గార్డ్లు నిలుచోని వున్నారు.పడకుండా ఆపటానికి కాదు ,పడిన వారిని లేపటాకిని:).మొదటి నాలుగు సార్లు పడుతూ లేస్తూ మెల్లి మెల్లిగా లిఫ్టు ఎక్కుతూ కస్ట పడినా ,అయిదో రౌండు కల్లా లిఫ్టుతో పోటి పడడం ఆరంబించాము:)...
ఒకరితో ఒకరు పోటి పడే లెవల్కి చేరుకోని బాండులా స్టైలుగా స్కీ చెయ్యడం మొదలెట్టాము.చిన్నపిల్లలు బోర్డు స్కీ అంటే ఒక్కటే పెద్ద సైజు స్కీ చేస్తూ వుంటే,మేము వచ్చేసారి చేస్తాములేరా అనుకుంటూ సమయం తెలియనంతగా మునిగిపోయి వేసేశాము రౌండ్ల పై రౌండ్లు...
చీకటి పడ్డాక ఫ్లడ్ లైట్లలలో కూడా కాసేపు స్కీ చేసేశాక ఇంటికి వెల్లాలని అనిపించక పోయినా ,మల్లీ రావలి అంటే ఇప్పుడు వెల్లాలి కదా అనుకుంటూ బయలుదేరాం ఇంటికి:).మరవలేని అనుభూతి,మరపు రాని అయ్యొ-డెక్స్ నెప్పులతో గూటికి చేరుకున్నాము:)
లొకేషన్:-డెలావేర్
సమయం:-దసరా,దీపావళి పండుగలని గనంగా జరుపుకొనేందుకు తెలుగు వారంతా ఏకమయిన వేల....
నెలరోజుల నుంచీ ఇల్లు,కారు,ఆఫీసు అని తెడా లెకుండా KBL పాటలు వింటూన్న సమయం అది.జీవి నాలుగురాటింగు ఇచాడనే కాదు ,మా నివ్ జెర్సీ నవ యువ తార వరున్ సినిమా చూడాలని వారాంతం వరకూ ఆగలేకగురువారమే బయలుదేరాము డెలవేర్లో ప్రివివ్ షోక్ చూడాలని ఫ్యమిలీ మరియూ మిత్రులతో...
సమయానికి మేము హాలు చేరెను...సమయానికి...:)
టికెట్లతో పాటు పాప్-కార్న్ కూడ కొనుక్కోని లోపలకి వెల్లాము.Actually వెల్లబొయే లోపే వైట్ అండ్ వైట్ దుస్తులుదరించిన నలుగురు వ్యక్తులు మమ్మల్ని అడ్డుకున్నారు.విషయం ఎంటంటే డెలావేర్ తెలుగు అస్సొసియేషన్ వారు దిపావళి ,దసరాపండుగలను గనంగా జరుపుకుంటున్నారంట,మెమంతా రావాలంట..:).
వెంటనే నేను ,కల్చరల్ ప్రోగ్రాంస్ ఎమన్న వున్నాయ అండి అని అడిగాను.స్టేజీ వుందంటే డ్యాన్సు కట్టేసేవాడినికాలెజిలో.ఆ కధ మరో సారి చెప్తాను లేండి.ఆ నలుగురి లో ఒకరు, మీరు డ్యన్స్ చెస్తారు కదు పోయిన సంవత్సరంరావల్సింది ,పెళ్ళి పనుల వల్ల రాలేక పోయారు అనడంతో నాకు సగం పని తగ్గిపోయింది...
ఇ సారి తప్పకుండా చేస్తానని చెప్పి, KBL సినిమాతో బాగా ఇన్స్పిరేషన్ తెచ్చుకోని వారం రోజులు చోటి సాయంతో బాగప్రాక్టీసు చేశాను.మిగతా కధ నేను చెప్పను.ఎందుకంటే డెలావేర్ తెలుగు అస్సొసియేషన్ వారు చెప్పెశారు...వారి ప్రెస్ రిలీసులో ఇలా.
DTA (Delaware Telugu Association) celebrated Dasara 2008 at the Auditorium of Hindu Temple of Delaware on Oct 18th, 2008.The event started with Carnatic music , followed by Association inaugural speech , cultural programs and competitions.
Highlights of the evening:-
1)Panchatantram Depicted through classical dance.
2)Dance by Bharath,Prem and Team .
3)The Fancy Dress(Dasara Veshalu) competition saw kids in different avatars from Hanuman to Sri Ram.
4)The event of the evening was musical concert by Anitha Krishna Group. They started of from 'sa ri ga ma pa da ni sa' with golden oldies and ended it with recent chartbusters like "karo karo jara jalsa" enthralling the audience.
Followed by Authentic Telugu Dinner .
DTA thanks DV RaoGaru,Rao Rayavarapu Garu,SanthaRamGaru,ThirumalGaru,Syam KosigiGaru and all the volunteers.